E-Paper
Advertisement

Comedy Drama ott : ఈసారి మృతుడి కన్ను మిస్… కడుపుబ్బా నవ్వించే ఇన్వెస్టిగేటివ్ కామెడీ థ్రిల్లర్

Comedy Drama ott : ఈసారి మృతుడి కన్ను మిస్… కడుపుబ్బా నవ్వించే ఇన్వెస్టిగేటివ్ కామెడీ థ్రిల్లర్
Advertisement

Comedy Drama ott : క్రైమ్ థ్రిల్లర్ అనగానే సీరియస్ కథలు గుర్తొస్తాయి. ఎవరో ఒకరి మర్డర్ జరగడం, అందులో ఎవరి హస్తం ఉందనే పోలీస్ ఇంటరాగేషన్, అనుమానితుల వెంట పోలీసుల పరుగులు, చివరికి నిందితుడిని పట్టుకుని మోటివ్ ఏంటో తెలుసుకోవడం, శిక్ష పడడడం… ఆల్మోస్ట్ ఇదే స్టోరీలైన్ తో తెరకెక్కుతాయి చాలా వరకు మర్డర్ మిస్టరీలు. కానీ ఇప్పుడు మన మూవీ సజెషన్ లో మాత్రం క్రైమ్ కి కామెడీ యాడ్ చేసి కడుపుబ్బా నవ్వించే మూవీ. మరి ఈ మూవీ పేరేంటి? దాని కథ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్

2024లో తెరపైకి వచ్చిన హిందీ బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘సన్‌ఫ్లవర్ సీజన్ 2’ (Sunflower Season 2). వికాస్ బహ్ల్ క్రియేట్ చేసిన ఈ సిరీస్ ను నవీన్ గుజ్రాల్ డైరెక్ట్ చేశాడు. సీజన్ 1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కొంత గ్యాప్ ఇచ్చి సీజన్ 2 ను విడుదల చేశారు. 2024 మార్చి 1న జీ5 (ZEE5) ఓటీటీలో ఈ సిరీస్ విడుదల అయింది. 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సీజన్ మిడిల్ క్లాస్ హౌసింగ్ సొసైటీలో జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. IMDbలో 7.4 రేటింగ్ ఉన్న ఈ సిరీస్ ను క్రైమ్ కామెడీ లవర్స్ అస్సలు మిస్ అవ్వొద్దు.

Advertisement

సోనూ సింగ్ అనే ప్రైమ్ సస్పెక్ట్ గా ఇందులో నటించాడు సునీల్ గ్రోవర్. అదా శర్మ రోజీ మెహతా అనే బార్ డాన్సర్ పాత్రతో ఈ ఫ్రాంచైజీలోకి అడుగు పెట్టింది. రణ్‌వీర్ షోరే (ఇన్‌స్పెక్టర్ డిజి), గిరీష్ కుల్కర్ణి (ఇన్‌స్పెక్టర్ తాంబే), ముకుల్ చడ్డా (మిస్టర్ అహుజా), రాధా భట్ (మిసెస్ అహుజా), అశిష్ విద్యార్థి, షోనాలీ నాగ్రాణి తదితరులు మొదటి పార్ట్ తో పాటు సీజన్ 2లో కూడా నటించారు.

Read Also :  థియేటర్లలో బిగ్గెస్ట్ డిజాస్టర్… షాకింగ్ క్లైమాక్స్ తో ఓటీటీలో నెం.1గా ట్రెండింగ్

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

సీజన్ 1లో మిస్టర్ కపూర్ మర్డర్ మిస్టరీలో కిల్లర్ ను పట్టుకుని, మొదటి సీజన్ కు ఎండ్ కార్డు వేశారు. సీజన్ 2 స్టోరీ అక్కడి నుంచే కంటిన్యూ అవుతుంది. హీరో నివాసం ఉండే అపార్ట్మెంట్ పేరు సన్‌ఫ్లవర్ సొసైటీ. ఇందులోని పెంట్‌హౌస్ లోకి రోజీ మెహతా (అదా శర్మ) అనే అమ్మాయి కొత్తగా దిగుతుంది. నిజానికి ఆ అమ్మాయి ఒక బార్ డాన్సర్. అలాగే ఆమె బ్యాక్‌గ్రౌండ్ కూడా మిస్టీరియస్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ సొసైటీలో ఒక మర్డర్ జరుగుతుంది.

ఆ మర్డర్ కేసులో సోనూ సింగ్ (సునీల్ గ్రోవర్) అనే అమాయకుడు ప్రైమ్ సస్పెక్ట్‌ గా ఉంటాడు. ఇన్‌స్పెక్టర్స్ డిజి (రణ్‌వీర్ షోరే), తాంబే (గిరీష్ కుల్కర్ణి) ఇన్వెస్టిగేషన్ ను కొనసాగిస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ లో సొసైటీలో ఉండేవారి సీక్రెట్స్ ఒక్కొక్కటిగా బయట పడతాయి. మరోవైపు రోజీ-సోనూ మధ్య రొమాన్స్ కూడా మొదలవుతుంది. ఈ క్రమంలోనే మర్డర్ కేసు ఊహించని టర్న్ తీసుకుంటుంది. అసలు ఆ రోజీ ఎవరు ? మర్డర్ చేసింది ఎవరు, ఎందుకు ? హీరో ఈ సమస్య నుంచి ఎలా బయట పడ్డాడు ? అన్నది మూవీలో చూడాల్సిందే.

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×