OTT Movie : సుప్రియా పాఠక్ నటించిన ‘ఆంటీప్రెన్యూర్’ సినిమా, థియేటర్లలో విడుదలైన అరు నెలల తరువాత ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ గుజరాతీ సినిమా వుమెన్ ఎంపవర్‌మెంట్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, స్టాక్ మార్కెట్ అంశాలతో ఆసక్తికరంగా నడుస్తుంది. ‘ఖిచ్డి’ అనే టీవీ షోలో హన్సా పరేఖ్ పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకర్షించిన సుప్రియా పాఠక్, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆంటీప్రెన్యూర్‌తో తిరిగి వచ్చారు. ఈ సినిమాకి ఐయండిబిలో 9.7/10 టాప్ రేటింగ్ ఉండటం విశేషం. కోటి రూపాయాల పన్ను చెల్లించే కాన్సెప్ట్ తో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇది ఒక మస్ట్ వాచ్ మూవీ. దీని కథ ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘ఆంటీప్రెన్యూర్’ (Auntypreneur )2025లో రిలీజ్ అయిన గుజరాతీ ఫీల్ గుడ్ కామెడీ మూవీ. ముంబైలోని ఒక గుజరాతీ కాలనీ సెట్టింగ్‌లో విడుదల అయింది. డైరెక్టర్ ప్రతీక్ రాజెన్ కోఠారీ. రైటర్స్ శ్రేయా సింగ్, అభినవ్ వైద్య స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా రూపొందింది. 2 గంటల 17 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా, 2025 ఏప్రిల్ 25న థియేట్రికల్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో సుప్రియా పాఠక్ కపూర్, బృందా త్రివేది, మార్గీ దేశాయ్, యుక్తి రాండేరియా, వైభవి భట్ట్, కౌశాంబీ భట్ట్, పరిక్షిత్ తమలియా నటించారు. ఈ సినిమా 2025 నవంబర్ 13 నుంచి షెమరూమీ, టీటీప్లే లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సినిమా కథ “ధర్తి నో చెడో ఘర్” (భూమి చివరి గది కూడా ఇల్లే) అనే థీమ్‌తో మొదలవుతుంది. ముంబైలోని ఒక గుజరాతీ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో 65 ఏళ్ల జాసుబెన్ అనే వృద్ధ మహిళ ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటుంది. జాసుబెన్, ఆమె హౌసింగ్ సొసైటీలోని వ్యక్తులు రూ. 1 కోటి ఆస్తి పన్ను చెల్లించని కారణంగా, అపార్ట్‌మెంట్‌ల నుండి వెళ్ళగొట్టబడతారని ప్రభుత్వ అధికారులు బెదిరిస్తారు. 3 నెలల్లో డబ్బు సెటిల్ చేయాలని వార్నింగ్ ఇచ్చి వెళతారు. ఆమె ఈ సమస్యను పరిష్కరించడానికి, సమస్యను తన చేతుల్లోకి తీసుకుని నిధులు సేకరించడానికి ప్రయత్నిస్తుంది.
Read Also : పిల్లల కళ్ళను తీసుకుని ఆయుష్షు పెంచుకునే దిక్కుమాలినోళ్లు… ఒళ్ళు ఝల్లుమనిపించే హర్రర్ థ్రిల్లర్
జాసుబెన్ హౌసింగ్ సొసైటీ నుండి కొంతమంది మహిళలను సేకరించి, ఇళ్ళు కూలిపోకుండా కాపాడటానికి ఒక మార్గాన్ని వెతుకుటుంది. జాసుబెన్ కాలనీలో ఉండే ఒక స్టాక్ మార్కెట్ బ్రోకర్, ఆమెకు స్టాక్ మార్కెటింగ్ నేర్పుతాడు. జాసుబెన్ గ్రూప్ స్టాక్ మార్కెట్ కాన్సెప్ట్స్ లెర్న్ చేస్తూ, చిన్న ఇన్వెస్ట్‌మెంట్స్‌తో స్టార్ట్ చేస్తారు. కానీ మార్కెట్ ఫాల్స్, ఫ్రాడ్స్ వల్ల లాసెస్ వస్తాయి. క్లైమాక్స్‌లో ఒక బిగ్ ఇన్వెస్ట్‌మెంట్ ఛాన్స్ వస్తుంది. వాళ్లు రిస్క్ తీసుకుని డబ్బులు పెడతారు. చివరికి వాళ్ళు కోటిరూపాయాల పన్ను కడతారా ? లేక అపార్ట్మెంట్ ను ఖాళీ చేస్తారా ? అనే విషయాలను, ఈ ఫీల్ గుడ్ సినిమాను చూసి తెలుసుకోండి.