E-Paper
Advertisement

Comedy Movie OTT : లేక లేక కుదిరే పెళ్లి… రాత్రి అవ్వగానే అదేపని… ఈ కామెడీకి పొట్ట చెక్కలే

Comedy Movie OTT : లేక లేక కుదిరే పెళ్లి… రాత్రి అవ్వగానే అదేపని… ఈ కామెడీకి పొట్ట చెక్కలే
Advertisement

Comedy Movie OTT : రాజ్‌కుమార్ రావు ఇప్పుడు మినిమం గ్యారంటీ హీరో. తనదైన మార్కు నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే గత ఏడాది ఈ హీరో నటించిన సినిమా కామెడీతో కెవ్వు కేక అనిపించింది. టైమ్ లూప్‌లో చిక్కుకుని పిచ్చెక్కిపోయే కుర్రాడిగా ఆయన కామెడీ అదిరిపోతుంది. ఫాంటసీ కథే అయినా, వారణాసి గల్లీల్లో తిరుగుతూ మంచి కామెడీతో సాగుతుంది ఈ సినిమా.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ రొమాంటిక్ కామెడీ ఫాంటసీ చిత్రం పేరు ‘భూల్ చుక్ మాఫ్’ (Bhool Chuk Maaf). మహారాణి’ వంటి పాపులర్ వెబ్ సిరీస్‌ కు దర్శకత్వం వహించిన కరణ్ శర్మ దీనిని డైరెక్ట్ చేశారు. ‘స్త్రీ’, ‘ముంజ్య’ వంటి హిట్ హారర్-కామెడీ చిత్రాలను నిర్మించిన దినేష్ విజన్ ఈ సినిమాను నిర్మించారు. రాజ్‌కుమార్ రావు, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించారు. సంజయ్ మిశ్రా, సీమా పహ్వా, రఘుబీర్ యాదవ్, జాకీర్ హుస్సేన్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటించి సినిమాకు మంచి కామెడీ టచ్ ఇచ్చారు. ఈ సినిమా 2025 మే 23న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Video లో అందుబాటులో ఉంది. సచిన్-జిగర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. వారణాసి నేపథ్యంలో వచ్చే పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటాయి ఇందులో.

స్టోరీ ఏమిటంటే

Advertisement

వారణాసిలో ఉండే రంజన్ (రాజ్‌కుమార్ రావు) అనే కుర్రాడికి లేకలేక పెళ్లి సెట్ అవుతుంది. తీరా పెళ్లి పీటల మీద ఉన్నప్పుడు, ఏదో మాయ జరిగినట్టు ఆ రోజంతా మళ్ళీ మొదటికొస్తుంది. అంటే అతను ఏం చేసినా సరే, రాత్రి అవ్వగానే మళ్ళీ అదే పెళ్లి రోజు ఉదయం నిద్రలేస్తాడు. ఇలా ఒకే రోజు పదే పదే జరుగుతూ, ఒక టైమ్ లూప్ లో ఇరుక్కుపోతాడు. పాపం అతను ఆ పెళ్లి గండం నుంచి బయటపడలేక, ఆ ఒక్క రోజే వందల సార్లు బతికేస్తూ పిచ్చెక్కిపోతుంటాడు.

ఇక ఈ లూప్ నుంచి బయటపడాలంటే ఏదో ఒక దారి ఉండాలి కదా! అప్పుడే అసలు విషయం బయటపడుతుంది. రంజన్ చిన్నప్పుడు ఏదో ఆషామాషీగా కాశీ విశ్వేశ్వరుడికి ఒక మొక్కు మొక్కుకుంటాడు. కానీ పెళ్లి తొందరలో అది మర్చిపోతాడు. ఆ మొక్కు తీర్చకుండా పెళ్లి కి తయ్యారు అవ్వడంతో ఈ శాపంలో పడతాడు. దీంతో వాడు ఆ మొక్కు ఏంటో తెలుసుకుని, దాన్ని పూర్తి చేయడానికి పడే పాట్లు, ఆ గందరగోళం అంతా భలే నవ్విస్తుంది. చివరికి రంజన్ తన తప్పు తెలుసుకుని ఆ మొక్కు ఎలా తీర్చాడు, ఆ క్రమంలో తన ప్రేయసి తిట్లీ (వామికా గబ్బి) మనసు ఎలా గెలుచుకున్నాడు ? అనేదే సినిమా.

Advertisement

Read Also : కొడుకుల కోసం తపించే తండ్రి… ప్రశంసలతో పరుగులు తీస్తున్న సినిమా… గుండెను పిండే ఎమోషన్స్

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×