BigTV English
Advertisement

Sudigali Sudheer : దేవుళ్ళ ఫై చిల్లర స్కిట్స్.. కొంచెం కూడా సిగ్గులేదా..?

Sudigali Sudheer : దేవుళ్ళ ఫై చిల్లర స్కిట్స్.. కొంచెం కూడా సిగ్గులేదా..?

Sudigali Sudheer : బుల్లితెర హీరో సుడిగాలి సుదీర్ పేరు తెలియని వాళ్ళు ఉండరు. జబర్దస్త్ కామెడీ షో లో తన టాలెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలా ఒక్కో మెట్టు ఎదుగుతూ యాంకర్ గా, మెంటర్ గా, ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీ అయిపోయాడు. సుధీర్ స్పాంటేనీటితో చేసే స్కిట్లు అందర్నీ నవ్విస్తాయి. కొన్నిసార్లు విమర్శలను అందుకుంటాయి. తాజాగా అలాంటిదే జరిగింది. ఓ షోలో కామెడీ కోసం చేసిన స్కిట్ విమర్శలు అందుకుంటుంది. ఆయన చేసిన తీరు అస్సలు బాగోలేదంటూ హిందువులు సుధీర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వానరసేన సుధీర్ దేర్ తప్పు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం ఇది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది..


సుధీర్ స్కిట్.. 

ఓ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ కోసం చేసిన షోలో సుధీర్ చేసిన స్పూఫ్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘బావగారు బాగున్నారా’ సినిమాలోని ఓ సీన్ ను రీ-క్రియేట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఈ షోకి గెస్ట్ గా వచ్చిన రంభతో చేసిన స్పూఫ్ వివాదంగా మారింది. హిందువులు దేవాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడి కొమ్ములు మధ్య నుంచి ఎదురుగా ఉన్న శివయ్యను దర్శనం చేసుకుంటారు. అలాగే సుధీర్ స్టేజ్ మీదకు ఓ నంది విగ్రహాన్ని తీసుకొచ్చి హీరోయిన్ రంభను చూస్తాడు. దేవుడిపై ఇలాంటి పరాచకాలు ఏంటి? అని హిందువులు మండి పడుతున్నారు. వ్యూస్ కోసం ఇలాంటి పనులు చేయొద్దంటూ మరికొందరు చురకలు అంటిస్తున్నారు.. మా మనోభావాలు దెబ్బతిన్నాయి సుధీరు ఇలాంటివి చేసినందుకు క్షమాపణ చెప్పాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశారు.


Also Read : ‘జబర్దస్త్’ షోలో పాలిటిక్స్? ఆ నటుడిని అంత ఘోరంగా మోసం చేశారా?

సుధీర్ ఫై వానరసేన ఫైర్.. 

హిందూ దేవుళ్ళ పై చిల్లర స్కిట్స్ చేస్తున్నారంటూ యాంకర్ రవి సుడిగాలి సుధీర్ పై రాష్ట్రీయ వానరసేన మండిపడ్డారు.. బావగారు బాగున్నారా సినిమా సీన్ ను రీక్రియేట్ చేసిన సుధీర్. నంది కొమ్ముల్లో నుంచి చూస్తే రంభ కనిపించేలా సీన్ ఉంటుంది. అయితే దేవుడిని చూడాల్సిన పద్దతిలో నీ కామం కోసం చూస్తావా? కొంచెం కూడా నీకు సిగ్గు అనిపించలేదా? హిందువుగా పుట్టి ఇలాంటి పనిచేసే ముందు ఆలోచించాలని నీకు తెలియదా అంటూ.. సుడిగాలి సుధీర్ స్కిట్ పై రాష్ట్రీయ వానరసేన ఆగ్రహం వ్యక్తం చేశారు.. అంతేకాదు.. వెంటనే క్షమాపణలు చెబితే మంచిది లేదంటే లీగల్ గా ఎదుర్కోవాల్సి వస్తుంది అని రాష్ట్రీయ వానరసేన సంస్థ హెచ్చరించారు. ఇప్పటికే ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. మీరు డబ్బులు సంపాదించుకోవడానికి ఇలా దేవుడిని తప్పుగా చూపించకూడదు కదా అంటూ నెటిజన్లు సైతం చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తన పై ఇలాంటి ట్రోల్స్ వస్తున్నా సుదీర్ ఇంకా రెస్పాండ్ అవ్వలేదని తెలుస్తుంది. మరి సుధీర్ ఎలాంటి వివరణ ఇస్తారో అన్నది ఆసక్తిగా మారింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×