E-Paper
Advertisement

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
Advertisement

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయంతో రాష్ట్రంలో కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవం జిల్లాలుగా ఏర్పాటు కానున్నాయి. దీంతో మొత్తం జిల్లాల సంఖ్య 28కి పెరగనుంది. కొత్త జిల్లాలపై ఎల్లుండి తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని కొత్తగా ఏర్పడనున్న మదనపల్లె జిల్లాకు కేటాయించారు. రాజంపేటను కడప జిల్లాకు, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాకు, గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరులో కేటాయించారు. ఈ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆవేదన

రాయచోటిని మదనపల్లెకు కేటాయించడంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. కేబినెట్ సమావేశం అనంతరం కంటతడి పెట్టుకుంటూ బయటకు వచ్చారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మరో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఓదార్చారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో లేకపోవడంపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోటికి మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు.

Advertisement

Also Read: Pawan Kalyan : పవన్‌కు అక్కడ నో.. ఇక్కడ ఎస్!

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×