E-Paper
Advertisement

‘ది ఒడిస్సీ’ డైరెక్టర్ మాస్టర్ పీస్ మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?

‘ది ఒడిస్సీ’ డైరెక్టర్ మాస్టర్ పీస్ మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?
Advertisement

Christopher Nolan Movies on OTT: హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు, అద్భుతమైన విజువల్స్, మరపురాని కథలు గుర్తొస్తాయి. ఆయన తాజా చిత్రం ‘ది ఒడిస్సీ’ (The Odyssey) జూలై 17న విడుదలై దుమ్మురేపుతుంది. గ్రీక్ మహాకావ్యం ఆధారంగా తెరకెక్కిన ఈ ఎపిక్ చిత్రం చూసే ముందు ఆయన చేసిన గత మాస్టర్ పీస్ లు చూడాల్సిందే. మరి ఆ సినిమాలు ఏంటి ? ఏ ఓటీటీలో ఉన్నాయి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఇన్‌సోమ్నియా (Insomnia 2002)

అల్ పచినో ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా నోలన్ ఫస్ట్ హాలీవుడ్ మూవీ. అలస్కాలో జరిగే హత్యా కేసును దర్యాప్తు చేస్తున్న లాస్ ఏంజెల్స్ డిటెక్టివ్ విల్ డార్మర్ నిద్రలేమి బారిన పడటం, ఆ తరువాత జరిగే సంఘటనలే ఈ సినిమా కథ. ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ యాపిల్ టీవీలో రెంట్ లేదా బై విధానంలో చూడవచ్చు.

ది డార్క్ నైట్ ట్రైలాజీ (The Dark Knight Trilogy)

Advertisement

బ్యాట్‌మ్యాన్ బిగిన్స్ (2005), ది డార్క్ నైట్ (2008), ది డార్క్ నైట్ రైజెస్ (2012)… ఈ మూడు చిత్రాలు సూపర్‌ హీరో సినిమాల జానర్‌ ను పూర్తిగా మార్చేశాయి. హీత్ లెడ్జర్ జోకర్ పాత్ర, ఆర్థర్ ఫ్లెక్‌గా జోకర్ (2019) కాకుండా ఈ ట్రైలాజీలోని డార్క్ నైట్ ఇప్పటికీ బెస్ట్. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో కొంత భాగం చిత్రీకరించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో సినిమాల్లో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉన్నాయి. యాపిల్ టీవీ, యూట్యూబ్ మూవీస్‌లో రెంట్ లేదా బై విధానంలో చూడవచ్చు.

ది ప్రెస్టీజ్ (The Prestige 2006)

రెండు మ్యాజిషియన్ల మధ్య జరిగే పోటీ, ఈర్ష్య, ప్రతీకారం – ఈ సినిమా నోలన్ యొక్క మెగా హిట్. హ్యూ జాక్‌మన్, క్రిస్టియన్ బేల్, మైఖేల్ కెయిన్ నటన అద్భుతం. చివరి ట్విస్ట్ ఇప్పటికీ అన్ని చర్చల్లో ఉంటుంది.ఓటీటీ వివరాలు: ప్రైమ్ వీడియో, యూట్యూబ్ మూవీస్, యాపిల్ టీవీలో రెంట్ లేదా బై విధానంలో చూడవచ్చు.

ఇన్‌సెప్షన్ (Inception 2010)

Advertisement

ఇతరుల కలల్లోకి చొరబడి రహస్యాలను దొంగలించే హీరో డామ్ కోబ్. ఈ సినిమా నోలన్‌ను ప్రపంచ స్టార్ డైరెక్టర్‌గా నిలిపింది. ప్రైమ్ వీడియో, జియో సినిమాల్లో అందుబాటులో ఉంది.

ఇంటర్‌స్టెల్లార్ (Interstellar 2014)

స్పేస్, టైమ్, ఫ్యామిలీ ఎమోషన్స్… ఈ సినిమాలో ఎమోషన్‌తో పాటు సైన్స్ ఫిక్షన్‌ ను అద్భుతంగా మేళవించారు. మాథ్యూ మెక్‌కానహీ, ఆన్ హాత్వే నటించిన ఈ సినిమా ప్రైమ్ వీడియో, జియో సినిమాల్లో అందుబాటులో ఉంది.

డంకిర్క్ (Dunkirk 2017)

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జరిగిన డంకిర్క్ ఎవాక్యుయేషన్ కథ. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా జియో సినిమాలో అందుబాటులో ఉంది.

టెనెట్ (Tenet 2020)

టైమ్ ఇన్వర్షన్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా నోలన్ సైన్స్ ఫిక్షన్ మాస్టర్‌పీస్. ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది ఈ సినిమా.

మెమెంటో (Memento 2000)

నోలన్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం ఇది. షార్ట్ టర్మ్ మెమరీ లాస్‌ ఉన్న హీరో లియొనార్డ్ తన భార్యను చంపిన వారిని కనిపెట్టడానికి ఏం చేశాడు ? వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనే ఆసక్తికరమైన అంశంతో ఈ సినిమా సాగుతుంది. లయన్స్‌గేట్ ప్లేలో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది.

ఒపెన్‌హైమర్ (Oppenheimer 2023)

7 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం అణు బాంబు తయారీ వెనుక ఉన్న మానసిక సంఘర్షణను చూపిస్తుంది. జియో సినిమాలో అందుబాటులో ఉంది. ‘ది ఒడిస్సీ’ చూడడానికి ముందు ఈ సినిమాలు చూసి థియేటర్ కు వెళ్ళండి.

Read Also: కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

Related News

గర్ల్ ఫ్రెండ్ కోసం కుక్కను తెచ్చి కొత్త చిక్కుల్లో… డాగ్ లవర్స్ డోంట్ మిస్

ఒకరి తర్వాత ఒకరు సైకోలుగా మారి హత్యలు చేసే పేరున్న వ్యక్తులు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

యాక్సిడెంట్, కట్ చేస్తే ప్రేమించిన అమ్మాయి భార్యగా… మెంటలెక్కించే తమిళ సై-ఫై రొమాంటిక్ థ్రిల్లర్

ఏం సిరీస్ గురూ… మనుషుల్ని చంపి పచ్చి మాంసం నోట్లో కుక్కే కిల్లర్

50 రోజులు అందమైన అమ్మాయితో గదిలో కాలు బయట పెట్టకుండా… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ

ఏడుగురు ఆవారాగాళ్ల కథ… షార్ట్ కట్ లో కోటీశ్వరులు అవ్వాలనుకునే కామెడీ డ్రామా

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×