BigTV English

Horror Movie OTT : ఐలాండ్ లో ఇరుక్కున్న యువకుడి.. భయంకరమైన సీన్లు..ఒంటరిగా చూస్తే వణికిపోతారు..

Horror Movie OTT : ఐలాండ్ లో ఇరుక్కున్న యువకుడి.. భయంకరమైన సీన్లు..ఒంటరిగా చూస్తే వణికిపోతారు..

Horror OTT : ఈ మధ్య థియేటర్లలో కంటే ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలకు డిమాండ్ ఎక్కువే.. అందుకే రిలీజ్ అయ్యిన కొన్ని నెలల తర్వాత కూడా ఓటీటీ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల ఎన్నో సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలను ఎక్కువగా ఆదరిస్తున్నారు.. ప్రముఖ ఓటీటీ సంస్థలు కూడా హారర్ సినిమాలను ఎక్కువగా స్ట్రీమింగ్ చేస్తున్నారు. తాజాగా మలయాళ హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆ మూవీ పేరేంటి?  ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం..


మూవీ & ఓటీటీ.. 

మలయాళంలో అడ్వెంచర్ హారర్ మూవీ బియాండ్ ది సెవన్ సీస్ థియేటర్లలో రిలీజైన మూడేళ్లు అయ్యింది. అయితే ఇప్పుడు ఓటీటీ లోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. 99 రూపాయల రెంట్‌తో అమెజాన్ ప్రైమ్‌ లో ఈ మూవీని చూడొచ్చు. కేవలం మలయాళ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌లో కూడా మూవీని చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు. ప్రతీష్ ఉత్తమన్‌, స్మిటీ టైటస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అథిరా పటేల్‌, ప్రశాంతి నాయర్‌, గౌరి గోపన్ కీలక పాత్రలు పోషించారు. 2022 లో వచ్చిన ఈ సినిమా స్టోరీ పర్వాలేదనిపించినా విజువల్స్ పరంగా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయింది. ఇన్నాళ్లకు ఆ మూవీ ఓటిటిలో రిలీజ్ అవ్వబోతుంది.


స్టోరీ విషయానికొస్తే.. 

బియాండ్ ది సెవన్ సీన్ మూవీలో ఓ యువకుడు అదృశ్య శక్తుల కారణంగా మిస్టరీయస్ ఐలాండ్‌లోకి ఎంటర్ అవుతాడు. అక్కడి నుంచి బయటపడేందుకు ఆ యువకుడు చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి. అలాగే మరోవైపు తన తల్లి ప్రాణాలకు ప్రమాదం ఉందనే నిజం బయటపడుతుంది. అయితే ఆ యువకుడికి ఐలాండ్ కు సంబంధం ఏంటి? ఐలాండ్లో అంతుచిక్కని మిస్టరీని ఆ యువకుడు ఎలా బయట పెట్టాడు..? అందులోని అదృశ్య శక్తులతో ఏ విధమైన పోరాటం సాగించాడు అన్నదే బియాండ్ ది సెవన్ సీస్ మూవీ కథ.. ఈ సినిమాతో పాటు మరికొన్ని మలయాళ సినిమాలు ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ మూవీ ఇక్కడైనా మంచి టాక్ ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి…

ఇటీవల మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. గత ఏడాది నుంచి ఇకనుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా అన్ని భాషల్లో మంచి టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి. చిన్న స్టోరీ లైన్ తో వచ్చిన మలయాళ సినిమాలు ఈ రేంజ్ లో హిట్ అవడం అంటే మామూలు విషయం కాదు. అదేవిధంగా ఓటీటీలో కూడా వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. స్ట్రీమింగ్ అవుతున్న ప్రతి మూవీ రికార్డు బ్రేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం మరో నాలుగు సినిమాలు సమ్మర్ స్పెషల్ థియేటర్ల లో రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయని టాక్..

Tags

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×