E-Paper
Advertisement

ఓటీటీలోకి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన హిందీ డార్క్ కామెడీ… ఇరగదీసిన రాజ్ కుమార్ రావ్

ఓటీటీలోకి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన హిందీ డార్క్ కామెడీ… ఇరగదీసిన రాజ్ కుమార్ రావ్
Advertisement

Comedy Movie OTT : ఓటీటీలోకి సరికొత్త కంటెంట్ ను తీసుకొచ్చేందుకు మేకర్స్ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు వాటిని బాగా ఆదరిస్తున్నారు కూడా. ఆ ప్రయత్నంలో భాగంగా, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది ఒక బాలీవుడ్ సినిమా. రాజ్ కుమార్ రావ్ లీడ్ రోల్ నటించిన ఈ డార్క్ కామెడీ ఆడియన్స్ ను తెగ నవ్విస్తోంది. విమర్శకుల పరంగా ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా రాజ్‌కుమార్ రావు ఒక పిసినారి పాత్రలో పండించిన కామెడీ ఓటీటీలో నవ్వులు పూయిస్తోంది. ఐఎమ్‌డిబిలో ప్రస్తుతం 7.3 రేటింగ్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా, ఒక చిన్న వస్తువు చుట్టూ ఎంత పెద్ద క్రైమ్ డ్రామాను నడపచ్చునో చూపించింది.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్ర పోషించిన ఈ కామెడీ సినిమా పేరు ‘టోస్టర్’ (Toaster). వివేక్ దాస్ చౌదరి డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది. రాజ్‌కుమార్ రావు తన సొంత నిర్మాణ సంస్థ ‘కాంప ఫిలిమ్స్’ బ్యానర్‌పై నిర్మించారు. దీనికి ఆయన భార్య పత్రలేఖ నిర్మాతగా వ్యవహరించారు. సుమారు 126 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం 2026 ఏప్రిల్ 15న నేరుగా నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైంది.  ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో సన్యా మల్హోత్రా హీరోయిన్‌గా నటించగా, అర్చన పురాన్ సింగ్, ఫరా ఖాన్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించి సినిమాకు మరింత గ్లామర్, కామెడీని తీసుకొచ్చారు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

హీరో రామకాంత్ (రాజ్‌కుమార్ రావు) ఒక నంబర్ వన్ పిసినారి. ఒక రూపాయి బయటకు తీయాలంటే ప్రాణం పోయినంత పనిచేస్తాడు. అలాంటి వాడు లోకం మెచ్చాలని తన బంధువుల పెళ్లికి ఏకంగా ఐదు వేలు పెట్టి ఒక ‘టోస్టర్’ కొని గిఫ్ట్ ఇస్తాడు. పాపం ఆ దెబ్బతో వాడి బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ అయిపోయిందని తెగ ఫీలవుతుంటాడు. కానీ విధి విచిత్రంగా, అక్కడ గొడవ జరిగి పెళ్లి క్యాన్సల్ అయిపోతుంది. ఇక మన హీరో ఊరుకుంటాడా? పెళ్లే లేనప్పుడు నా టోస్టర్ అక్కడ ఎందుకు ఉండాలని ఫిక్స్ అయిపోతాడు. ఎలాగైనా ఆ గిఫ్ట్‌ను వెనక్కి తెచ్చుకోవాలని స్కెచ్ వేసి అర్ధరాత్రి ఆ ఇంట్లోకి దూకుతాడు.

కానీ అతను వెళ్ళిన టైం అస్సలు బాలేదు. సరిగ్గా అదే టైంలో అక్కడ ఒక మర్డర్ జరుగుతుంది. ఆ గందరగోళంలో రామకాంత్ ఇరుక్కుపోయి, పోలీసుల నుంచి తప్పించుకుంటూ, ఆ టోస్టర్ కోసం చేసే ప్రయత్నాలు ఒక రేంజ్‌లో ఉంటాయి. ఆ ఒక్క టోస్టర్ కోసం మొదలైన రచ్చ కాస్తా ఒక పెద్ద క్రైమ్ నెట్‌వర్క్ దాకా వెళ్తుంది. తన ప్రాణం మీదకు వచ్చినా, ఆ ఐదు వేల టోస్టర్‌ను మాత్రం వదలకూడదని వాడు పడే తిప్పలు మామూలుగా ఉండవు. చివరికి ఆ టోస్టర్ రామకాంత్ తిరిగి తెచ్చుకున్నాడా ? ఆ క్రైమ్ నెట్‌వర్క్ లో చిక్కుకు పోతాడా ? అనే విషయాలను, ఈ కామెడీ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : మైండ్ గేమ్‌ తో మతిపోగొట్టే అంతుచిక్కని మిస్టరీ… అసలు పిచ్చి ఎవరికో అర్థం కాక బుర్ర తిరిగిపోయే థ్రిల్లర్

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×