E-Paper
Advertisement

Chatha Pacha OTT: విడుదలైన వారంలోపే ఓటీటీలోకి హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Chatha Pacha OTT: విడుదలైన వారంలోపే ఓటీటీలోకి హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Advertisement

Chatha Pacha OTT:ఒక సినిమా తెరకెక్కుతోంది అంటే అది ఏ భాషలో అయినా సరే ఓటీటీలో స్ట్రీమింగ్ కి రావడానికి కనీసం నాలుగు లేదా ఎనిమిది వారాల సమయం పడుతుంది . లేదా ఒక్కొక్కసారి నెలలోపే స్ట్రీమింగ్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఒక హిట్ సినిమా అది కూడా కేవలం 6 రోజుల్లోపే ఓటీటీలోకి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకవేళ డిజాస్టర్ సినిమా వారం లోపే రోజుల్లోనే స్ట్రీమింగ్ కి వచ్చింది అనుకుంటే ఓకే.. కానీ ఇక్కడ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా అప్పుడే స్ట్రీమింగ్ కి రావడంతో అసలు ఆ సినిమా ఏంటి ? ఎందుకు అంత త్వరగా స్ట్రీమింగ్ కి వచ్చేసింది? అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి . మరి ఆ చిత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం..

విడుదలైన 6 రోజుల్లోనే ఓటీటీలోకి..

మలయాళంలో గత నెల 22వ తేదీన విడుదలైన చిత్రం చథా పచ్చ. రెజ్లింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో అర్జున్ అశోకన్ , రోషన్ మ్యాథ్యూ, ఇషాన్ సౌకత్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అద్వైత్ నాయర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదట తెలుగులోనే జనవరిలో విడుదల చేయాలనుకున్నారు కానీ వాయిదా పడింది..ఇప్పుడు ఫిబ్రవరి 13వ తేదీన మలయాళం లో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇంతలోనే ఓటీటీ డేట్ ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఫిబ్రవరి 19 అనగా వచ్చే శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఏది ఏమైనా విడుదలైన వారంలోపే ఓటీటీలోకి వస్తుండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ALSO READ:Nagabandham Teaser: మహేష్ బాబు చేతుల మీదుగా ‘నాగబంధం’ టీజర్.. విజువల్ వండర్ గా!

చథా పచ్చ సినిమా స్టోరీ..

చథా పచ్చ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ముగ్గురు అన్నదమ్ములు సవి (అర్జున్ అశోకన్), లిటిల్ (ఇషాన్ సౌకత్), వెట్రి (రోషన్) తమ చిన్నప్పటి నుంచి టీవీల్లో రెజ్లింగ్ ,కుస్తీ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ లాంటివి చూస్తూ పెరుగుతారు. అయితే పెద్దయ్యాక కొన్ని కారణాల వల్ల వీళ్ళు విడిపోతారు. లిటిల్, సవి కొచ్చిలో కాస్ట్యూమ్ రెజ్లింగ్ ప్రారంభించే పనిలో ఉంటారు. అయితే వీళ్ళకు వెట్రీ ఎందుకు దూరంగా ఉన్నాడు? లిటిల్ ,సవి మొదలుపెట్టిన ఈ రెజ్లింగ్ పోటీ సక్సెస్ అయ్యిందా? ఈ ప్రయాణంలో వీళ్లకు ఎదురైన సవాళ్లేంటి ? అనేది మిగతా స్టోరీ.. ఇక తెరపై వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ప్రేక్షకులను మెప్పిస్తోంది.మరి ఇంతలోనే ఓటీటీకి రావడం వెనుక అసలు కారణం ఏంటి? అన్నది మేకర్స్ ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే. మొత్తానికి అయితే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి విజయాన్ని, టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×