E-Paper
Advertisement

Psychological Thriller OTT : వంటగది నుంచి వస్తువులు మాయం… కెమెరా రికార్డింగ్ చూస్తే మైండ్ బెండయ్యే ట్విస్ట్

Psychological Thriller OTT : వంటగది నుంచి వస్తువులు మాయం… కెమెరా రికార్డింగ్ చూస్తే మైండ్ బెండయ్యే ట్విస్ట్
Advertisement

Psychological Thriller OTT : ఓటీటీలకు ఆడియన్స్ నుంచి ఆదరణ పెరిగిన తర్వాత చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు ఊహించని రెస్పాన్స్ దక్కుతోంది. కేవలం సినిమాలకు మాత్రమే కాదు డాక్యుమెంటరీలు, సిరీసులు కూడా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్ అక్కడిదాకానే ఆగిపోలేదు అప్పుడప్పుడు అదిరిపోయే షార్ట్ ఫిలిమ్స్ పై కూడా ఒక కన్నేస్తున్నారు ఆడియన్స్. మీకు కూడా అద్భుతమైన కంటెంట్ ఉన్న షార్ట్ ఫిలిమ్స్ ఇష్టం ఉంటే కచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న సినిమాపై ఒక లుక్కెయ్యండి. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఫ్రీగానే స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న షార్ట్ ఫిలిం పేరు ‘రాట్ ఇన్ ది కిచెన్’. 20023లో రిలీజ్ అయిన ఈ హిందీ సైకలాజికల్ షార్ట్ ఫిలిం కు అభిజిత్ పాండే దర్శకత్వం వహించారు. కేవలం 18 నిమిషాల వ్యవధితో నడిచే ఈ థ్రిల్లర్ మూవీలో స్టోరీ ఆకట్టుకుంటుంది. ఇందులో అర్జున్ మాథూర్, సౌమ్య తాప్తియా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీని యూట్యూబ్లో ఫ్రీగానే చూడొచ్చు. ఐఎండిబిలో ఈ మూవీకి 7.5 రేటింగ్ ఉండడం మరో విశేషం. ముంబైలోని ఓ చిన్న అపార్ట్మెంట్లో సినిమా సాగుతుంది. క్యాస్ట్రోఫోబిక్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఒకే రాత్రిలో డిన్నర్ నుంచి మొదలై తెల్లారి వరకు సాగుతుంది. పైగా రన్ టైమ్ కూడా తక్కువే.

Advertisement

Also Read : ‘పింక్’ నుండి ‘థప్పడ్’ వరకు… ‘అస్సీ’ విడుదలకు ముందు చూడాల్సిన తాప్సీ పన్ను అద్భుతమైన సినిమాలు ఇవే

కథలోకి వెళ్తే…

సినిమా మొత్తం ప్రియా – రాజ్ అనే జంట చుట్టూ తిరుగుతుంది. ఓ అపార్ట్మెంట్లో వీరిద్దరూ కాపురం ఉంటారు. కానీ రాజ్ తన భార్య ప్రియాను ఏమాత్రం పట్టించుకోడు. తింటున్నప్పుడు కూడా మొబైల్ ఫోన్ చూడడం వంటివి చేస్తాడు. ఓ రోజు అతను కాల్ గర్ల్ తో ఫోన్ మాట్లాడుతూ భార్యకి దొరికిపోతాడు. ఆమె నిలదీయగా ముందు బుకాయిస్తాడు. కానీ చివరికి అసలు విషయాన్ని ఒప్పుకొని, అది కేవలం స్ట్రెస్ రిలీఫ్ కోసమని చెప్తాడు. ఇక తనను భర్త మోసం చేస్తున్నాడని తెలుసుకుని, ఆ భార్య ఎమోషనల్ గా బ్రేక్ డౌన్ అవుతుంది. కిచెన్ లో ఉన్న ఎలుకను చూస్తూ తన జీవితాన్ని ఆ జీవీతో పోల్చుకుంటుంది, బాధపడుతుంది. ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఉంటుంది.

Advertisement

ఎలాగైనా సరే భర్తకు బుద్ధి చెప్పాలని డిసైడ్ అవుతుంది. అతన్ని మెంటల్ గా టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఫుడ్ లో విషం కలిపి, అది అతన్ని బాధ పెట్టకుండా చంపేస్తుందని చెప్తుంది. విషయం తెలిసిన రాజ్ భయపడతాడు. క్లైమాక్స్ లో ప్రియా తన భర్తను కిచెన్ లో లాక్ చేస్తుంది. అలాగే అతని మొబైల్ ఫోన్ తీసుకుని రాజ్ తో మాట్లాడిన అమ్మాయితో మాట్లాడుతుంది. చివరికి హీరో బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా డోర్ లాక్ చేసి ఉండడం వల్ల వీలుపడదు. అక్కడ మళ్లీ ఎలుక కనిపించడంతో అతని మనసులో హ్యాలూజినేషన్ గా మొదలవుతుంది. మరి ఆ తర్వాత హీరో అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నాడు ? ప్రియా తన భర్తను అలాగే వదిలేసిందా ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి ? అన్నది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

 

Tags

Related News

కూతురిని కాపాడాలంటే భార్యను పంపమనే మాఫియా డాన్… 8.8 రేటింగ్‌తో దూసుకెళ్తున్న తెలుగు థ్రిల్లర్

పూజారి అంటే పూజలే అనుకుంటున్నారా ? విలన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఫైటర్… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

దుల్కర్‌ సినిమా స్ట్రీమింగ్ విషయంలో గందరగోళం… స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో ? ఎప్పటి నుంచి ?

అపార్ట్‌మెంట్‌లో వరుస మిస్సింగ్స్.. ఆ బిల్డింగ్ కేర్‌టేకర్‌ వెనుక దాగిన భయంకర నిజం… హాలీవుడ్ హారర్ థ్రిల్లర్

ఆ పాత పెట్టె తెరిస్తే పాతాళానికే… ఇంట్లోనే నరకం చూపించిన దుష్టశక్తి… తెలుగులోనే ఈ హారర్ థ్రిల్లర్

అడవిలో ఆపద తెచ్చిన ప్రయాణం… ఆ దారిలో వెళ్తే ప్రాణాలే గాల్లో… టెర్రిఫిక్ తెలుగు థ్రిల్లర్

పూరీ పుణ్యక్షేత్రం రహస్యం… దివ్యశక్తి కోసం విలన్ల ఊచకోత… ఒక్కో సీన్ చూస్తుంటే మతిపోతోంది

ఈజీ మనీ కోసం ఎన్నికల్లో మోసం.. చివరికి ఊరంతా శత్రువులైతే… తెలుగు సినిమానే

Big Stories

Advertisement
×