E-Paper
Advertisement

దృశ్యం సినిమాను మించిన ట్విస్టులు.. ఊపిరి బిగబట్టే సస్పెన్స్! OTTలో మిస్ అవ్వకూడని 7 బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇవే!

దృశ్యం సినిమాను మించిన ట్విస్టులు.. ఊపిరి బిగబట్టే సస్పెన్స్! OTTలో మిస్ అవ్వకూడని 7 బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇవే!
Advertisement

Crime Thrillers : ఎన్ని జానర్స్ ఉన్నా క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు ఉండే క్రేజ్ మాములుగా ఉండదు. సినిమా చూస్తుంటే కథలోకి లాగేసే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేని, మైండ్ బ్లాంక్ చేసే ట్విస్టులని, క్లైమాక్స్ వరకు టెన్షన్ పెట్టే సస్పెన్స్‌ని.. టోటల్ గా అసలు ఎవరు ఎలా ఎందుకు చేశారా అని క్యూరియాసిటీ పెంచే సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్స్‌ని కోరుకోని థ్రిల్లర్ లవర్స్ ఎవరుంటారు? అలాంటి వారి కోసమే స్పెషల్ గా 7 బెస్ట్ అండర్‌రేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లని ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. ఏ మాత్రం టైమ్ దొరికినా వీటిని అసలు మిస్ కాకండే. మరి ఆ 7 బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ లేంటో చూసేద్దామా!

ముందుగా ది నైట్ ఆఫ్ (The Night Of)

Advertisement

ది నైట్ ఆఫ్ (The Night Of) అనే సిరీస్ గూర్చి చెప్పుకోవాలి. రిజ్ అహ్మద్, జాన్ టుర్టురో, బిలాల్ మహమ్మద్ లు నటించిన ఈ సిరీస్‌కి స్టీవెన్ జైలియన్, జేమ్స్ మార్ష్ లు దర్శకత్వం వహించారు. మన జీవితంలో తీసుకునే ఒక్క తప్పు నిర్ణయం మొత్తం జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుందో కళ్ళకి కట్టినట్టు చూపించారు. ఒక రాత్రి పార్టీ తర్వాత నిద్రలేచిన నాజ్ (రిజ్ అహ్మద్) కు పక్కన ఉన్న అమ్మాయి శవమై కనిపిస్తుంది. పోలీసులు అతన్నే నిందితుడిగా అనుకుంటారు. దీంతో ఈ కేసులో అతన్ని రక్షించడానికి లాయర్ జాన్ స్టోన్ చేసే ప్రయత్నాలు, న్యూయార్క్ న్యాయవ్యవస్థలోని లోపాలను ఈ సిరీస్ అత్యంత రియలిస్టిక్‌గా ఆవిష్కరించింది. మరి జియో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ ది నైట్ ఆఫ్ ని చూసి ఎంజాయ్ చేయండి.

also read:మెగాస్టార్ ఆగిపోయిన సినిమా వెనుక ఆ హీరోయిన్! రజనీకాంత్‌తో చిరు విలన్ గా మారడానికి అసలు కారణం ఇదేనా?

Advertisement

 రెండవ క్రైమ్ థ్రిల్లర్: కోహ్రా (Kohrra)

సువిందర్ విక్కీ (Suvinder Vicky), బరున్ సోబ్తీ (Barun Sobti), వరుణ్ బడోలా కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్ లో సీజన్ 1 కి రణదీప్ ఝా, సీజన్ 2 కి సుదీప్ శర్మ & ఫైసల్ రెహమాన్ దర్శకత్వం వహించారు. పంజాబ్ లోని ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మిస్టరీ సిరీస్ కేవలం క్రైమ్ మాత్రమే కాదు, మనుషుల మధ్య ఉండే అహంకారం, పరువును కూడా విశ్లేషించడం విశేషం. ఇందులో పెళ్లైన కొద్ది రోజులకే వరుడు హత్యకు గురవడం, ఆ విచారణలో బయటపడే చేదు నిజాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరచడంతో పాటు థ్రిల్ కి గురిచేస్తాయ్. ముఖ్యంగా దీని క్లైమాక్స్ ఎవరైనా గుర్తిస్తే వాళ్ళు తోపే. నెట్ ఫ్లిక్స్ లో ఉంది, మీరూ ఓ లుక్కెయ్యండి.

మూడవ క్రైమ్ థ్రిల్లర్: ది రిక్రూట్ (The Recruit)

నోవా సెంటినియో (Noah Centineo), లారా హాడక్ (Laura Haddock), ఆర్టీ మాన్ లు నటించిన ఈ సిరీస్‌కి డౌగ్ లైమన్, అలెక్స్ కలిమ్నియోస్, ఇమ్మాన్యుయేల్ ఒసీ-కుఫర్ జూనియర్, జూలియన్ హోమ్స్ దర్శకత్వం వహించారు. అయితే ఇందులో మరీ సీరియస్ గా కాకుండా కొంచెం హ్యూమర్, యాక్షన్ ని మిక్స్ చేసి వడ్డించారు డైరెక్టర్స్. CIAలో కొత్తగా చేరిన ఒక యువ లాయర్, మొదటి రోజే అంతర్జాతీయ కుట్రలో ఇరుక్కుంటాడు. ఫీల్డ్ అనుభవం లేకపోయినా అతను ఆ గండం నుంచి ఎలా గట్టెక్కాడనేది ఈ సిరీస్ కథ. చూడ్డానికి చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. లేట్ చేయకుండా చూసెయ్యండి.

