E-Paper
Advertisement

నేనే ఐసీసీ ఛైర్మ‌న్ అవుతా..ఇండియ‌న్స్ కూడా PSL ఆడేలా రూల్స్ పెడ‌తా

నేనే ఐసీసీ ఛైర్మ‌న్ అవుతా..ఇండియ‌న్స్ కూడా PSL ఆడేలా రూల్స్ పెడ‌తా
Advertisement

Inzamam-ul-Haq: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ (Indian Premier League Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ మెగా టోర్నమెంట్… ఈ సారి కూడా బంపర్ వ్యూయర్ షిప్ అందుకుంది. దీంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. పొద్దున లేస్తే చాలు ఐపీఎల్ టోర్నమెంట్ పరువు తీసేలా వ్యవహరిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ టోర్నమెంట్ పై మాజీ పాకిస్తాన్ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ (Inzamam-ul-Haq) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ ( IPL) కంటే తమ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్  ( Pakistan Super League tournament )  గొప్పదంటూ వ్యాఖ్యానించారు. అతి త్వరలో తాను ఐసీసీ చైర్మన్ పదవి చేపడతానని… ఆ తర్వాత టీమ్ ఇండియా ప్లేయర్లు అందరూ పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడేలా రూల్ పెడతానంటూ హెచ్చరించారు. దీంతో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హ‌క్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

ఐసీసీ ఛైర్మ‌న్ అవుతా..ఇండియ‌న్స్ కూడా PSL ఆడేలా రూల్స్ పెడ‌తా

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఇటీవల గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఈ టోర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పే కుట్రలకు తెర లేపుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హ‌క్ బాంబు పేల్చారు. అతి త్వరలోనే ఐసీసీ చైర్మన్ తాను కాబోతున్నానని వ్యాఖ్యానించారు. దీనికి ఎంతో సమయం లేదని.. కచ్చితంగా చైర్మన్ అవుతానని ప్రకటించారు. తాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ కాగానే సరికొత్త రూల్స్ ప్రవేశపెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ డెవలప్మెంట్ కోసం తాను కృషి చేస్తానని వ్యాఖ్యానించారు. ఐపీఎల్ తరహాలో పాకిస్తాన్ సూపర్ లీగ్ ఓ రేంజ్ కు వెళ్లే వరకు నిద్రపోనని శపథం చేశారు. ఇండియన్ ప్లేయర్లు కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడేలా కఠిన రూల్స్ అమలు చేస్తానని కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇంజమామ్ ఉల్ హ‌క్. దీంతో ఇంజమామ్ ఉల్ హక్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

2027 తర్వాత ఐసీసీ చైర్మన్ మార్పు

ఇంజమాం అన్నట్లుగా ఐసీసీ చైర్మన్ కావాలంటే మరో ఏడాదిన్నర ఆగాల్సిందే. 2027 వన్డే వరల్డ్ కప్ పూర్తయిన తర్వాత ఐసీసీ చైర్మన్ గా ఉన్న జై షా తన బాధ్యతల నుంచి తప్పుకుంటారు. అప్పుడు కొత్త చైర్మన్ ను ఎన్నుకుంటారు. ఈ క్రమంలో ఇంజమాం పోటీ చేస్తే అతనికి మద్దతు ఎక్కువగా ఉంటేనే.. చైర్మన్ పదవి వస్తుంది. లేకపోతే చైర్మన్ పదవి పగటి కలగానే మిగిలిపోనుంది.

Advertisement

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

 

Related News

సంజు కంటే అభిషేక్ శ‌ర్మ పెద్ద‌ పోటుగాడా? అంద‌రికీ ఒకే రూల్స్ ఉండాలి

పసికూన‌ జింబాబ్వే పైన గెలవడం కాదు…మ‌గాళ్లు అయితే మాపై గెల‌వండి!

పాకిస్తాన్ ఘోర అవ‌మానం…ఏ ఒక్క కామెంటేటర్ ను పిల‌వ‌ని వెస్టిండీస్‌

వైభ‌వ్ సెంచ‌రీ మిస్…టీమిండియా చేతిలో జింబాబ్వే వైట్ వాష్

Video: వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్..స్టేడియం బయట పడ్డ బంతి

జింబాబ్వేను బెదిరించి సిరీస్ గెలుచుకున్నారు..త‌న్వీర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక ధోని కుట్ర‌లు?

జింబాబ్వే బౌలర్లు స్లో బంతులు వేశారు…అందుకే టీమిండియా గెలుపు

Big Stories

Advertisement
×