E-Paper
Advertisement

తండ్రుల ఇగోలు కొడుకుల గోలలు కలిపి కొట్టిన పక్కా రౌడీ స్టోరీ… ఐయండిబిలో 8.4 రేటింగ్

తండ్రుల ఇగోలు కొడుకుల గోలలు కలిపి కొట్టిన పక్కా రౌడీ స్టోరీ… ఐయండిబిలో 8.4 రేటింగ్
Advertisement

Comedy Drama OTT : పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో ఒక బాలీవుడ్ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇందులో పెద్ద నటులు లేకపోయినా, కంటెంట్ పరంగా అదరగొడుతోంది. దీనికి IMDbలో 8.4 రేటింగ్ ఉండటం విశేషం. దీనిని చూస్తున్నప్పుడు చిన్నప్పుడు మనల్ని మనం చూస్తున్నట్లు ఉంటుంది. ఫ్యామిలీతో కలసి ఈ సినిమాను ఈ వీకెండ్ ఎంచక్కా చూసేయండి. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎక్కడ చూడచ్చు అంటే

2025లో వచ్చిన ఈ హిందీ డ్రామా పేరు ‘ఘిచ్ పిచ్’ (Ghich Pich). ఈ సినిమా దర్శకుడు అంకుర్ సింగ్లా ఒకప్పుడు సక్సెస్‌ఫుల్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడు. తన కంపెనీని అమెజాన్‌కు అమ్మేసిన తర్వాత, సినిమాలపై ఉన్న ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2025లో విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు బాగానే దక్కాయి. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ఈ సినిమాను ప్రదర్శించగా, అక్కడ దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకు రిత్విక్ దే అందించిన సంగీతం ఒక పెద్ద ఎసెట్. ఇందులో శివం కకర్, కబీర్ నంద, ఆర్యన్ సింగ్ రాణా, నితేష్ పాండే, సత్యజిత్ శర్మ లీడ్ రోల్స్ లో నటించారు. ఇందులో నటించిన సీనియర్ నటుడు నితేష్ పాండే మరణానంతరం ఆయనకు ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు రావడం గమనార్హం. కేవలం 1 గంట 32 నిమిషాల నిడివి ఉన్న ఈ చిన్న సినిమా, బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వసూళ్లు రాబట్టకపోయినా, కంటెంట్ పరంగా ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా Apple TV లో అద్దెకు అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఈ కథ 90వ దశకంలో చండీగఢ్‌లో ఉండే ముగ్గురు ప్రాణ స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. ఒకడు అనురాగ్, ఇంకొకడు గుర్ ప్రీత్, మూడోవాడు గౌరవ్. వీళ్లు అప్పుడప్పుడే స్కూల్ దాటి కాలేజీ వయసులోకి వస్తుంటారు. ఇంట్లో తండ్రుల చాదస్తం, బయట గర్ల్ ఫ్రెండ్స్ గోల, మధ్యలో చదువు టెన్షన్.. ఇలా వీళ్ల జీవితం మొత్తం ఒక గందరగోళంలా ఉంటుంది. పాత కాలం నాటి ల్యాండ్‌లైన్ ఫోన్లు, సైకిల్ తొక్కడాలు, ఆ కాలపు అల్లరితో కథ సరదాగా సాగుతుంది. అసలు గొడవ ఎక్కడ మొదలవుతుందంటే, గుర్ ప్రీత్ అనే సిక్కు అబ్బాయి ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి తన జుట్టు కత్తిరించుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఇది వాళ్ల నాన్నకు అస్సలు నచ్చదు. ఇంకోవైపు గౌరవ్ అనే కుర్రాడికి తన నాన్న గురించి ఒక చేదు నిజం తెలుస్తుంది. ఇక అనురాగ్ పరిస్థితి ఏంటంటే, వాళ్ల నాన్న ఎప్పుడూ లెక్చర్లు ఇస్తూ విసిగిస్తుంటాడు.

ఇలా ముగ్గురు స్నేహితులకు వాళ్ల తండ్రులతో పడక, ఇంట్లో ఎప్పుడూ రచ్చ జరుగుతూనే ఉంటుంది. తండ్రుల అంచనాలు ఒకలా ఉంటే, ఈ కుర్రాళ్ల ఆలోచనలు ఇంకోలా ఉంటాయి. ఈ గ్యాప్‌లో వీళ్లు పడే ఇబ్బందులు, చేసే తప్పులు, ఆ తప్పుల నుంచి నేర్చుకునే పాఠాలే ఈ సినిమా. చివరికి ఆ గందరగోళాన్ని దాటుకుని ఈ ముగ్గురూ తమ తండ్రులతో ఎలా సెట్ అయ్యారు ? తమకంటూ ఒక గుర్తింపును ఎలా తెచ్చుకున్నారు ? అనేదే క్లైమాక్స్.

Advertisement

Read Also : ప్రేమ కోసం రిస్క్ చేసే ప్రియురాలు… ఓటీటీలో అదరగొడుతున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×