BigTV English
Advertisement

Nurse Cuts off Doctor Genitals: డాక్టర్ ప్రైవేట్ భాగాలు కోసేసిన నర్సు.. ఏం చేశాడంటే..

Nurse Cuts off Doctor Genitals: డాక్టర్ ప్రైవేట్ భాగాలు కోసేసిన నర్సు.. ఏం చేశాడంటే..

Nurse Cuts off Doctor Genitals| దేశంలో మహిళలపై అత్యాచార ఘటనల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. కోల్ కతాలొ ఓ మహిళా డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఇటీవల దేశ వ్యాప్తంగా దుమారం రేపింది. దీంతో వైద్య సిబ్బందిపై దాడులు జరగకుండా చట్టాలు తీసుకురావాలని వైద్య సంఘాలు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఓ మహిళా వైద్య సిబ్బందిపై అత్యాచార యత్నం జరిగింది. అది కూడా సామూహిక అత్యాచారం చేసేందుకు ఆస్పత్రిలోనే ఆమెపై దాడి జరిగింది. అయితే తన ఆత్మరక్షణ కోసం బాధితురాలు డాక్టర్ పై కత్తితో దాడి చేసింది. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. బిహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలో ఆర్‌బిఎస్ హెల్తె కేర్ సెంటర్ అనే ప్రైవేట్ ఆస్పత్రి ఉంది. ఆ ఆస్పత్రిలో హేమ (పేరు మార్చబడింది) అనే యువతి నర్సుగా ఉద్యోగం చేస్తోంది. అదే ఆస్పత్రిలో సంజయ్ కుమార్ అనే డాక్టర్ వద్ద ఆమె పనిచేస్తోంది.

Also Read: సహజీవనం చేసిన వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన యువతి.. ఈజీగా బెయిల్ తెచ్చుకున్న నిందితుడు.. ఎలాగంటే?


ఈ క్రమంలో బుధవారం సెప్టెంబర్ 11, 2024 రాత్రి హేమ, డాక్టర్ సంజయ్ కుమార్ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే డాక్టర్ సంజయ్ ను కలవడానికి అతని మిత్రులు అవధేశ్ కుమార్, సునీల్ కుమార్ గుప్తా వచ్చారు. దీంతో డాక్టర్ సంజయ్ డ్యూటీ లో ఉన్నా.. వారితో కలిసి ఆస్పత్రిలోనే ఒక రూమ్ లోకి వెళ్లాడు. అక్కడ వారద్దరూ తెచ్చిన మద్యం సేవించాడు. ముగ్గురూ మద్యం సేవించిన తరువాత.. ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న హేమను రేప్ చేయాలని ప్లాన్ చేశారు.

అందుకోసం ముందుగా ఆస్పత్రిలోని సిసిటీవి కెమెరాల కనెక్షన్ కట్ చేశారు. ఆ తరువాత నర్సు హేమను డాక్టర్ సంజయ్ విడిగా ఉన్న గదిలోకి పిలిచాడు. ఆ గదిలోకి హేమ వెళ్లగానే తలుపుల వెనుక నిలబడి ఉన్న ఇద్దరు అవధేశ్, సునీల్ కుమార్ తలుపులు మూసేశారు. హేమ వెనక్కు తిరిగి చూసి భయపడిపోయింది. వారిద్దరూ కలిసి నర్సు హేమను కొట్టారు. ఆ తరువాత డాక్టర్ సంజయ్ ఆమెను బలవంతంగా లొంగదోసుకొని తనతో పేషెంట్ బెడ్ వైపుకి తీసుకెళ్లాడు. డాక్టర్ సంజయ్ తన ప్యాంటు విప్పి హేమ వైపుకి రాగా.. అనుకోకుండా హేమ చూపు పక్కన ఉన్న కత్తెర, సర్జికల్ నైఫ్ పై పడింది. దీంతో హేమ ఒక్కసారిగా డాక్టర్ సంజయ్ ని తోసేసి.. ఆ కత్తెర, సర్జికల్ బ్లేడ్ ని ఆమె తీసుకుంది.

అయితే మత్తులో ఉన్న డాక్టర్ సంజయ్ ఆమె చేతిలో ఉన్న కత్తిని గమనించకుండా ముందుకి వెళ్లిపోయాడు. హేమకు ఏం చేయాలో తోచక.. ఆ కత్తితో డాక్టర్ సంజయ్ మర్మాంగాలను కోసేసింది. ఆ తరువాత డాక్టర్ సంజయ్ కిందపడిపోయి బాధతో ఏడుస్తూ ఉండగా.. అక్కడికి మిగతా ఇద్దరు వచ్చారు. నర్సు హేమ వెంటనే వారిద్దిరిని కూడా తోసేసి పరిగెడుతూ గది బయటి నుంచి లాక్ చేసుకుది. ఆ తరువాత మరో గదిలోకి వెళ్లి పోలీసులకు ఫోన్ చేసింది.

Also Read: భర్త కావలెను.. రూ.30 లక్షల ప్యాకేజీ, 3 BHK ఇల్లూ ఉండాలట, పెళ్లి కోసం యాడ్ ఇచ్చిన విడాకుల మహిళ

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని.. నర్సు హేమను అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ సంజయ్, అతని ఇద్దరు మిత్రులను అరెస్ట్ చేశారు. వారంతా మద్యం సేవించిన తరువాత అక్కడే వదిలేసిన బాటిళ్లను, నర్సు హేమ ఉపయోగించిన కత్తిని ఆధారాలుగా సీజ్ చేశారు. బిహార్ లో మద్య నిషేధం ఉన్నందున వారిపై అక్రమ మద్య రవాణా కేసు కూడా నమోదు చేశారు. డాక్టర్ సంజయ్ ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Related News

Travel Bus Burnt: ప్రైవేటు ట్రావెల్ బస్సు దగ్దం.. ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

Acid Attack Case New Twist: ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో కీలక మలుపు, బాధితురాలి తండ్రి అరెస్ట్

Medak News: కర్నూల్ బస్సు ప్రమాదం.. 3రోజుల తర్వాత తల్లీకూతుళ్ల అంత్యక్రియలు, స్థానికుల కంటతడి

Kurnool Bus Accident: వీడని మృత్యువు.. కర్నూలు మృతుల అంత్యక్రియలకు వెళ్లొస్తూ..

Cyber Crime: ముగ్గురు సోదరీమణుల ఏఐ జనరేటేడ్ ఫోటోలతో బ్లాక్‌మెయిల్.. ఆత్మహత్య చేసుకున్న సోదరుడు!

Shocking Video: పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు.. కాపాడే ప్రయత్నంలో

Delhi Crime: ప్రియుడిని దారుణంగా ప్లాన్ చేసి హత్య చేసిన ప్రియురాలు.. చివరకు ఏమైందంటే?

Gold Theft: నిజామాబాద్‌లో దొంగల బీభత్సం.. భారీగా బంగారం, వెండి నగలు చోరీ

Big Stories

×