Wife killd Husband In Nagarkurnool District: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. ఫలితంగా హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ఫలితంగా ఈ లోకాన్ని విచిడి పెడుతున్నారు. అలాంటి ఘటన ఒకటి నాగర్ కర్నూలు జిల్లాలో బయటపడింది. కేవలం ప్రియుడి కోసం భర్తని చంపేసింది భార్య. ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం, ట్రాక్ తప్పిన టీచరమ్మ
పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఓ టీచరమ్మ ట్రాక్ తప్పింది. ఉద్యోగం లేకపోవడంతో అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్తని చిన్నచూపు చూసింది. ఫలితంగా మరొక ఉపాధ్యాయుడికి దగ్గరైంది ఆ టీచరమ్మ. ఈ విషయం భర్తకు తెలిస్తే పరువు పోతుందని భావించింది. ప్రియుడితో కలిసి పక్కాగా ప్లాన్ చేసింది. ఆపై దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని మారుతీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు లక్ష్మణ్‌నాయక్- పద్మ దంపతులు. లక్ష్మణ్ నాయక్ గతంలో రంగారెడ్డి జిల్లాలో ఓ గురుకుల పాఠశాలలో కాంట్రాక్టు ఉపాధ్యాయుడిగా పని చేశాడు. భార్య పద్మకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో పోస్టింగ్ వచ్చిన అచ్చంపేటకు వచ్చేశారు.
ప్రియుడి మోజులోపడి.. భర్తని లేపేసింది
ప్రస్తుతానికి లక్ష్మణ్‌నాయక్ ఖాళీగా ఉండేవారు. ఉద్యోగాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేసేవాడు. డీఎస్సీలో ఉపాధ్యాయురాలిగా ఎంపికైంది పద్మ. ఉప్పునుంతల మండలంలోని బట్టుకాడిపల్లి తండా ప్రైమరీ స్కూల్ లో టీచర్ గా పని చేస్తోంది. ఆ మండలంలో ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు గోపి.
అతడితో పద్మకు పరిచయం పెరిగింది. ఆ తర్వాత ఫ్రెండ్ షిప్ గా మారింది. చివరకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందని భావించింది. చివరకు ఈ విషయాన్ని తన ప్రియుడి దగ్గర ప్రస్తావించింది. ప్రియుడితో కలిసి భర్తను చంపాలని ప్లాన్ చేసింది పద్మ.
సరిగ్గా నవంబరు 24 రాత్రి నిద్రపోతున్న భర్తని ప్రియుడి సాయంతో హత్య చేసింది. ఆ మరుసటి రోజు ఏమీ తెలియనట్లుగా పద్మ పాఠశాలకు వెళ్లిపోయింది. అక్కడి నుంచి తన ఆలోచనకు పదును పెట్టింది. తన భర్తకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదంటూ ఇంటి యజమానికి ఫోన్ చేసింది పద్మ.
ALSO READ: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన ట్రావెల్ బస్సు, 17 మంది సజీవ దహనం
మధ్యాహ్నం హడావుడిగా పాఠశాల నుంచి ఇంటికొచ్చి భర్త చనిపోయాడని అందరినీ నమ్మించింది. లక్ష్మణ్ నాయక్ సడన్‌గా చనిపోవడాన్ని బంధువులు నమ్మలేదు. చివరకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోద చేశారు. దీనిపై పోలీసులు తమదైన శైలిలో విచారణ మొదలుపెట్టారు.
హత్య తర్వాత పద్మ.. సమీప బంధువు నర్సింహకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పినట్లు ఆధారాలు సేకరించారు. టీచరమ్మ పద్మని విచారించగా అసలు విషయాలు బయటపడ్డాయి. పద్మ, ఆమె ప్రియుడు గోపిని అరెస్టు చేశారు. న్యాయస్థానం వారికి రెండువారాలు రిమాండ్ విధించింది.