Psychological Horror Thriller: ఇటీవల కాలంలో భార్యలను భర్తలు, భర్తలను భార్యలు చంపే కేసులు ఎక్కువవుతున్నాయి. అందులో ఎక్కువగా ఆడవాళ్ళు తమ భర్తలను చంపారు అన్న వార్తలే వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ మాత్రం భార్యాభర్తలదే. కానీ ట్విస్ట్ ఏంటంటే ఒకరిని మరొకరు చంపుకోవడం కాదు… ఓ భార్యను బతికుంచుకోవడానికి భర్త చేసే ప్రయత్నం. ఎంత మంచి భర్త అనుకుంటున్నారమో ఆగండాగండి. గతం మరిచిపోయిన భార్యను వశం చేసుకోవడానికి ఆ భర్త పన్నిన పన్నాగం తెలిస్తే అవాక్కవుతారు. ఇంతకీ మూవీ స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.
ఈ సినిమాలో హీరోయిన్ పేరు డయానా. ఆమె ఒక ఘోరమైన కారు ప్రమాదానికి గురవుతుంది. ఆ యాక్సిడెంట్ కారణంగా చాలా కాలం పాటు కోమాలో ఉంటుంది. చాలా ఏళ్ల తరువాత కళ్ళు తెరిచి, మన లోకంలో అడుగు పెడుతుంది. కోమా నుండి బయటకు వచ్చిన డయానా గతాన్ని పూర్తిగా మర్చిపోతుంది. ఆమెకు తన భర్త హోమర్ ఎవరో కూడా గుర్తుండదు.
ఆమెకు గతాన్ని తిరిగి గుర్తుచేయడం కోసం హోమర్ ప్రయత్నిస్తాడు. అందుకోసం నగరానికి దూరంగా ఉన్న ఒక సీక్రెట్ వైద్య పరిశోధనా కేంద్రానికి తీసుకువెళతాడు. అక్కడ ఆమెకు కొన్ని సరికొత్త ప్రయోగాత్మక చికిత్సలు అందిస్తారు. చికిత్స జరుగుతున్న కొద్దీ డయానా మనస్సులో కొన్ని భయానకమైన దృశ్యాలు మెదులుతుంటాయి. తన భర్త హోమర్ చాలా మంచివాడిలా నటిస్తున్నప్పటికీ, ఆమె కోమాలోకి వెళ్లడానికి, జ్ఞాపకశక్తి పోవడానికి అతనే కారణమా అనే అనుమానం డయానాకు వస్తుంది.
క్లైమాక్స్ లోకి వెళ్ళే కొద్దీ సినిమాలో వచ్చే ఊహించని ట్విస్టులు షాకిస్తాయి. నిజానికి డయానా కోమా నుండి కోలుకోలేదు. హోమర్ తన భార్యను కోల్పోవడం ఇష్టం లేక ఆమె క్లోన్లను తయారు చేస్తూ వస్తాడు. మరి ఇప్పుడున్న డయానా క్లోనా లేక అతని నిజమైన భార్యనా ? ఆమె మెదడును తన కంట్రోల్‌లో ఉంచుకోవడానికి హోమర్ ఏం చేశాడు ? అతని కూతురుకు సంబంధించిన సీక్రెట్ ఏంటి ? ఆ ఆసుపత్రిలో ఉన్న మిస్టీరియస్ రూమ్ లో ఏముంది ? నిజం తెలుసుకున్న హీరోయిన్ ఏం చేసింది ? ఆడియన్స్ ను షాక్ ఇచ్చే ఆ క్లైమాక్స్ ఏంటి ? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమాను డోంట్ మిస్.
హాలీవుడ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘హనీ బంచ్’. ఈ సినిమాను ఒక్కసారి చూస్తే చాలా రోజుల వరకు మర్చిపోలేరు. దర్శక ద్వయం మేడలిన్ సిమ్స్-ఫ్యూయర్, డస్టీ మాన్సినెల్లి తెరకెక్కించిన ఈ చిత్రం 2025లో బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రీమియర్ అయింది. ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ ఆడియోతో సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ లేదు. కావాలంటే ఇంగ్షీషులోనే చూడాలి.
Read Also: తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్