E-Paper
Advertisement

ఈ అడవిలో ఫిజిక్స్ బయాలజీ పని చేయవు… ఒక్కసారి వెళ్తే తిరిగి రారు

ఈ అడవిలో ఫిజిక్స్ బయాలజీ పని చేయవు… ఒక్కసారి వెళ్తే తిరిగి రారు
Advertisement

psychological sci fi Thriller : మ్యాప్ లో అది ఒక అడవే. ఉపగ్రహ చిత్రాల్లో కూడా అది ఒక సాధారణ ప్రాంతంలాగే కనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్లిన సైనిక బృందాలు తిరిగి రావడం లేదు. శాస్త్రవేత్తలు అదృశ్యమవుతున్నారు. లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి పంపిన ప్రతి టీమ్ కనుమరుగవుతోంది. అలాంటి రహస్య ప్రాంతం నిజంగా ఉంటే ఎలా ఉంటుందనే ప్రశ్నకు భయంకరమైన ఊహను జోడించిన సినిమా అనిహిలేషన్ (Annihilation).

ఈ సినిమాను ఎక్కడ చూడాలి?

2018లో విడుదలైన ఈ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్‌కు అలెక్స్ గార్లాండ్ దర్శకత్వం వహించాడు. జెఫ్ వాండర్ మీర్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో నటాలీ పోర్ట్ మన్ ప్రధాన పాత్ర పోషించింది. జెన్నిఫర్ జేసన్ లీ, టెస్సా థాంప్సన్, జీనా రోడ్రిగ్స్, టువా నోవోట్నీ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉంది.

Advertisement

కథలో షిమ్మర్ అనే ఒక విచిత్రమైన ప్రాంతం ఉంటుంది. ఆకాశం నుంచి వచ్చిన ఒక రహస్యమైన శక్తి భూమిపై పడిన తర్వాత ఈ ప్రాంతం ఏర్పడుతుంది. మొదట చిన్నగా మొదలైన ఆ ప్రాంతం క్రమంగా విస్తరిస్తూ ఉంటుంది. అయితే దాని లోపలికి వెళ్లినవారు తిరిగి రావడం లేదు. వచ్చినా కూడా వాళ్లు పూర్తిగా మారిపోయి ఉంటారు. లీనా అనే బయాలజిస్ట్ పాత్రలో నటాలీ పోర్ట్ మన్ కనిపిస్తుంది. ఆమె భర్త ఒక మిలిటరీ మిషన్ లో భాగంగా షిమ్మర్ లోకి వెళ్లి నెలల తరబడి కనిపించకుండా పోతాడు. అకస్మాత్తుగా తిరిగి వచ్చినా అతని ఆరోగ్యం వేగంగా క్షీణించడం మొదలవుతుంది. దీంతో అతనికి ఏమైందో తెలుసుకోవడానికి లీనా మరో మహిళా శాస్త్రవేత్తల బృందంతో కలిసి షిమ్మర్ లోకి అడుగుపెడుతుంది.

అక్కడ మొక్కలు జంతువుల లక్షణాలు సంతరించుకుంటాయి. జంతువులు భయంకరమైన కొత్త రూపాల్లో కనిపిస్తాయి. డీఎన్ఏ స్థాయిలో జీవులు మారిపోతుంటాయి. అక్కడ ఫిజిక్స్, బయాలజీ, పరిణామ సిద్ధాంతం అన్నీ కొత్త నియమాలతో పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సినిమా ముందుకు సాగే కొద్దీ ఇది కేవలం ఏలియన్ కథ కాదని తెలుస్తుంది. మనిషి స్వభావం, విధ్వంసం, భయం, మార్పు వంటి లోతైన అంశాలను కూడా కథ ప్రశ్నిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే విజువల్స్, కాన్సెప్ట్, మ్యూజిక్ ఇప్పటికీ సైన్స్ ఫిక్షన్ అభిమానుల మధ్య చర్చకు వస్తుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మిస్టరీ, సైన్స్, సైకాలజీ కలిసిన అసాధారణ అనుభవం కోరుకునేవారికి అనిహిలేషన్ ఒక మాస్టర్ పీస్.

Tags

Related News

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా

రియాలిటీ షోస్ నుండి యానిమేషన్ వరకు… జియోహాట్‌స్టార్ లో ఈ వారం సిరీసుల సందడి

రాచరిక ముసుగులో రాజద్రోహం… చాట్ జీపీటీ, నానో బనాన వంటి ఏఐలతో తీసిన సిరీస్

Big Stories

Advertisement
×