BigTV English

OTT Movie : అక్క ఒకడితో, చెల్లెలు మరొకడితో… ఊరంతా కలసి ఇద్ధరినీ వదలకుండా … ఈ రచ్చ ఏంది భయ్యా

OTT Movie : అక్క ఒకడితో, చెల్లెలు మరొకడితో… ఊరంతా కలసి ఇద్ధరినీ వదలకుండా …  ఈ రచ్చ ఏంది భయ్యా

OTT Movie : ఓటీటీలో వెబ్ సిరీస్ లు ఇప్పుడు ఒక ట్రెండ్ ను సెట్ చేస్తున్నాయి. ఈ సిరీస్ లకు ప్రేక్షకులు బాగా అలవాటుపడిపోయారు. భాషతో సంబంధం లేకుండా వీటిని ఆస్వాదిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన ఒక బెంగాలీ వెబ్ సిరీస్, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అక్కా, చెల్లెళ్ల మధ్య ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ బెంగాలీ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


హోయ్‌చోయ్ (Hoichoi) లో

ఈ బెంగాలీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘డైనీ’ (Dainee). దీనికి నీర్ఝర్ మిత్రా దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ మార్చి 14, 2025 న విడుదలైంది. ఇందులో మిమీ చక్రవర్తీ, కౌశానీ ముఖోపాధ్యాయ్, సుదీప్ ముఖోపాధ్యాయ్, శృతి దాస్, బిశ్వజిత్ దాస్ నటించారు. ఈ కథలో మిమీ చక్రవర్తీ ప్రధాన పాత్రలో నటించింది. ఇందులో ఆమె పాత్ర పేరు పాటా (Pata). ఈ సిరీస్ విడిపోయిన ఇద్దరు సోదరీమణులు, పాటా, లతా చుట్టూ తిరుగుతుంది. చివరి వరకూ సస్పెన్స్ తో, ఈ బెంగాలీ వెబ్ సిరీస్ పిచ్చెక్కిస్తుంది. ఇది హోయ్‌చోయ్ (Hoichoi) ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో ప్రసారం అవుతోంది.


స్టోరీలోకి వెళితే

పాటా టీనేజ్ లోనే తండ్రి తో గోడవపడి, బాయ్ ఫ్రెండ్ తో కలసి చదువుకోవడానికి విదేశాలకి వెళ్ళిపోతుంది. ఆమె సోదరి లత ఇంటి దగ్గరే ఉండిపోతుంది. లత ఇంట్లో పని చేసే వ్యక్తిని ప్రేమిస్తుంది. అయితే ఆమె తండ్రి అతన్ని మందలించడంతో, వాడు భయపడి అక్కడినుంచి  వెళ్ళిపోతాడు. కొన్ని సంవత్సరాల తరువాత పాటా తిరిగి తన ఇంటికి వస్తుంది. ఆమె ప్రేమించిన వాడినే, పెళ్ళికూడ చేసుకుని ఉంటుంది.   అయితే అప్పటికే ఆమె తండ్రి చనిపోయి ఉంటాడు. నిజానికి ఇండియాలో ఉండే ఇంటిని అమ్మడానికే వస్తుంది పాటా. చెల్లెలిని కూడా ఒకసారి సంప్రదించి సేల్ చేయాలని అనుకుంటుంది. అయితే మరోవైపు లతని కొంతమంది గ్రామస్తులు చంపడానికి ప్రయత్నిస్తుంటారు. ఆమె ఎక్కడుందో తెలుసుకొని పాట అక్కడికి వెళ్తుంది.  చెల్లెలి పరిస్తితి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ గ్రామస్తుల బారి నుంచి తప్పించి, తన చెల్లిని దగ్గర్లో ఉండే ఒక హాస్పిటల్ కి తీసుకెళ్తుంది.

అక్కడ పాటా కి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. లత మంత్రాలు వేసి మనుషులను చంపుతుందని, అందుకే ఆమెను సజీవ దహనం చేసి చంపాలని గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారని తెలుసుకుంటుంది. ఆమె సోదరిని రక్షించడానికి పాటా ప్రయత్నిస్తుంది. గ్రామస్తుల మూఢనమ్మకాలు, దుష్టశక్తులతో పోరాడుతుంది.  ఊరంతా కలసి వీళ్లపై మళ్ళీ దాడి చేయాలని చూస్తారు. ఈ క్రమంలో వీళ్ళు చాలా సమస్యలు ఎదుర్కుంటారు.  చివరికి లత నిజంగానే మంత్రాలు వేస్తుందా ? ఆమె వల్లే మనుషులు చనిపోయారా ? పాటా ఆమెను ఎలా కాపాడుతుంది ? ఈ విషయాలు ఈ బెంగాలీ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Also Read :  దెయ్యాలను అట్రాక్ట్ చేసే పిల్లాడు… వీడితో ఫ్రెండ్షిప్ అంటే భూతాలతో కొరివి పెట్టించుకున్నట్టే మావా

 

Tags

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×