E-Paper
Advertisement

Action Thriller OTT : షార్ట్ కట్ లో కోటీశ్వరుడు కావాలనుకునే సిన్సియర్ పోలీస్ కొడుకు… క్లైమాక్స్ ట్విస్టుకి ఫ్యూజులు అవుట్

Action Thriller OTT : షార్ట్ కట్ లో కోటీశ్వరుడు కావాలనుకునే సిన్సియర్ పోలీస్ కొడుకు… క్లైమాక్స్ ట్విస్టుకి ఫ్యూజులు అవుట్

Action Thriller OTT : యాక్షన్ థ్రిల్లర్ సినిమాలైతే చాలు భాషతో సంబంధం లేదు అనుకునే వారి సంఖ్య భారీగానే ఉంది. ఆ లిస్ట్ ఉన్న వారి కోసమే ఈ మూవీ సజెషన్. అందులో మిడిల్ క్లాస్ యూత్ ఫ్రస్టేషన్స్ ను మేకర్స్ కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అడ్డదారిలో రిచ్ కావాలని అడుగులేసే కానిస్టేబుల్ కొడుకుకు చివరకు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అన్నది స్టోరీ. మరి చాలామంది యూత్ కు కనెక్ట్ అయ్యే ఈ స్టోరీ ఏ ఓటీటీలో ఉంది? కథ ఏంటి? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

శశాంక్ డైరెక్ట్ చేసిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ‘బ్రాట్’ Brat (2025). ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ప్రమాదాలు, అత్యాశ, మిడిల్ క్లాస్ యూత్ ఫ్రస్ట్రేషన్స్ థీమ్స్‌ తో తెరకెక్కిన ఈ సినిమాలో డార్లింగ్ కృష్ణ, మనీషా కంద్కూర్, అచ్యుత్ కుమార్, రమేష్ ఇందిరా, డ్రాగన్ మంజు ప్రధాన పాత్రలు పోషించారు. అర్జున్ జన్య మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. అక్టోబర్ 31న థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ మిక్స్‌డ్ రివ్యూస్ అందుకుంది. థీమ్ రెలెవెంట్ అయినా స్క్రీన్‌ప్లే, ఎగ్జిక్యూషన్‌పై విమర్శలు వచ్చాయి. IMDbలో 6.5 రేటింగ్ ఉన్న ఈ మూవీ ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. కన్నడతో పాటు తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ వెర్షన్స్ కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Read Also : ది నైట్ మేనేజర్ సీజన్ 2 నుండి ది బాయ్స్ సీజన్ 5 వరకు… 2026లో మోస్ట్ అవైటింగ్ ప్రైమ్ వీడియో సిరీసులు

స్టోరీలోకి వెళ్తే…

డార్లింగ్ కృష్ణ ఇందులో క్రిస్టీ అనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన యువకుడిగా నటించాడు. అతని తండ్రి మహదేవయ్య (అచ్యుత్ కుమార్) హానెస్ట్ పోలీస్ కానిస్టేబుల్. అలాగే పెద్దగా ఆశలకు పోకుండా, ఉన్నదాంట్లో సర్దుకుంటూ సింపుల్ లైఫ్ గడుపుతాడు. కానీ క్రిస్టీకి ఆ లైఫ్ బోరింగ్‌గా అనిపిస్తుంది. ఎలాగైనా సరే త్వరగా డబ్బు సంపాదించి… లగ్జరీ కార్లు, బైక్స్, పార్టీలు, స్టైలిష్ లైఫ్ గడపాలని కలలు కంటాడు. ఫ్రెండ్స్ తో చెడు సావాసం వల్ల చేయకూడని సాహసం చేస్తాడు. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్‌ లోకి అడుగు పెడతాడు. మొదట చిన్న బెట్స్ పెట్టి గెలుస్తాడు. నెమ్మదిగా మ్యాచ్ ప్రిడిక్షన్స్, ప్లేయర్ స్టాట్స్, టీమ్ ఫామ్, వెదర్ కండిషన్స్, పిచ్ రిపోర్ట్స్ లాంటి డీటైల్స్ అనాలిస్ చేసి బెట్టింగ్‌లో ఎక్స్‌పర్ట్ అవుతాడు. ఆ సక్సెస్‌ తో అత్యాశ పెరుగుతుంది మనోడికి. ఇంకేముంది బెట్టింగ్ లో పెద్ద అమౌంట్లు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు కథలో అసలు ట్విస్ట్ వస్తుంది.

క్రిస్టి పెట్టిన బెట్టింగ్ లు ఓడిపోవడంతో లాస్ లు మొదలవుతాయి. అయినా తగ్గేదె లే అని బెట్టింగ్ కోసం ఏకంగా లోన్ తీసుకుంటాడు. మొదట చిన్న లోన్ షార్క్స్ నుంచి ఈ లోన్ కథలు మొదలవుతాయి. తర్వాత అది కూడా హద్దు దాటి అండర్‌ వరల్డ్ గ్యాంగ్‌ స్టర్స్ (రమేష్ ఇందిరా, డ్రాగన్ మంజు) దగ్గర నుంచి లోన్ తీసుకునే వరకు వెళ్తుంది యవ్వారం. అప్పులు తిరిగి కట్టకపోవడంతో ఇంటరెస్ట్ పెరిగి, సమస్యల్లో పడతాడు. క్రిస్టీ ఫ్రెండ్స్, గర్ల్‌ఫ్రెండ్ సపోర్ట్ తో ఎలాగైనా మరిన్ని బెట్స్ పెట్టి  డబ్బు తిరిగి సంపాదించాలని ట్రై చేస్తాడు. కానీ మరింత ట్రబుల్ లో పడతాడు. మ్యాచ్ ఫిక్సింగ్, ఇల్లీగల్ బెట్టింగ్ సిండికేట్‌ వంటి సమస్యల్లో చిక్కుకుంటాడు. తండ్రి మహదేవయ్యకు క్రిస్టీ బెట్టింగ్ సీక్రెట్ తెలిసిపోవడంతో కొడుకుకు వార్నింగ్ ఇస్తాడు. కానీ క్రిస్టీ మారకుండా ఇంకా మూర్ఖంగా ప్రవర్తిస్తాడు.
కథ సెకండ్ హాఫ్‌లో హై-ఆక్టేన్ యాక్షన్ మోడ్‌లోకి ఛేంజ్ అవుతుంది. గ్యాంగ్‌స్టర్స్ చేజ్ సీన్స్, ఫైట్స్, ట్విస్ట్స్ మూవీని ఇంటెన్స్ థ్రిల్లర్ గా చేస్తాయి. మరి క్రిస్టి ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయట పడతాడు ? చివరికి హీరో పరిస్థితి ఏమైంది? అన్నది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×