E-Paper
Advertisement

OTT Movie : ఆడినోళ్లకు ఆడినంత… బెట్టింగ్ ఉచ్చులో మిడిల్ క్లాస్ అబ్బాయి… ఓటీటీలో అదరగొడుతున్న కన్నడ యాక్షన్ మూవీ

OTT Movie : ఆడినోళ్లకు ఆడినంత… బెట్టింగ్ ఉచ్చులో మిడిల్ క్లాస్ అబ్బాయి… ఓటీటీలో అదరగొడుతున్న కన్నడ యాక్షన్ మూవీ
Advertisement

OTT Movie : రీసెంట్ గా థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఒక కన్నడ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని, ఓటీటీ ఆడియన్స్ కూడా ఆదరిస్తున్నారు. ఈ మూవీ ఒక క్రికెట్ బెట్టింగ్ మాఫియా చుట్టూ తిరుగుతుంది. ఈజీ మనీ కోసం వెళ్ళిన ఒక యువకుడు, ఒక భయంకరమైన బెట్టింగ్ మాఫియాలో ఇరుక్కుంటాడు. ఆ తరువాత అందులో నుంచి ఎలా బయట పడతాడానేదే ఈ కథ. ఈ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

శశాంక్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా పేరు ‘బ్రాట్’ (Brat). ఈ చిత్రం 2025 అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన తర్వాత, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. తెలుగు, తమిళం డబ్బింగ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో డార్లింగ్ కృష్ణ, మనీషా కందకూర్, అచ్యుత్ కుమార్, రమేష్ ఇందిర, డ్రాగన్ మంజు వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు.

Advertisement

Read Also  : రాత్రంతా రామ నామాన్ని జపించేలా చేసే 1 గంట 40 నిమిషాల హర్రర్ మూవీ… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు అస్సలు చూడొద్దు

కథలోకి వెళ్తే

మిడిల్ క్లాస్ ఫ్యామిలికి చెందిన క్రిస్టీ త్వరగా డబ్బు సంపాదించి ధనవంతుడు కావాలని కలలు కంటుంటాడు. గిగ్ వర్కర్‌గా పని చేసే అతను, తక్కువ జీతం పట్ల అసంతృప్తితో ఈజీ మనీ కోసం క్రికెట్ బెట్టింగ్‌లోకి దిగుతాడు. క్రిస్టీ తండ్రి మహాదేవయ్య ఒక నిజాయితీ గల పోలీస్ కానిస్టేబుల్. విలువలకు ప్రాధాన్యతనిచ్చే తండ్రికి, అడ్డదారిన డబ్బు సంపాదించాలనుకునే కొడుకు క్రిస్టీకి మధ్య నిరంతరం గొడవలు జరుగుతుంటాయి. క్రిస్టీ మొదట్లో సరదాగా బెట్టింగ్‌లు మొదలుపెట్టినప్పటికీ, కాలక్రమేణా భారీ మొత్తాలకు పాల్పడి ‘డాలర్ మణి’ అనే భయంకరమైన బెట్టింగ్ మాఫియా కింగ్ పిన్ వలలో చిక్కుకుంటాడు. ఒక పెద్ద బెట్టింగ్ లో దెబ్బతినడం, బుకీ మాయమవ్వడంతో క్రిస్టీ జీవితం తలకిందులవుతుంది. అవినీతిపరుడైన ఇన్‌స్పెక్టర్ రవికుమార్ వల్ల క్రిస్టీ మరిన్ని చిక్కుల్లో పడతాడు. చివరికి తన తప్పుల వల్ల కుటుంబం ప్రమాదంలో పడినప్పుడు క్రిస్టీ ఏం చేశాడు? తండ్రి నమ్మిన నిజాయితీ గెలిచిందా ? లేక కొడుకు కోరుకున్న విలాసవంతమైన జీవితం దక్కిందా? అనే అంశాలతో కథ ముగుస్తుంది.

Advertisement

 

 

 

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×