E-Paper
Advertisement

ఒక్క క్షణం కూడా విసుగు రాకుండా పరుగులు తీసే సౌత్ మూవీస్… చివరి క్షణం వరకూ వీడని సస్పెన్స్

ఒక్క క్షణం కూడా విసుగు రాకుండా పరుగులు తీసే సౌత్ మూవీస్… చివరి క్షణం వరకూ వీడని సస్పెన్స్
Advertisement

Top 10 Fast Paced Movies : దటి నుంచి చివరి వరకు విసుగు లేకుండా… సస్పెన్స్, యాక్షన్, ఉత్కంఠతో మిమ్మల్ని సీట్లకు అతుక్కుపోయేలా చేసే సినిమాలు కావాలంటే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. భారతీయ సినిమాల్లో యాక్షన్, థ్రిల్లర్, ఎమోషన్ కలిపి అద్భుతమైన కథలు ఎన్నో ఉన్నాయి. ఇవి చూస్తే సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. ఈ సినిమాలను ఇప్పుడు OTTలో ఈజీగా చూడవచ్చు. మరి ఆ ఇంట్రెస్టింగ్ సౌత్ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆవేశం

కామెడీ ప్లస్ యాక్షన్ సందడితో కాలేజీ విద్యార్థులు ఒక గ్యాంగ్‌స్టర్ సాయంతో తమను వేధించే వాళ్లపై ప్రతీకారం తీర్చుకునే కథ ఇది. ఫన్నీ డైలాగులు, తీవ్రమైన యాక్షన్ సీన్లు, సరదా సన్నివేశాలు అన్నీ ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. యాక్షన్ ఫ్యాన్స్‌కి తప్పకుండా చూడాల్సిన చిత్రం.

దృశ్యం

Advertisement

తన కుటుంబాన్ని కాపాడడానికి ఒక సామాన్యుడు చట్టాన్ని, వ్యవస్థను ఎలా ధిక్కరిస్తాడో చూపించే ఈ సినిమా ఇప్పటికీ థ్రిల్లర్ లవర్స్ ఫేవరెట్. ప్రతి సన్నివేశం ఉత్కంఠతో నిండి ఉంటుంది. హాట్‌స్టార్‌లో ఈ మూవీని చూడవచ్చు. ఇంత మైండ్ బెండింగ్ సినిమాలు రావడం చాలా అరుదు.

కైతి – రియల్ టైమ్ థ్రిల్

మాజీ ఖైదీ ఒక్క రాత్రి పోలీసుల రెస్క్యూ మిషన్‌ లో చిక్కుకుపోయి ఎలా పోరాడతాడో ఇందులో చూడొచ్చు. ఈ చిత్రం పూర్తి రియల్ టైమ్‌లో సాగుతుంది. వేగం, సస్పెన్స్, యాక్షన్ అన్నీ అదిరిపోయేలా ఉంటాయి. సోనీ LIVలో స్ట్రీమింగ్ అవుతోంది.

కాంతారా

Advertisement

ఎపిక్ జానపద కథలు, సంప్రదాయాలు, ప్రకృతి మధ్య సంఘర్షణను అద్భుతంగా చూపించిన సినిమా ఇది. యాక్షన్‌తో పాటు భావోద్వేగాలు, సంస్కృతిని ఇందులో డెప్త్ గా చూపించారు. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

మాస్టర్

ఎమోషన్ ప్లస్ యాక్షన్ కలయికలో వచ్చిన మూవీ ఇది. తాగుబోతు ప్రొఫెసర్‌కు, క్రూరమైన గ్యాంగ్‌స్టర్‌కు మధ్య జరిగే ఘర్షణ చూడడానికి బాగుంటుంది. కళాశాల, బాలల గృహం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో శక్తివంతమైన యాక్షన్ సీన్లు, హృదయాన్ని తాకే ఎమోషన్స్ ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో దీన్ని చూడవచ్చు.

మిన్నల్ మురళి

మెరుపు దాడికి గురై అద్భుత శక్తులు పొందిన ఒక సాధారణ దర్జీ సూపర్‌ హీరోగా ఎలా మారాడు అన్నదే ఈ చిత్రం కథ. ఇండియన్ స్టైల్‌లో తీసిన ఈ సూపర్‌హీరో చిత్రం ఎంతో సరదాగా ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

రాట్ససన్ – సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

పాఠశాల విద్యార్థులను టార్గెట్ చేసి హత్యలు చేసే సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి ఒక పోలీస్ అధికారి చేసే ప్రయత్నాలు ఇక్కడ చూడవచ్చు. ఉత్కంఠ, ఆలోచనాత్మక మలుపులు ఎక్కువగా ఉంటాయి. హాట్‌స్టార్‌లో దీన్ని చూడొచ్చు.

సూపర్ డీలక్స్ – విక్రమ్

సూపర్ డీలక్స్ లో వేర్వేరు పాత్రలు ఒక్క రోజులో విచిత్ర పరిస్థితుల్లో చిక్కుకుంటారు. ఊహించని ట్విస్టులు ఉంటాయి. ఇది నెట్ ఫ్లిక్స్ లో ఉండగా, హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’ కూడా ఈ లిస్ట్ లో ఉంది. హాట్‌స్టార్ లో ఈ మూవీని వీక్షించొచ్చు.

జిగర్తాండ డబుల్ ఎక్స్

జిగర్తాండ డబుల్ ఎక్స్ 1970ల నేపథ్యంలో రహస్య పోలీసు మిషన్, గ్యాంగ్‌స్టర్లు, సినిమా పరిశ్రమ మధ్య సాగే శక్తివంతమైన కథ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలు చూస్తే ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు.

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×