E-Paper
Advertisement

Amazon Prime Video : ప్రైమ్ వీడియో రికార్డులు కొల్లగొడుతున్న 2 గంటల 6 నిమిషాల మర్డర్ మిస్టరీ… ఇంకా చూడలేదా ?

Amazon Prime Video : ప్రైమ్ వీడియో రికార్డులు కొల్లగొడుతున్న 2 గంటల 6 నిమిషాల మర్డర్ మిస్టరీ… ఇంకా చూడలేదా ?
Advertisement

Amazon Prime Video : ఓటీటీలలో మర్డర్ మిస్టరీలకు ప్రత్యేకంగా క్రేజ్ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ జానర్లో విడుదలైన ఓ క్రేజీ థ్రిల్లర్ ఇప్పుడు రికార్డులు కొల్లగొడుతోంది. మరి ఆ మూవీ ఏంటి? రికార్డులు బద్దలు కొట్టేంత ఆ మూవీలో ఏముంది ? ఆ మూవీ ఏ ఓటీటీలో ఉంది? అనే విషయాలపై ఇప్పుడు ఒక లుక్కేద్దాం పదండి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

శోభితా ధూళిపాళ నటించిన తాజా చిత్రం ‘చీకటిలో’ (cheekatilo) ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఈ ఏడాది ప్రైమ్ వీడియో ఇండియా (Amazon Prime Video)లో అత్యధికంగా వీక్షించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది.ఈ తెలుగు మర్డర్ మిస్టరీ రికార్డు స్థాయిలో వ్యూస్‌ను సాధించింది. ఈ ఏడాది జనవరిలో విడుదల అయిన ‘చికటిలో’ చిత్రం ప్రారంభ వారంలో అత్యధికంగా ప్రసారం అయిన సౌత్ ఒరిజినల్ చిత్రంగా నిలిచిందని ప్రైమ్ వీడియో ఇండియా సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ మూవీ విడుదలైన మొదటి వారాంతంలో బాగా ట్రెండ్ అయింది. అంతేకాదు అన్ని ప్రాంతాలలో అద్భుతమైన స్పందనను పొందింది. మంచి కథ ఉంటే భాష అడ్డు కాదనే విషయాన్ని ఈ మూవీ మరోసారి నిరూపించింది. .

Advertisement

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మించిన ‘చీకటిలో’ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సంధ్యగా శోభిత ధూళిపాళ కన్పించగా, విశ్వదేవ్ రాచకొండ మరో మెయిన్ లీడ్ గా నటించారు. చైతన్య విశాలాక్షి, ఇషా చావ్లా, ఝాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్ కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ ఉత్కంఠభరితమైన మర్డర్ మిస్టరీ ప్రైమ్ వీడియో టాప్ సౌత్ ఒరిజినల్స్‌లో ఒకటిగా మారింది. ఇది ప్రైమ్ వీడియోలో టాప్ 5లో స్థానం సంపాదించింది. జనవరి 23న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ అయిన “చికటిలో”, ప్రైమ్ వీడియో సౌత్ ఒరిజినల్స్ పోర్ట్‌ఫోలియోకు ఒక మైలురాయిగా నిలిచింది. దీనికి IMDbలో 6.6 రేటింగ్ ఉంది. ఒక సీరియల్ రేపిస్ట్ బండారాన్ని బయట పెట్టాలనే దృఢనిశ్చయం ఉన్న యువతి కథే ఈ చిత్రం.

కథలోకి వెళ్తే…

హైదరాబాద్ నేపథ్యంలో జరిగే ఉత్కంఠభరితమైన హత్య రహస్యం ‘చికటిలో’. ఇందులో సంధ్య అనే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ గ్రాడ్యుయేట్ మంచి టీవీ కెరీర్‌ను వదిలి, కోల్డ్ కేసులను పరిష్కరించడానికి తన సొంత యూట్యూబ్ పాడ్‌ కాస్ట్‌ ను స్టార్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్న్ దారుణంగా హత్యకు గురవుతాడు. అయితే అతని మరణం వెనకున్న మర్డర్ మిస్టరీని వెలికితీసేందుకు తన సొంత పాడ్‌ కాస్ట్ “చికటిలో”ను మొదలు పెడుతుంది. ఇన్‌స్పెక్టర్ రాజీవ్‌తో కలిసి, ఈ ప్రమాదకరమైన కేసును దర్యాప్తు చేస్తుంది. దీంతో ఆ విచారణలో చాలా కాలంగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న హంతకుడిని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. న్యాయం కోసం, మహిళలను రక్షించాలనే ఆలోచనతో ఉన్న సంధ్యకు పాడ్‌కాస్ట్‌ అనేది ఆయుధంగా మారుతుంది. మరి ఇంతకీ ఆ ఇంటర్న్ ను ఎవరు ఎందుకు చంపారు ? చివరికి హీరోయిన్ హంతకుడిని కనిపెట్టగలిగిందా ? అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ‘ఇంపర్ఫెక్ట్ ఉమెన్’ నుండి ‘మార్గోస్ గాట్ మనీ ట్రబుల్స్’ వరకు… 2026లో రిలీజ్ కానున్న మోస్ట్ అవైటింగ్ సిరీసులు

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×