TGSRTC Recruitment: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB).. టీజీఎస్ఆర్టీసీలో 198 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు TSLPRB వెబ్‌సైట్‌లో (www.tgprb.in) డిసెంబర్ 30, 2025 ఉదయం 8 గంటల నుంచి జనవరి 20, 2026 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ-84, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ-114 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.27,080 నుంచి రూ.81,400 వరకు వేతనం పొందుతారు.
1.ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ-ఎస్సీ, ఎస్టీలకు రూ.400, ఇతరులకు రూ.800
2.మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ- ఎస్సీ, ఎస్టీలకు రూ.400, ఇతరులకు 800
i. మొబైల్ ఫోన్ నెంబర్ ను యూజర్ ఐడీగా ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ii. అర్హత ప్రకారం పోస్ట్ లను సెలెక్ట్ చేసుకోండి.
iii. ఎంచుకున్న పోస్ట్ ల ఆధారంగా రుసుమును చెల్లించాలి.
iv.యూజర్ ఐడీతో TSLPRB వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసి, దరఖాస్తు ఫామ్‌ను పూర్తి చేయండి.
v. పాస్‌పోర్ట్ ఫొటో, సంతకం ఒకే ఫైల్‌గా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి
vi. దరఖాస్తును సబ్మిట్ చేయండి.
అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరగనుందని నియామక బోర్డు స్పష్టం చేసింది. అధికారిక నోటిఫికేషన్‌లో పరీక్ష విధానం, సిలబస్, ఫిజికల్ టెస్టుల పూర్తి వివరాలు ఇచ్చారు.
Also Read: SBI: రూ.లక్షల్లో జీతాలు భయ్యా.. డిగ్రీ పాసైతే చాలు, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఇదే