E-Paper
Advertisement

Chainsaw Man OTT : ఇండియన్ ఓటీటీలో పాపులర్ జపనీస్ యానిమే ఊచకోత… అల్టిమేట్ యాక్షన్ సీన్లు

Chainsaw Man OTT : ఇండియన్ ఓటీటీలో పాపులర్ జపనీస్ యానిమే ఊచకోత… అల్టిమేట్ యాక్షన్ సీన్లు
Advertisement

Chainsaw Man OTT : ‘చైన్‌సా మ్యాన్’ ఫ్యాన్స్‌కి బిగ్ హ్యాపీ న్యూస్ వచ్చేసింది. జంప్ ఫెస్టా 2026 ఈవెంట్‌లో అనూహ్యంగా అనౌన్స్ అయిన సీజన్ 2 కన్ఫర్మేషన్‌తో యానిమే ప్రేమికులు ఎక్సైట్ అవుతున్నారు. సూపర్ యాక్షన్ సీక్వెన్సెస్, గ్రిప్పింగ్ నెరేటివ్‌తో పాపులర్ అయిన ఈ షోనెన్ యానిమే ఇప్పుడు మళ్లీ రాబోతోంది. క్రిస్మస్ సీజన్‌లో సీజన్ 1ని చూడడానికి కూడా పర్ఫెక్ట్ టైమ్ ఇది. మరి మొదటి సీజన్ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎమ్ఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్

తత్సుకి ఫుజిమోటో రాసిన పాపులర్ మాంగా సిరీస్ ఆధారంగా తయారైన ఈ ‘చైన్‌సా మ్యాన్’ యానిమే మొదటి సీజన్‌తోనే ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ సంపాదించింది. సూపర్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్, డార్క్ హ్యూమర్, అనూహ్య ట్విస్టులు, ఎమోషనల్ డెప్త్… ఇవన్నీ కలిసి చైన్‌సా మ్యాన్‌ను ఒక యూనిక్ యానిమేగా నిలబెట్టాయి. ఇప్పుడు సీజన్ 2 వస్తోందన్న న్యూస్‌తో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

Advertisement

ఇండియాలో MX Playerలో చైన్‌సా మ్యాన్ సీజన్ 1 పూర్తిగా అందుబాటులో ఉంది. 12 ఎపిసోడ్స్ కూడా ఇంట్రెస్టింగ్‌ గా ఉంటాయి. డెమన్ స్లేయర్, జుజుత్సు కైసెన్, మై హీరో అకాడెమియా లాంటి టాప్ యానిమేలు ఇష్టంగా చూసేవాళ్లకి ఇది పర్ఫెక్ట్. క్రిస్మస్ సీజన్‌లో ఇంట్లో హాయిగా కూర్చుని సీజన్ 1 ను సరదాగా చూడడానికి బెస్ట్ టైమ్ ఇదే. సీజన్ 2 గురించి చెప్పాలంటే 2026 చివరి లేదా 2027 ప్రారంభంలో ప్రీమియర్ అవుతుందని అనుకుంటున్నారు.

కథలోకి వెళ్తే…

చైన్‌సా మ్యాన్ స్టోరీ ఒక సాధారణ పేద టీనేజర్ డెంజీ జీవితం చుట్టూ సాగుతుంది. తండ్రి చనిపోయాక భారీ అప్పుల భారంతో బతుకుతున్న డెంజీ డెవిల్ హంటర్‌ గా మారతాడు. అతని ఏకైక స్నేహితుడు చైన్‌సా డెవిల్ పోచితా. అంటే అదొక చిన్న కుక్క లాంటి డెవిల్. పోచితాతో కాంట్రాక్ట్ చేసుకుని డెంజీ చైన్‌సా మ్యాన్‌గా ట్రాన్స్‌ఫాం అవుతాడు. తల నుంచి చైన్‌సాలు బయటకు వచ్చి డెవిల్స్‌ ను చీరేస్తాడు. పబ్లిక్ సేఫ్టీ డెవిల్ హంటర్స్ ఆర్గనైజేషన్‌లో చేరి మకిమా, అకి, పవర్ లాంటి క్యారెక్టర్స్‌తో కలిసి డెవిల్స్‌ ను ఎదుర్కొంటాడు. స్టోరీలో యాక్షన్ ఉంటుంది. కానీ డెంజీ సింపుల్ డ్రీమ్స్, ఒక మంచి భోజనం, గర్ల్‌ఫ్రెండ్… వంటి సీన్లు హార్ట్ టచింగ్‌గా ఉంటాయి. డార్క్, గూస్ బంప్స్ తెప్పించే సీన్స్‌తో పాటు డీప్ ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఉంటాయి. డెంజీ క్యారెక్టర్ ఎవరికైనా రిలేట్ అవుతాడు. సింపుల్ విషెస్ ఉన్న సామాన్యుడు అద్భుత పవర్స్ పొంది ఇబ్బందుల్లో పడతాడు. సీజన్ 1 మిస్ అయినవాళ్లు ఇప్పుడే ఓ లుక్కేయండి.

Advertisement

Read Also : అద్దంలో బందీగా భార్య… ఆమె కళ్ల ముందే మరో అమ్మాయితో భర్త… ఈ కొరియన్ మూవీ క్లైమాక్స్ ట్విస్టుకి ఫ్యూజులు అవుట్

Tags

Related News

అందరూ తక్కువ అంచనా వేసే లాయర్‌… కోర్టులో ఆమె వాదనలు వింటే మైండ్‌ బ్లాక్‌… మెంటలెక్కించే లీగల్‌ డ్రామా

థెరపీ కోసం వచ్చిన పేషెంట్‌తోనే సైకాలజిస్ట్‌కి తలనొప్పులు… నవ్వించే డార్క్ కామెడీ డ్రామా

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

Big Stories

Advertisement
×