Best Thriller Movies on OTT : మూవీస్ ఈరోజుల్లో ఆడియన్స్ పై సినిమాల ఎఫెక్ట్ ఎంతగా ఉందంటే… సందర్భం ఏదైనా సినిమాను చూడకుండా ఉండలేరు. కొన్ని సినిమాలు మనసును కదిలించేలా ఉంటే, మరికొన్ని మాత్రం ఆలోచనల్లో పడేస్తాయి. అయితే సైకలాజికల్ థ్రిల్లర్స్ మాత్రం ప్రేక్షకుడి మైండ్ తో గేమ్స్ ఆడతాయి. ఇలాంటి సినిమాల ప్రభావం రోజుల తరబడి వెంటాడుతూ ఉంటుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ముఖ్యంగా సీరియల్ కిల్లర్స్ కు సంబంధించిన సినిమాలు, అందులో ఉండే భయంకర కోణాలు, ఊహించని ట్విస్టుల ఎఫెక్ట్ స్ట్రాంగ్ గా ఉంటుంది. మీకు కూడా ఇలాంటి సినిమాలంటే ఇష్టమా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ఇందులో కొన్ని బుర్ర బ్లాస్టింగ్ థ్రిల్లర్స్ గురించి తెలుసుకుందాం.
ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సింది We Need to Talk About Kevin మూవీ గురించే. ఒక తల్లి తన కొడుకును అర్థం చేసుకోలేక అనుభవించే మానసిక నరకాన్ని చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే. చిన్నప్పటి నుంచే సైకోలా బిహేవ్ చేసే కెవిన్ ఎదుగుతున్న కొద్దీ బ్రూటల్ గా మారతాడు. ఈ విషయం తల్లి తెలుసుకునే సరికే ఆలస్యం అయిపోతుంది.
సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్స్ లో Se7en ఒక మాస్టర్ పీస్. David Fincher తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికీ హాలీవుడ్ లోని బెస్ట్ థ్రిల్లర్ సినిమాలలో ఒకటి. బైబిల్‌లోని ఏడు మహాపాపాల ఆధారంగా జరిగే హత్యలను ఇందులో అత్యంత భయంకరంగా చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశం ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యంత షాకింగ్ ఎండింగ్స్ లో ఒకటిగా నిలిచిపోవడం అన్నది ఈ సినిమా ప్రత్యేకత
జపనీస్ సినిమాల్లో ఇంటెన్స్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకున్న సినిమాల్లో Cure ఒకటి. సినిమాలో వరుస హత్యలు జరగడం అన్నది కామన్. కానీ ఆ మర్డర్స్ చేస్తున్న వాళ్ళకే ఎందుకు చేస్తున్నారు అన్నది గుర్తు ఉండకపోవడం అన్నది ఈ మూవీ స్పెషల్ స్టోరీ లైన్. ఈ విచిత్ర ఘటనల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే డిటెక్టివ్ ప్రయాణమే ఈ మూవీ స్టోరీ. సినిమాను చూడడం పూర్తయ్యాక కూడా ఆ థ్రిల్ మనసును వెంటాడుతూ ఉంటుంది.
మనుషుల క్రూరత్వాన్ని రా అండ్ రస్టిక్ గా చూపించిన మూవీనే The House That Jack Built. డైరెక్టర్ Lars von Trier ఈ సినిమాలో సీరియల్ కిల్లర్ మనస్తత్వాన్ని అత్యంత భయంకరంగా ఆవిష్కరించారు. జాక్ అనే హంతకుడు తన ప్రతి హత్యను ఒక కళాఖండంలా భావించడం చూస్తే ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటుంది.
Read Also : ఆయుష్షును దొంగిలించే రాక్షసుడు… ‘స్ట్రేంజర్ థింగ్స్’ రేంజ్ లో అదరగొడుతున్న సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్