E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ఇంటిదొంగగా మనోజ్.. బాలుపై అనుమానం.. నడుంవిరగొట్టుకున్న ప్రభావతి..

Gundeninda GudiGantalu Today episode: ఇంటిదొంగగా మనోజ్.. బాలుపై అనుమానం.. నడుంవిరగొట్టుకున్న ప్రభావతి..
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 25th : నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్,  రోహిణి రవి, శృతిలకు అడ్డంగా దొరికిపోతారు. నిన్న ఏవేవో కోతలు కోసవు ఇప్పుడు మాత్రం ఈ పోటీకి వచ్చావు అని రవి మనోజ్ ని అంటాడు. మొత్తానికి వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోతారు. తర్వాత ప్రభావతి సత్యం కూడా అక్కడికి వస్తారు. కామాక్షి రంగా కూడా రావడం చూసి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు.. ఏంటి కామాక్షి వాళ్ళ చెల్లెలు లాగా ఈవిడ ఉంది అని ప్రభావతితో అడుగుతుంది. కామాక్షి వాళ్ళ చెల్లెలు కాదు అక్కడ ఉన్నది కామాక్షినే అని ప్రభావతి అంటుంది. ఇంకా మాత్రం మనం ఇంతగా రెడీ రావడం అవసరమా అని తిట్టుకుంటూ వస్తారు… మొత్తానికి రవి కుటుంబంలోని అందరు జంటలు కూడా ఆ పోటీలో పాల్గొనేందుకు వచ్చేస్తారు.. బాలు లోపలికి ఎంటర్వగానే తన కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్విస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. బాలు మాత్రం లోపలికి వెళ్లగానే ఆడుకుంటాడు..మనోజ్ గురించి చెప్పగానే మనోజ్ పరువు కూడా బాలు తీసేస్తాడు.. ఆ తర్వాత అందరూ కలిసి తమలోని టాలెంట్ ని చూపించాలని యాంకర్ అడుగుతుంది. ముందుగా రోహిణి బ్యూటిషన్ అని చెప్పగానే ఒక అతని పిలిపించి ఆమెతో మేకప్ చేయిస్తారు. ఆ తర్వాత శృతి గయ్యాళి అత్త స్టోరీ గురించి అక్కడ మిమిక్రీ చేసి చూపిస్తుంది. ప్రభావతి, మీనాల గొంతుతో శృతి మాట్లాడంతో ప్రభావతి షాక్ అయిపోతుంది.. ఆ తర్వాత అందరూ కలిసి తమలోని టాలెంట్ ని చూపిస్తారు.. ఇక అందరూ కూడా ఆ పోటీల్లో ఎలాగైనా సరే పాల్గొనాలని అనుకుంటారు. లక్షను సొంతం చేసుకోవాలని ప్రభావతి కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటుంది..

Advertisement

ఇక అక్కడున్న వాళ్ళు గేమ్స్ ఉంటాయని చెప్తారు.. అందులోని రౌండ్ ల గురించి వివరిస్తారు. వాళ్ళు చెప్పినట్లుగా ముందుగా డబ్ స్మాష్ రౌండ్ ఉంటుంది.. అందులో ప్రతి ఒక్కరు కూడా సినిమా పేర్లను చక్కగా గెస్ చేస్తారు. ముందుగా వెళ్లిన రోహిణి మనోజ్ ఇంటి దొంగ అన్నా పేరుని గెస్ చేస్తారు.. ఆ తర్వాత శృతిర వీలు కూడా చక్కగా గెస్ చేస్తారు. మీనా బాలు కూడా తమకిచ్చిన పేరుని చెప్తారు. ఆ తర్వాత ప్రభావతి సత్యం కూడా మంచిగా గెస్ చేస్తారు. ఇక చివరిగా రంగ కామాక్షి ఇద్దరు చెప్పలేకపోతారు.

రెండో రౌండ్ గా రొమాంటిక్ ప్రపోజ్ గురించి యాంకర్ చెప్తారు.. పైన వేలాడదీసిన ఫ్లవర్ని తమ భార్యని ఎత్తుకొని నోటితో అందుకొని ఆ ఫ్లవర్ ని భర్తకి ఇచ్చి ప్రపోజ్ చేయాలని అంటారు.. ముందుగా వెళ్లిన రోహిణి మనోజ్ లు పైనున్న రోజాను అందుకొని రోహిణి మనోజ్ కి ప్రపోజ్ చేస్తుంది.. ఆ తర్వాత రవి శృతి అందులో ఫెయిల్ అయిపోతారు. బాలు మీనా ఇద్దరు కూడా ఎంతో చక్కగా ఆడి గెలుస్తారు. ఆ ఫ్లవర్ ని మీనా బాలుకి ప్రపోజ్ చేస్తుంది.. తర్వాత ప్రభావతి సత్యం మేం కూడా వెళ్తాము అని అంటారు. పైకెత్తుకుని అంటే అన్నయ్య నడుముల పరిస్థితి ఏంటో అర్థం అవుతుంది అని కామాక్షి అంటుంది..

Advertisement

Also Read :‘గుండెనిండా గుడిగంటలు ‘ బాలు సీరియల్స్ గుడ్ బై చెప్పేస్తున్నాడా..?

నిన్ను ఎత్తుకోవడం నావల్ల కాదు.. నిన్ను ఎత్తుకుంటే నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు అని సత్యం అంటాడు.. అయితే ప్రభావతి మాత్రం జడ్జిల దగ్గరికి వెళ్లి నేను కుర్చీపై నిలబడుకొని ఫ్లవర్ ని అందుకొని మా ఆయనకి ప్రపోజ్ చేస్తాను అని రిక్వెస్ట్ చేస్తుంది. వాళ్లు ప్రభావతి చెప్పిన దానికి ఒప్పుకుంటారు.. ప్రభావతి ఆ పువ్వుని అందుకునే టైంలో సత్యం తుమ్ముతాడు.. దాంతో ప్రభావతి కింద పడిపోతుంది. ఆమె నడుముకి గాయం తగులుతుంది. ప్రభావతికి ఏమైందని అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఇంకొక టాస్క్ ని అక్కడ జడ్జీలు ఇస్తారు.. ఆ టాస్క్ మీకు ఇష్టమైన డ్రీమ్ హోస్ ని కట్టమని చెప్తారు.. బాలు ఒక గదిని మాత్రమే కడతాడు. మిగిలిన వాళ్ళు ఏమి కట్టకుండా ఓడిపోతారు. జడ్జిలు ఏంటి బాలు మీరు ఒక కథనే కట్టారు అని అడుగుతారు. మాకు మా ఇంట్లో ఒక గది కూడా లేదండి అని బాలు అంటాడు.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Illu Illalu Pillalu Today Episodes: విశ్వం ప్లాన్ సక్సెస్.. ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. అడ్డంగా బుక్కయిన ధీరజ్..

Ninnu kori Serial Today Episode September 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: డాక్టర్ ను బెదిరించి నిజం తెలుసుకున్న విరాట్  

Intinti Ramayanam Today Episode: గుండెలు పగిలేలా ఏడ్చిన అక్షయ్.. అయ్యో కన్నీళ్లు తెప్పించే సీన్.. పల్లవి ఫుల్ హ్యాపీ..

Big Stories

Advertisement
×