E-Paper
Advertisement

ఫీజు ఇస్తే చాలు కోర్టులో చుక్కలు చూపించే గడుసు లాయర్… అసలైన కిక్కిచ్చే కోర్ట్ రూమ్ డ్రామా

ఫీజు ఇస్తే చాలు కోర్టులో చుక్కలు చూపించే గడుసు లాయర్… అసలైన కిక్కిచ్చే కోర్ట్ రూమ్ డ్రామా
Advertisement

Legal Comedy Drama : కొరియన్ సిరీస్ లను చూసే ఫ్యాన్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్ లను ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. థ్రిల్లర్, కామెడీ, రొమాంటిక్ సిరీస్లు సరికొత్తగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం సరదాగా సాగిపోయే ఒక కొరియెన్ కోర్టు డ్రామా గురించి చెప్పుకోబోతున్నాం. సీరియస్ కేసులను కూడా కామెడీతో, వెటకారంతో ఎలా డీల్ చేయవచ్చో ఇందులో చూడొచ్చు. డబ్బు మాత్రమే ముఖ్యమనుకునే ఒక మొండి లాయర్, న్యాయం కోసం తపించే ఒక సిన్సియర్ లాయర్ మధ్య జరిగే ఇంట్రెస్టింగ్ పోరాటమే ఈ సిరీస్. కోర్టు సీన్లు బోర్ కొట్టకుండా, హీరో చేసే అతి తెలివి పనులు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి ఇందులో.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ కొరియన్ కామెడీ లీగల్ డ్రామా సిరీస్ పేరు ‘లీగల్ హై’ (Legal High). ఇది 2012లో జపాన్‌లో వచ్చిన అత్యంత ప్రజాదరణ పొందిన ‘లీగల్ హై’ అనే డ్రామాకు కొరియన్ రీమేక్. దీనిని కిమ్ జంగ్-హ్యున్ దర్శకత్వం వహించగా, పార్క్ సియోంగ్-జిన్ కథను అందించారు. ఇది ప్రముఖ కొరియన్ ఛానల్ ‘JTBC’లో 2019 ఫిబ్రవరి నుండి మార్చి వరకు ప్రసారమైంది. ఇందులో జిన్ గూ, సియో యున్-సూ లీడ్ రోల్స్ లో నటించారు. ప్రస్తుతం ఈ సిరీస్ 16 ఎపిసోడ్స్ తో నెట్‌ఫ్లిక్స్ (Netflix), వికీ (Viki) లలో అందుబాటులో ఉంది. అయితే ఇది తెలుగులో డబ్బింగ్ అవ్వలేదు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఇందులో హీరో గో టే-రిమ్ ఒక తెలివైన లాయర్. ఇతనికి బాగా గర్వం కూడా ఎక్కువ. ఇతని దృష్టిలో న్యాయం కంటే కేసును గెలవడమే ముఖ్యం. ఏ కేసునైనా 100% గెలిపించగలననే నమ్మకంతో ఉంటాడు. తన దగ్గరకు వచ్చే క్లయింట్ల దగ్గర భారీగా ఫీజులు వసూలు చేస్తూ, చట్టంలోని లొసుగులను వాడుకుని ప్రత్యర్థులను కోర్టులోనే ఆడుకుంటాడు. ఇక హీరోయిన్ సియో జే-ఇన్ ఒక నిజాయితీ గల కొత్త లాయర్. ఈమెకు చట్టం మీద, న్యాయం మీద చాలా గౌరవం ఉంటుంది. ఒక కష్టమైన కేసులో తన తెలివితేటలు సరిపోక, తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెకు అస్సలు నచ్చని హీరో సహాయం కోరుతుంది. ఒకరు డబ్బు కోసం అబద్ధాన్ని కూడా నిజం చేస్తానంటాడు, ఇంకొకరు నిజం కోసం ప్రాణాలిస్తానంటుంది. అస్సలు పడని ఈ ఇద్దరూ కలిసి కేసులను ఎలా డీల్ చేశారు? కోర్టులో ప్రత్యర్థులకు ఎలా చుక్కలు చూపించారు ? అన్నదే ఈ కథ. మధ్యలో కొన్ని సెంటిమెంట్ సీన్లు, బోలెడన్ని నవ్వులతో ఈ కోర్టు డ్రామా సాగుతుంది.

Read Also : ప్రపంచం మెచ్చిన కొరియన్ డ్రామా… అసాధ్యమైన కేసులను సుసాధ్యం చేసే మేధావి… ఐయండిబిలో 8.5 రేటింగ్

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×