Allu Cinemas: తెలుగు సినీ ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ కుటుంబం నుంచి హీరోలు నిర్మాతలు ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అల్లు ఫ్యామిలీ ఇటీవల అల్లు స్టూడియోస్ ఏర్పాటు చేశారు. ఇక తాజాగా థియేటర్ బిజినెస్ లోకి కూడా అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అల్లు సినిమాస్ పేరిట థియేటర్ త్వరలోనే ప్రారంభించబోతున్న సంగతి తెలిసింది. నిజానికి ఈ థియేటర్ ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగానే ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని పనులు ఆలస్యం కావడంతో మార్చి 12వ తేదీ ఎంతో ఘనంగా ప్రారంభం కాబోతోంది.ఇప్పటికే అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయ్యాయని తెలుస్తుంది . ఇక ఈ సినిమాస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీద ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. మన హైదరాబాదులోనే అత్యంత పెద్ద స్క్రీన్, అధునాతన సౌకర్యాలతో ఏర్పడిన థియేటర్ గా అల్లు సినిమా పేరుగాంచింది. హైదరాబాదులోని కోకాపేటలో ఏర్పాటు చేసిన ఈ థియేటర్లో 75 అడుగుల స్క్రీన్ ఏర్పాటు చేసి ఉంది. హైదరాబాదులో ఇంత పెద్ద స్క్రీన్ కలిగిన మొట్టమొదటి థియేటర్ అల్లు సినిమాస్ కావటం విశేషం.
ఈ థియేటర్ మొత్తం నాలుగు స్క్రీన్ లతో ఏర్పాటు చేసి ఉంది .మూడు సాధారణ స్క్రీన్లు కాగా ఒకటి మాత్రం డాల్బీ స్క్రీన్ తో ఏర్పాటు చేయబడి ఉందని చెప్పాలి. ఇక ఈ థియేటర్లో ప్రత్యేకమైన సౌండ్ సిస్టం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఇలా ప్రత్యేకమైన ఏర్పాట్లతో రూపొందించిన ఈ థియేటర్లో సినిమా చూడాలి అంటే ఎంత ఖర్చు చేయాలని అనే విషయంపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా వస్తుంది అంటేనే ప్రభుత్వాలు సైతం టికెట్ల రేట్లు పెంచుతూ ఉత్తర్వులను జారీ చేస్తున్నారు. ఇక ఇలాంటి థియేటర్లలో సినిమాలను చూడాలి అంటే సామాన్యులకు కష్టమే అని చెప్పాలి.
కోకాపేటలో త్వరలో ప్రారంభం కాబోతున్న అల్లు సినిమాస్ లో సాధారణ రోజుల్లో టికెట్ ధర. సుమారు ₹500, కొత్త సినిమా రిలీజ్ టైంలో ₹1000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇలా ఒక వ్యక్తి ఈ థియేటర్లో సినిమా చూడటం కోసం 500 రూపాయలు టికెట్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలుస్తుంది. ఉగాది పండుగ సందర్భంగా స్క్రీన్ పై మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రసారం కాబోతుందని తెలుస్తోంది.
సామాన్యులకు భారంగా మారుతున్న సినిమాలు..
ఇక ఈ సినిమాతో పాటు బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమా కూడా ప్రసారం కాబోతుందని తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ సినిమా థియేటర్లో సినిమా టికెట్ రేట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విభిన్న రీతిలో స్పందనలు లభిస్తున్నాయి ఇలాంటి థియేటర్లలో సామాన్య ప్రేక్షకులు సినిమా చూడటం అంటే అందరిని ద్రాక్ష లాంటిది అనే చెప్పాలి. ఒక మధ్య తరగతి కుటుంబం తన ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలి అంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా వేళలో ఖర్చు చేయడం అంటే సామాన్యులకు భారంగా మారుతుందనే చెప్పాలి.
Also Read: Rashmika Mandanna: మెహందీ ఫోటోలను షేర్ చేసిన రష్మిక.. త్వరగా అయిపోయిందంటూ పోస్ట్!