E-Paper
Advertisement

Family Drama OTT : విందు కోసం ఎదురు చూపులు… గుండెను మెలిపెట్టే పసిపిల్లల ప్రయాణం

Family Drama OTT : విందు కోసం ఎదురు చూపులు… గుండెను మెలిపెట్టే పసిపిల్లల ప్రయాణం
Advertisement

Family Drama OTT : గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక అద్భుతమైన మూవీని చూడాలనుకుంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే బెంగాల్‌ మూవీపై ఓ లుక్ వేయండి. ఇది ఇద్దరు సోదరుల చుట్టూ తిరిగే ఒక ఏమోషల్ డ్రామా. ఇది నేషనల్ అవార్డులను కూడా గెలుచుకుంది. అంతేకాకుండా, ఈ సినిమా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గుండెను మెలిపెట్టే సీన్స్ తో ఈ సినిమా ఉంటుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

2016లో వచ్చిన ఒక బెంగాలీ మూవీ పేరు ‘కలర్స్ ఆఫ్ ఇన్నోసెన్స్’ (Colours of Innocence). మానస్ ముకుల్ పాల్ దర్శకత్వం వహించిన ఈ బెంగాలీ సినిమాను అవిజిత్ సాహా నిర్మించారు. ప్రసిద్ధ రచయిత బిభూతిభూషణ్ బంద్యోపాధ్యాయ రాసిన ‘తాల్ నవమి’ అనే కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.  చంద్రదీప్ గోస్వామి, ఇంద్రదీప్ దాస్‌గుప్తా దీనికి సంగీతం అందించారు. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు లభించింది. 64వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ బాల నటుల విభాగంలో ఇద్దరు బాల నటులు (సమీయుల్ ఆలం, నూర్ ఇస్లాం) అవార్డులు గెలుచుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Video, Hoichoi ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

బెంగాల్‌లోని ఒక గ్రామీణ ప్రాంతంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. గోపాల్ కి10 ఏళ్లు, ఛోటుకి ఎనిమిదేళ్లు ఉంటాయి. ఒక ప్రమాదంలో వీళ్ళ తండ్రికి తీవ్రమైన గాయాలై మంచాన పడతాడు. దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా పేదరికంలోకి కూరుకుపోతుంది.. ఇంటిని గడపడం తల్లికి భారం అవుతుంది. పదేళ్ల గోపాల్ తన తల్లి పడుతున్న కష్టాన్ని చూడలేక, చిన్న వయసులోనే బాధ్యతను భుజాన వేసుకుంటాడు. అడవిలో దొరికే వస్తువులను అమ్మి, చిన్న చిన్న పనులతో ఎలాగైనా కుటుంబాన్ని గట్టెక్కించాలని తాపత్రయ పడుతుంటాడు.

మరోవైపు చిన్నవాడైన ఛోటుకి ఊర్లోని ఒక బ్రాహ్మణుడి ఇంట్లో జరిగే ‘తాల్ నవమి’ పండుగ భోజనం మీద కన్నుంటుంది. ఆ విందులో రకరకాల పిండివంటలు తింటామని వాడు ఎంతో అమాయకంగా ఆశపడతాడు. పండుగ రోజు వస్తుందని, తమని కూడా పిలుస్తారని వాడు చాలా కలలు కంటాడు. చివరకు వీళ్ళ ఆశలు తీరుతాయా ? ఈ సినిమా ఇద్దరి కథను ఎలాంటి ముగింపును ఇస్తుంది? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  వంటగది నుంచి వస్తువులు మాయం… కెమెరా రికార్డింగ్ చూస్తే మైండ్ బెండయ్యే ట్విస్ట్

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×