E-Paper
Advertisement

AA 22× A6 OTT: అల్లు అర్జున్ అట్లీ సినిమాకు భారీ ఓటీటీ డీల్.. సౌత్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ !

AA 22× A6 OTT: అల్లు అర్జున్ అట్లీ సినిమాకు భారీ ఓటీటీ డీల్.. సౌత్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ !
Advertisement

AA 22× A6 OTT: టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరూ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా మంచి సక్సెస్ అందుకొని ప్రస్తుతం పాన్ ఇండియాలో స్థాయిలో సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న వారిలో నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఒకరు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో సంచలనాలను సృష్టించిన బన్నీ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో పాన్ ఇండియా సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇప్పటివరకు బన్నీ టచ్ చేయని జోనర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది.

50% షూటింగ్ పూర్తి..

ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది త్వరలోనే అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఏకంగా వెయ్యికోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా 50% షూటింగ్ పనులను కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ సినిమా మరోవైపు బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుపుకుంటుందని సమాచారం.

భారీ ఆఫర్ ఇచ్చిన నెట్ ఫ్లిక్స్..

Advertisement

1000 కోట్ల బడ్జెట్ తో అట్లీ ,అల్లు అర్జున్ కాంబినేషన్ సినిమా అంటేనే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్ (Net Flix) భారీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా అన్ని భాషల డిజిటల్ రైట్స్ ను రూ.600 కోట్లకు కైవసం చేసుకోవడానికి చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇదే కనుక నిజమైతే ఇప్పటివరకు సౌత్ సినీ ఇండస్ట్రీలోనే ఏ సినిమా కూడా ఈ స్థాయిలో డిజిటల్ హక్కులను సొంతం చేసుకోలేదని మొదటి సినిమా ఇదే అవుతుందని చెప్పాలి. మరి ఈ సినిమా డిజిటల్ రైట్స్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

నెగిటివ్ పాత్రలో రష్మిక..

Advertisement

అల్లు అర్జున్ చివరిగా సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించిన నేపథ్యంలోనే తన తదుపరి సినిమాపై అదే స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అట్లీ సినిమా డిజిటల్ హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ సైతం బారి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు దీపిక పదుకొనె, జాన్వీ కపూర్, మృణాళ్ ఠాకూర్ వంటి స్టార్ హీరోయిన్లు భాగమయ్యారు. అలాగే నటి రష్మిక మందన్న కూడా ఈ సినిమాలో నటించబోతున్నారని అయితే ఈ సినిమాలో ఈమె నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు హల్ చల్ చేశాయి.

Also Read: Aadi Reddy on Anvesh : నా అన్వేషణ ఎదవ ముం**కొ*కు .. కొంచమైనా సిగ్గుందా.. ఫైర్ అయిన ఆది రెడ్డి!

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×