 నాలుగవ క్రైమ్ థ్రిల్లర్: బ్లాక్ బర్డ్ (Black Bird)

టారోన్ ఎడ్జెర్టన్ (Taron Egerton), పాల్ వాల్టర్ హౌజర్ (Paul Walter Hauser), రే లియోట్టా (Ray Liotta) లు నటించిన ఈ సిరీస్‌కి మైఖేల్ ఆర్. రోస్కామ్, జో చాపెల్, జిమ్ మెక్కే లు దర్శకత్వం వహించారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లిన జిమ్మీకి ఒక ఆఫర్ వస్తుంది. ఏంటంటే “వరుస హత్యలు చేసిన ఒక సైకో కిల్లర్‌తో స్నేహం చేసి, అతని నుంచి సీక్రెట్స్ రాబట్టాలి” అని. దీంట్లో సైకో కిల్లర్‌తో స్నేహం చేయడం, అతని నుంచి సీక్రెట్స్ రాబట్టడం, ఆ క్రమంలో ఆ కిల్లర్ మైండ్ గేమ్స్, ఇద్దరి మధ్య జరిగే డైలాగ్స్ మీ ఒంట్లో వణుకు పుట్టిస్తాయి. మీకూ ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఆపిల్ టీవీలో ఉంది చూసెయ్యండి.

 ఐదవ క్రైమ్ థ్రిల్లర్: అసుర్ (Asur)

అర్షద్ వార్సీ (Arshad Warsi), బరున్ సోబ్తీ (Barun Sobti), అనుప్రియ గోయెంకా, రిధి డోగ్రా లు నటించిన ఈ సిరీస్‌కి ఓని సేన్ దర్శకత్వం వహించారు. ఇందులో భారతీయ పురాణాలను, ఆధునిక ఫోరెన్సిక్ సైన్స్‌ను మిక్స్ చేసిన తీరు అద్భుతం. తాను అసురుడినని భావించే ఒక సైకో కిల్లర్, సమాజాన్ని శుద్ధి చేసే పేరుతో చేసే హత్యలు.. వాటిని ఆపేందుకు అర్షద్ వార్సీ టీమ్ వేసే ప్లాన్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తాయి. జియో స్టార్ లో మీకోసం వెయిట్ చేస్తుంది. లేట్ చేయకండి.

 ఆరవ క్రైమ్ థ్రిల్లర్: టోక్యో వైస్ (Tokyo Vice)

అన్సెల్ ఎల్గోర్ట్ (Ansel Elgort), కెన్ వటనాబే (Ken Watanabe), రేచెల్ కెల్లర్ లు నటించిన ఈ సిరీస్‌కి మైఖేల్ మాన్, జోసెఫ్ కుబోటా వ్లాడికా, హికారి, అలాన్ పౌల్ దర్శకత్వం వహించారు. కథ విషయానికి వస్తే ఒక అమెరికన్ జర్నలిస్ట్ అక్కడి ‘యాకుజా’ మాఫియా గుట్టును ఎలా రట్టు చేశాడనేది చాలా స్టైలిష్‌గా చూపించారు. డిటెక్టివ్‌గా కెన్ వటనాబే నటన ఈ సిరీస్‌కు హైలైట్. 1990ల నాటి జపాన్ అండర్‌వరల్డ్ ప్రపంచాన్ని చూడాలనుకుంటే ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పకతప్పదు. ఇది లయన్స్ గేట్ ప్లే లో స్ట్రీమ్ అవుతుంది.

ఏడవ క్రైమ్ థ్రిల్లర్: ప్రిజ్యూమ్డ్ ఇన్నోసెంట్ (Presumed Innocent)

జేక్ జిలెన్‌హాల్ (Jake Gyllenhaal), రూత్ నెగ్గా (Ruth Negga), బిల్ కాంప్ (Bill Camp) నటించిన ఈ సిరీస్‌కి గ్రెగ్ యైటనేస్, అన్నే సెవిట్స్కీ దర్శకత్వం వహించారు. కథ విషయానికి వస్తే.. నగరంలోనే మోస్ట్ పవర్‌ఫుల్ ప్రాసిక్యూటర్ అతను. కానీ, తనతో అక్రమ సంబంధం ఉన్న తోటి లాయర్ హత్యకు గురవడంతో కథ అడ్డం తిరుగుతుంది. నిందితులను బోనులో నిలబెట్టిన అతనే.. తర్వాత బోనులో నిలబడాల్సి వస్తుంది. ఇంట్రెస్టింగ్ గా సాగే ఈ సిరీస్ ఆపిల్ టీవీలో ఉంది. లేట్ చేయకుండా చూసెయ్యండి.

also read:నందమూరి నాలుగో తరం వారసుడి ఎంట్రీకి ‘వైవీఎస్’ గ్రహణం? .. అడ్రస్ లేకుండా పోయిన ప్రాజెక్ట్!

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×