E-Paper
Advertisement

Andha Pyaar 2.0 Riyality Show : మరికొన్ని గంటల్లో బ్లైండ్ డేటింగ్ కామెడీ రియాలిటీ షో… కళ్ళకు గంతలు కట్టి అలాంటి పనులు.. ఎక్కడ చూడచ్చో తెలుసా ?

Andha Pyaar 2.0 Riyality Show : మరికొన్ని గంటల్లో బ్లైండ్ డేటింగ్ కామెడీ రియాలిటీ షో… కళ్ళకు గంతలు కట్టి అలాంటి పనులు.. ఎక్కడ చూడచ్చో తెలుసా ?
Advertisement

Andha Pyaar 2.0 Riyality Show  : సినిమాలు, సిరీస్ ల జోరు ఇప్పుడు ఎక్కువగానే ఉంది. అయితే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే రియాలిటీ షోలు వీటి మధ్య కొట్టుకు పోతున్నాయి. బిగ్ బాస్ సీజన్ మాత్రం జనాల్లో ఎక్కువ ఆదరణ పొందుతోంది. ఈ మధ్య అక్షయ్ కుమార్ కూడా ఓ రియాలిటీ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన బ్లైండ్ డేటింగ్ రియాలిటీ షో ఓటీటీలోకి రాబోతోంది. ‘Andha Pyaar 2.0’ అనే ఈ షో ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, ఒక వ్యక్తి రూపం చూడకుండా కేవలం మాటలు, ఫీలింగ్స్ ఆధారంగా రిలేషన్ పెట్టుకుంటారు. ముందుగా ఒక యువతికి కళ్ళకు గంతలు కడతారు. ఆమె ముందు నలుగురు యువకులు ఉంటారు. ఆమె వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలి. కనెక్షన్ క్లిక్ అయితే గంతలు తీసేసి ఫేస్-టు-ఫేస్ మాట్లాడతారు. రూపం కంటే వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఈ షోను రూపొందించారు.

ముఖ్య అతిథులు కూడా వస్తున్నారు 

ప్రముఖ కమెడియన్ వివేక్ సమతాని ఈ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సీరియస్ డేటింగ్ షో లో కామెడీని జోడించడానికి కొంత మంది కమెడియన్లు “వింగ్‌మెన్”గా వ్యవహరిస్తారు. ఈ ప్యానెల్ లో కౌస్తుభ్ అగర్వాల్, హర్ష్ గుజ్రాల్, గౌరవ్ కపూర్ వంటి ప్రముఖ హాస్యనటులు పాల్గొంటున్నారు. వీళ్లు సైడ్‌లో ఉండి జోక్స్, కామెంట్స్‌తో షోను మరింత ఎంగేజింగ్‌గా, ఫన్నీగా చేస్తారు. మొత్తానికి అందరూ కలసి ఈ బ్లైండ్ డేటింగ్ కామెడీ రియాలిటీ షో కి మరింత జోష్ ని పెంచనున్నారు.

స్ట్రీమింగ్ డేట్

Advertisement

ఈ బ్లైండ్ డేటింగ్ కామెడీ రియాలిటీ షో ZEE5లో ఎక్స్‌క్లూసివ్‌గా స్ట్రీమ్ అవుతుంది. OTTplay Premium సబ్‌స్క్రిప్షన్ ఉంటే కూడా అందుబాటులో ఉంటుంది. 2026 ఫిబ్రవరి 28 (శనివారం) నుండి ఇది స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రధానంగా ఇది హిందీలో ఉంటుంది. తెలుగు సబ్‌టైటిల్స్, మల్టీ-లాంగ్వేజ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉండవచ్చు. ఇది మల్టీ ఎపిసోడ్ సీరీస్, 7 నుంచి10 మధ్య ఉండవచ్చు. ప్రతి ఎపిసోడ్‌లో ఒక మహిళ కంటెస్టెంట్ బ్లైండ్‌ఫోల్డ్‌తో 4 సూటర్స్‌తో మాట్లాడి కనెక్ట్ అవుతుంది. వింగ్‌మెన్ కామెడియన్స్ సైడ్‌లో ఫన్ క్రియేట్ చేస్తుంటారు. వాలెంటైన్స్ వీక్ స్పెషల్‌గా రిలీజ్ అవుతున్నందున ఈ రియాలిటీ షోకి హైప్ కూడా ఎక్కువగా ఉంది. మరి ఈ ఆసక్తికరమైన షో పై మీరు కూడా ఓ లుక్ వేయండి.

Read Also : ‘పూర్ణ’ నుండి ‘భూతన్ వాలా’ వరకు… అదిరిపోయే ఈ పంజాబీ సినిమాలను ఎక్కడ చూడచ్చు అంటే ?

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×