E-Paper
Advertisement

Lock Down OTT: సడన్ గా ఓటీటీలోకి వచ్చిన అనుపమ ‘లాక్ డౌన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Lock Down OTT: సడన్ గా ఓటీటీలోకి వచ్చిన అనుపమ ‘లాక్ డౌన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Advertisement

Lock Down OTT:  ఇటీవల కాలంలో ఒక సినిమా థియేటర్లలో విడుదలైన నెల రోజుల వ్యవధిలోనే తిరిగి డిజిటల్ మీడియాలో ప్రసారమవుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు థియేటర్లో మాత్రమే కాకుండా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూ ఇక్కడ కూడా సత్తా చాటుతూ ఉన్నాయి.  ఇక జనవరి నెలలో విడుదలైన సినిమాలన్నీ ప్రస్తుతం ఓటీటీలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే .ఈ నేపథ్యంలోనే మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లాక్ డౌన్ సినిమా కూడా ఓటీటీలో ప్రసారమవుతుంది అయితే ఈ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా చిత్ర నిర్మాతలు ఓటీటీలో విడుదల చేయడంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో..

అనుపమ పరమేశ్వరన్ గత ఏడాది వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈమె నటించిన లాక్ డౌన్ సినిమా కూడా గత ఏడాది విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ జనవరి 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం కరోనా సమయంలో లాక్ డౌన్(Lock Down) నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు రావడంతో ప్రేక్షకులకు పెద్దగా ఈ సినిమా ఎక్కలేదనే చెప్పాలి.

అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం..

Advertisement

ఇలా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. తెలుగు తమిళ హిందీ భాషలలో ఈ సినిమా ప్రస్తుతం ప్రసారమవుతుంది. ఏ విధమైనటువంటి సమాచారం లేకుండా ఈ సినిమా విడుదల కావడంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏఆర్ జీవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని లైకా ప్రొడక్షన్ వారు నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక థియేటర్లలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా డిజిటల్ మీడియాలో అయినా సక్సెస్ అందుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

కథ విషయానికి వస్తే..

Advertisement

చదువు పూర్తి చేసిన అనిత( అనుపమ) ఉద్యోగ ప్రయత్నాలలో ఉంటుంది అయితే ఒకరోజు తన స్నేహితులతో కలిసి ఒక పార్టీలో పాల్గొన్న ఈమెకు కొద్ది రోజులకు ప్రెగ్నెన్సీ వస్తుంది అయితే తన ప్రేగ్నెన్సీని ఇంట్లో వారికి తెలియకుండా దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది. అలాంటి సమయంలోనే లాక్ డౌన్ విధించడంతో ఈమె తన ప్రెగ్నెన్సీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడింది? చివరికి అనిత జీవితం ఏమైంది అనే నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టిన వైద్యులు యువత, సాధారణ ప్రజలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారనే నేపథ్యంలోనే ఈ సినిమా ఉందని చెప్పాలి. కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ ఈ పరిస్థితులను ఎదుర్కొన్న నేపథ్యంలోనే ఈ సినిమాని పెద్దగా ఆదరించలేకపోయారు.

Also Read: Allu Cinemas: అల్లు సినిమాస్ లో టికెట్ ధర ఎంతో తెలుసా?సామాన్యులకు అందని ద్రాక్ష..

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×