E-Paper
Advertisement

Best Cold Press Juicer: వడకట్టాల్సిన పనిలేదు, విటమిన్లు పోవు.. మీ వంటింటికి కొత్త కళను తెచ్చే బెస్ట్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్!

Best Cold Press Juicer: వడకట్టాల్సిన పనిలేదు, విటమిన్లు పోవు.. మీ వంటింటికి కొత్త కళను తెచ్చే బెస్ట్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్!

Best Cold Press Juicer: నేటి బిజీ లైఫ్ స్టైల్‌లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక సవాలుగా మారింది. మనం తాగే పండ్ల రసాల్లోని పోషకాలు యథాతథంగా శరీరానికి అందాలంటే.. సరైన జ్యూసర్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. సాధారణ జ్యూసర్ల కంటే భిన్నంగా.. కోల్డ్ ప్రెస్ జ్యూసర్లు తక్కువ వేగంతో పండ్లను నలిపి రసాన్ని తీస్తాయి. దీనివల్ల వేడి ఉత్పత్తి కాదు. ఫలితంగా విటమిన్లు, ఎంజైములు సజీవంగా ఉంటాయి. అసలు ఈ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అంటే ఏంటి? ఇది సాధారణ జ్యూసర్ల కంటే ఎలా మెరుగైందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కోల్డ్ ప్రెస్ జ్యూసర్లు:

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ ప్రతి ఒక్కరూ తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో “కోల్డ్ ప్రెస్ జ్యూసర్”అనే పేరు బాగా ప్రాచుర్యం పొందింది. దీనిని ‘స్లో జ్యూసర్’ అని కూడా పిలుస్తారు.

సాధారణ జ్యూసర్లు నిమిషానికి వేల సార్లు తిరిగే పదునైన బ్లేడ్లను కలిగి ఉంటాయి. ఈ ప్రక్రియలో ఘర్షణ వల్ల వేడి పుట్టి, పండ్లలోని సున్నితమైన పోషకాలు నశిస్తాయి. కానీ.. కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అలాకాదు. ఇది పండ్లను లేదా కూరగాయలను చాలా నెమ్మదిగా నలిపి, వాటి నుంచి జ్యూస్ వేరు చేస్తుంది.

కోల్డ్ ప్రెస్ జ్యూసర్ వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు:
1.పోషకాలు పదిలం: తక్కువ వేగంతో.. పని చేయడం వల్ల ఆక్సీకరణ జరగదు. దీని వల్ల విటమిన్ సి, ఎంజైములు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి.

2.రుచి, రంగు: సహజమైన రుచి, వాసన, రంగు మారకుండా జ్యూస్ కూడా తాజాగా ఉంటుంది.

3.ఎక్కువ జ్యూస్: సాధారణ జ్యూసర్లతో పోలిస్తే.. కోల్డ్ ప్రెస్ జ్యూసర్లు పండ్ల నుంచి ఎక్కువ పరిమాణంలో రసాన్ని పిండుతాయి. పిప్పి కూడా చాలా పొడిగా వస్తుంది.

4.నిల్వ సామర్థ్యం: ఈ జ్యూస్ త్వరగా పాడవదు. ఫ్రిజ్‌లో ఉంచితే 48 నుంచి 72 గంటల వరకు తాజాగా ఉంటుంది.

5.శబ్దం తక్కువ: ఇవి పని చేసేటప్పుడు చాలా తక్కువ శబ్దం చేస్తాయి. కాబట్టి ఉదయాన్నే ఇతరులకు ఇబ్బంది లేకుండా జ్యూస్ చేసుకోవచ్చు.

ఆకుకూరల జ్యూస్‌లకు అత్యుత్తమం:
మీరు పాలకూర, తోటకూర లేదా గోధుమ గడ్డి వంటి వాటి నుంచి జ్యూస్ తీయాలనుకుంటే.. కోల్డ్ ప్రెస్ జ్యూసర్ కంటే బెస్ట్ మరొకటి లేదు. సాధారణ జ్యూసర్లు ఆకుకూరలను సరిగ్గా గ్రైండ్ చేయలేవు. కానీ స్లో జ్యూసర్లు ఆకుల్లోని ప్రతి చుక్కను బయటకు తీస్తాయి.

Also Read: కూలర్ గాలి సరిగ్గా రావడం లేదా? ఈ 6 టిప్స్‌తో ప్రాబ్లమ్ సాల్వ్ !

కొనే ముందు గమనించాల్సిన విషయాలు:
మోటార్ పవర్: కనీసం 150-250 వాట్ల మోటార్ ఉన్న జ్యూసర్‌ను ఎంచుకోండి.

క్లీనింగ్: జ్యూసర్ విడిభాగాలు సులభంగా విడదీసి.. కడిగేలా ఉండాలి.

ఫీడింగ్ ట్యూబ్: పండ్లను ముక్కలు చేయకుండా నేరుగా వేయడానికి వెడల్పాటి నోరుఉన్న జ్యూసర్ సౌకర్యవంతంగా ఉంటుంది.

వారంటీ: మంచి బ్రాండ్ , కనీసం 2-5 ఏళ్ల మోటార్ వారంటీ ఉన్నది కొనండి.

ఖరీదు కొంచెం ఎక్కువే అయినప్పటికీ.. దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే కోల్డ్ ప్రెస్ జ్యూసర్ ఒక అద్భుతమైన పెట్టుబడి. మీరు స్వచ్ఛమైన, పోషకాలతో కూడిన జ్యూస్ ఆస్వాదించాలనుకుంటే.. మీ వంటగదిలో ఇది తప్పనిసరిగా ఉండాలి.

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×