E-Paper
Advertisement

Bad Newz OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘యానిమల్’ బ్యూటీ బోల్డ్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Bad Newz OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘యానిమల్’ బ్యూటీ బోల్డ్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
Advertisement

Bad Newz OTT Release: బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి డిమ్రీ, అమ్మీ విర్క్ ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీ ‘బ్యాడ్ న్యూజ్’.  జులై 19న థియేటర్లలో విడుదలైన ఈ బోల్డ్ మూవీకి ప్రేక్షకుల నుంచి మాంచి ఆదరణ దక్కింది.

ఆనంద్ తివారీ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది. సుమారు రూ. 70 కోట్లకు పైగా వసూళు చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ క్రేజీ న్యూస్ చెప్పారు. థియేటర్లలో చూడటం మిస్సైన ప్రేక్షకులు ఇకపై ఇళ్లలోనే చూసుకోవచ్చని వెల్లడించారు. ఇవాళ్టి(సెప్టెంబర్ 13) నుంచి ఈ కామెడీ డ్రామా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు.

Advertisement

ఇప్పటి వరకు సబ్‌ స్క్రిప్షన్ ఛార్జ్.. ఇప్పుడు ఫ్రీ..

వాస్తవానికి ‘బ్యాడ్ న్యూజ్’ సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. కానీ, సబ్‌ స్క్రిప్షన్ ఫీజు చెల్లించిన వారికే సినిమా చూసే అవకాశాన్ని కల్పించింది. ఇప్పటి వరకు  ఈ  మూవీని చూడాలంటే రూ. 349 చెల్లించాల్సి వచ్చేది. ప్రస్తుతం సబ్‌ స్క్రిప్షన్ ఫీజు లేకుండానే సినిమా చూసే అవకాశం కల్పిస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది. హిందీలో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌ తో చూడొచ్చని చెప్పింది.

Advertisement

Also Read: నయనతారకు హ్యాకర్స్ షాక్.. వారికి రిక్వెస్ట్ చేసిన లేడీ సూపర్ స్టార్

ఇంతకీ ఈ సినిమా కథ ఏంటంటే?

విక్కీ కౌశల్,  త్రిప్తి డిమ్రీ, అమీ విర్క్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. జీవితంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలి అనుకునే అమ్మాయి.. తప్పని సరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లి తర్వాత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంటుంది. కొద్ది రోజుల తర్వాత ప్రెగ్నెంట్ అవుతుంది.

మెడికల్ రిపోర్టులలో ఆమె కడుపులో పెరిగే బిడ్డకు ఇద్దరు తండ్రులు అని తేలుతుంది. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి ఎలాంటి పరిణామాలను ఫేస్ చేయాల్సి వచ్చింది? అనే విషయాన్ని ఆనంద్ తివారీ ఫుల్ కామెడీగా తెరకెక్కించారు. ‘యానిమల్’ సినిమా తర్వాత నేషనల్ క్రష్ త్రిప్తి డిమ్రీ నటించిన ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.  ప్రేక్షకులను నుంచి ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కింది.

‘బ్యాడ్ న్యూజ్’ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్ తో కలిసి ప్రైమ్ వీడియో తెరకెక్కించింది. హిరూ యష్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అమృతపాల్ సింగ్ బింద్రా, ఆనంద్ తివారీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఆనంద్ తివారీ దర్శకత్వం వహించగా నేహా ధూపియా, షీబా చద్దా, నేహా శర్మ, విజయలక్ష్మి సింగ్, ఫైసల్ రషీద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×