BigTV English

Unstoppable Season 4 : పవన్ కళ్యాణ్ గురించి ఎవరికి తెలియని సీక్రెట్ ను బయటపెట్టిన ఏపీ సీఎం..

Unstoppable Season 4 : పవన్ కళ్యాణ్ గురించి ఎవరికి తెలియని సీక్రెట్ ను బయటపెట్టిన ఏపీ సీఎం..

Unstoppable Season 4 : టాలీవుడ్ హీరో నందమూరి బాలయ్య ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హోస్ట్ గా చేస్తున్న షో అన్‍స్టాపబుల్ షో.. ఈ షో మూడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్ లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ సీజన్ పై ఆల్రెడీ భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు కారణం మొదటి ఎపిసోడ్ కు చంద్రబాబు నాయుడు రావడమే.. ఎమ్మెల్యే తో సిఎం ఎపిసోడ్ షూటింగ్ నిన్న పూర్తి అవుతుంది. ఆ ఎపిసోడ్ లో చంద్రబాబు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో, రాజకీయ సీక్రెట్స్ బయట పెడతారా అన్నది ఆసక్తిగా మారింది. తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పవన్ కళ్యాణ్ గురించి సంచలన విషయాలను చంద్రబాబు బయటపెట్టాడు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..


అన్‍స్టాపబుల్ షో కు గెస్ట్ గా చంద్రబాబు..

అన్‍స్టాపబుల్ 4వ సీజన్ మొదటి ఎపిసోడ్‍పై ఆసక్తి విపరీతంగా ఉంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఉన్న ఈ టాక్ షో.. కొత్త సీజన్ తొలి ఎపిసోడ్‍కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెస్ట్‌గా వచ్చారు.. ఆదివారం హైదరాబాద్‍లోని అన్నపూర్ణ స్టూడియోస్‍కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోస్ట్ బాలకృష్ణ వచ్చారు. అన్‍స్టాపబుల్ సెట్‍లో ఈ ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. తన బావ సీఎం చంద్రబాబును బాలకృష్ణ ప్రశ్నలు అడిగారు. సరదాగా మాట్లాడారు.. అందులో ఎక్కువగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినట్లు తెలుస్తుంది. ఎంత మొండివాడో.. ఏదైనా చెయ్యాలనుకుంటే వెంటనే చేస్తాడు. పవన్ ప్రజలకు కష్టం అంటే ఆగడు.. అది ఎంత రిస్క్ అయినా పర్లేదు అంటాడు.. ఇన్నాళ్లకు ఎన్టీఆర్ తర్వాత అలాంటి మొండితనం పవన్ కళ్యాణ్ చూసినట్లు చెప్పాడని ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది.. ఇంకా ఎపి రాజకీయాలా గురించి ఎం చెప్పారు.. వైసీపీ గురించి ఏదైనా చెప్పారా అన్నది తెలియాలంటే ఈ ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే..


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గెస్టుగా పాల్గొన్న అన్‍ స్టాపబుల్ 4 తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్, టైమ్‍ను ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ వెల్లడించింది. అక్టోబర్ 25 వ తేదీ రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఈ ఎపిసోడ్ ప్రీమియర్ అవుతుందని పేర్కొంది. తన శక్తివంతమైన మాటల తో పాటు ఎంటర్‌టైన్‍మెంట్ ఉంటుందంటూ ఈ ఎపిసోడ్ గురించి ట్వీట్ చేసింది ఆహా. పవర్, ప్రశ్నలు, సూటైన సమాధానాలు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అన్‍స్టాపబుల్ సీజన్ 4 మొదలుకానుంది. కష్టమైన ప్రశ్నలు, శక్తివంతమైన మాటలు, సర్‌ప్రైజ్‍లు, ఎంటర్‌టైన్‍మెంట్‍ పై చంద్రబాబు మాట్లాడారు. అన్‍స్టాపబుల్ సీజన్ 4 అక్టోబర్ 25న రాత్రి 8.30 గంటలకు ప్రీమియర్ కానుంది అని ఆహా పోస్ట్ చేసింది.. ఇక ఈ సీజన్ కు రెండో గెస్టుగా పవన్ కళ్యాణ్, మూడో గెస్ట్ గా అల్లు అర్జున్ రాబోతున్నారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి అయ్యింది. రెండు ఎపిసోడ్ లుగా స్త్రీమింగ్ చెయ్యనున్నారని సమాచారం..

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×