E-Paper
Advertisement

Mystery Thriller OTT : భయపడే వాళ్ళను బలి తీసుకునే ఆత్మలు… అడవి అంటేనే ఆమడ దూరం పారిపోయేలా చేసే మూవీ

Mystery Thriller OTT : భయపడే వాళ్ళను బలి తీసుకునే ఆత్మలు… అడవి అంటేనే ఆమడ దూరం పారిపోయేలా చేసే మూవీ
Advertisement

Mystery Thriller OTT : సూసైడ్ స్పాట్ లు ఎక్కువగా ఎత్తైన ప్రదేశాలలో ఉంటాయి. చావాలనుకునేవాళ్ళు అక్కడికి వెళ్తుంటారు. మనసు మార్చుకుంటే బతికి బయట పడతారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా జపాన్‌లోని అవోకిగహర అనే అడవి నేపథ్యంలో ఉంటుంది. దీనిని అక్కడ సూసైడ్ ఫారెస్ట్ అని కూడా పిలుస్తారు. జపాన్‌లో చావాలనుకున్న వాళ్లు చివరిగా వెళ్లే సూసైడ్ స్పాట్ కూడా ఇదే. అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రం తిరిగి రారు. అక్కడ జరిగిన యదార్థ సంఘటనల చుట్టూ ఒక సూపర్ నేచరుల్ హారర్ ఫిల్మ్ తెరకెక్కింది. ఇది అయోకిగహరా అడవిలో ఒక అమెరికా యువతి అనూహ్యంగా తప్పిపోతుంది. ఆమె కోసం వెతుక్కుంటూ వచ్చిన తన సోదరి చుట్టూ కథ ఉంటుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎందులో స్ట్రీమింగ్ అంటే

జేసన్ జాడా దర్శకత్వంలో వచ్చిన ఈ అమెరికన్ సూపర్ నేచురల్ హర్రర్ చిత్రం పేరు ‘ది ఫారెస్ట్’ (The Forest). ఇందులో నటాలీ డోర్మర్ (సారా, జెస్ పాత్రల్లో డ్యూయల్ రోల్ లో నటించింది. ఈ సినిమా నిజంగా జపాన్‌లోని మౌంట్ ఫుజి అడుగున ఉన్న అవోకిగహర అడవిలో జరిగిన ఆత్మహత్యల కథనాల ఆధారంగా రూపొందింది. సుమారు $10 మిలియన్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా $40 మిలియన్లకు పైగా వసూలు చేసింది. 2016లో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం Prime Video, Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సారా అనే యువతికి తన సోదరి జెస్ జపాన్ అడవుల్లో తప్పిపోయిందని సమాచారం అందుతుంది. తన సోదరి ప్రాణాలతోనే ఉందని నమ్మిన సారా, ఆమెను వెతకడానికి జపాన్ వెళ్తుంది. అక్కడ ఆమెకు ఐడెన్ అనే జర్నలిస్ట్, మిచి అనే గైడ్ సహాయం చేస్తారు. ఆ అడవిలో ఆత్మలు ఉన్నాయని, అవి మనుషుల భయాన్ని ఉపయోగించుకుని మాయ చేస్తాయని స్థానికులు హెచ్చరిస్తారు. వాళ్ళ మాటలు లెక్క చేయకుండా, తన సోదరికి ఏమి జరిగిందో తెలుసుకోవడం కోసం సారా ధైర్యంగా ఇక్కడికి వస్తుంది. చివరికి తమ దారిలోకి వచ్చిన ఎవరినైనా చంపి తినే క్రూరమైన ఆత్మలతో పోరాడాల్సి వస్తుంది. చివరకు సారా ఆ అడవిలో నుంచి బయట పడుతుందా ? ఆమె సోదరి జెస్ మిస్సింగ్ కి కారణం ఏమిటి ? నిజంగానే ఆ అడవిలో దెయ్యాలు ఉన్నాయా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : దెయ్యంతో సైంటిస్ట్ కు దబిడి దిబిడి… అమ్మాయి తోడుగా కావాలంటూ గోల… ఆస్కార్ రేసులో హర్రర్ మూవీ

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×