E-Paper
Advertisement

బాసిల్ జోసెఫ్ – టోవినో థామస్ ‘అతిరడి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

బాసిల్ జోసెఫ్ – టోవినో థామస్ ‘అతిరడి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Advertisement

Athiradi OTT Release : మలయాళం ఓటీటీ మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్. థియేటర్లలో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకున్న మలయాళ చిత్రం ‘అతిరడి’ (Athiradi) ఇప్పుడు OTTలోకి రాబోతోంది. మరి ఈ మూవీని ఏ ఓటీటీలో చూడొచ్చు ? స్టోరీ ఏంటి ? ఐయండీబీలో రేటింగ్ ఎంత ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

ఎక్కడ చూడాలి ?

బాసిల్ జోసెఫ్, టోవినో థామస్ కలిసి నటించిన ఈ యాక్షన్-కామెడీ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అరుణ్ అనిరుద్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది మే 14న థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. IMDbలో 7.7 రేటింగ్ సాధించిన ఈ సినిమా ఇప్పుడు డైరెక్ట్ గా మన ఇంటికి వచ్చేస్తోంది. ‘అతిరడి’ సినిమా 2026 జూన్ 19న సోనీ లివ్ (SonyLIV) OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదలవుతోంది.  ఈ సినిమా మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుంది. 2 గంటల 37 నిమిషాల నిడివి గల ఈ చిత్రం కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్ లా ఉంటుంది.

సినిమా కథ ఏమిటి ?

Advertisement

సమ్‌కుట్టి (సమ్ బాయ్) చుట్టూ తిరుగుతుంది కథ. సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి అయిన సమ్ తన ప్రేయసి స్వాతిని గాఢంగా ప్రేమిస్తాడు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన తొక్కిసలాట వల్ల నిషేధించబడిన కాలేజీ ఆరోహణ ఉత్సవాన్ని మళ్లీ స్టార్ట్ చేయాలని సమ్ నిర్ణయించుకుంటాడు. ఈ ప్రయత్నంలో అతను శ్రీకుట్టన్‌ను కలుస్తాడు. ఒకప్పుడు రౌడీగా ఉండి ఇప్పుడు సంగీతకారుడిగా మారిన శ్రీకుట్టన్ ఆ ఉత్సవం నిషేధానికి ముఖ్య కారణం. ఇద్దరి మధ్య వైరం, అహం ఘర్షణ ఈ స్టేజ్ లో మరింత ముదిరిపోతుంది. శ్రీకుట్టన్ తన పాత రూపం ‘తొట్ట కుట్టన్’గా మారి ఉత్సవాన్ని మళ్లీ నాశనం చేయాలని ప్లాన్ చేస్తాడు. ఇక్కడి నుంచి సినిమా యాక్షన్, కామెడీ, ఎమోషన్ మూడూ అద్భుతంగా మిళితమై ఆకట్టుకుంటుంది. మరి ఇంతకీ సమ్ అనుకున్న పనిని సవ్యంగా చేయగలిగాడా ? తొట్ట కుట్టన్ వల్ల ఉత్సవం ఎందుకు ఆగింది ? ఆ ఉత్సవాన్ని ఆపడానికి కుట్టన్ చేసిన ప్రయత్నాలు ఏంటి ? అన్నది తెలియాలంటే మూవీ ఓటీటీలోకి వచ్చేదాకా ఆగాల్సిందే.

Also Read : ఒక్క క్షణం కూడా విసుగు రాకుండా పరుగులు తీసే సౌత్ మూవీస్… చివరి క్షణం వరకూ వీడని సస్పెన్స్

ఎందుకు చూడాలి?

Advertisement

.ఈ సినిమాలో ఇద్దరు మలయాళ స్టార్స్ బాసిల్ జోసెఫ్, టోవినో థామస్ ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే రియా శిబు, వినీత్ శ్రీనివాసన్, జరీన్ షిహాబ్, షాన్ రెహమాన్, విష్ణు అగస్త్య, పి. సుకుమార్, షెల్విన్ జేమ్స్, జియో బేబీ, హషీర్ హెచ్, దర్శన రాజేంద్రన్, దేవన్ కీలక పాత్రలు పోషించారు.

‘మిన్నల్ మురళి’ జంట మళ్లీ కలిసి ఈ సినిమాలో దర్శనం ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణ. ‘అతిరడి’ సినిమా యాక్షన్-కామెడీ మాత్రమే కాదు… కాలేజీ ఉత్సవాలు, స్నేహం, ప్రేమ, వైరం, ప్రతీకారం అన్నీ హాస్యంతో కలిపి అద్భుతంగా చూపించారు. టోవినో థామస్ కామెడీ టైమింగ్, బాసిల్ జోసెఫ్ ఎనర్జీ ప్రేక్షకులను అలరిస్తాయి. థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ సినిమాను ఇకపై ఇంట్లోనే సౌకర్యంగా చూడొచ్చు.

Tags

Related News

పెళ్ళయిన వ్యక్తితో రిలేషన్ లో… మెదడును కదిలించే క్లైమాక్స్

లవర్ కు మతిమరుపు వస్తే… కన్నీళ్ళు పెట్టించే తెలుగు రొమాంటిక్ డ్రామా

గర్ల్ ఫ్రెండ్ కోసం కుక్కను తెచ్చి కొత్త చిక్కుల్లో… డాగ్ లవర్స్ డోంట్ మిస్

ఒకరి తర్వాత ఒకరు సైకోలుగా మారి హత్యలు చేసే పేరున్న వ్యక్తులు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

యాక్సిడెంట్, కట్ చేస్తే ప్రేమించిన అమ్మాయి భార్యగా… మెంటలెక్కించే తమిళ సై-ఫై రొమాంటిక్ థ్రిల్లర్

ఏం సిరీస్ గురూ… మనుషుల్ని చంపి పచ్చి మాంసం నోట్లో కుక్కే కిల్లర్

50 రోజులు అందమైన అమ్మాయితో గదిలో కాలు బయట పెట్టకుండా… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ

ఏడుగురు ఆవారాగాళ్ల కథ… షార్ట్ కట్ లో కోటీశ్వరులు అవ్వాలనుకునే కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×