Psychological thriller OTT : సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఆడియన్స్ ను గందరగోళానికి గురి చేస్తుంటాయి. వీటిలో క్లైమాక్స్ వరకు అసలు ట్విస్ట్ రివీల్ అవ్వకుండా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక హాలీవుడ్ సినిమా ఆడియన్స్ కి మెంటలెక్కించేసింది. ఒక మర్డర్ మిస్టరీని ఛేదించడానికి వెళ్లిన డిటెక్టివ్ కథగా మొదలై, మెల్లగా మెంటల్ ఆసుపత్రిలో జరిగే వింతల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా నిడివి కొంచెం ఎక్కువే అయినా, ఆ ట్విస్టులు, క్లైమాక్స్ ఇచ్చే షాక్ కోసం కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి ఒక మంచి ఛాయిస్.
2022లో వచ్చిన ఈ స్పానిష్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా పేరు ‘గాడ్స్ క్రూక్డ్ లైన్స్’ (God’s Crooked Lines). ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఓరియోల్ పాలో, గతంలో ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’ వంటి మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్స్ తీశారు. ఈ సినిమాలో కూడా ఆయన తనదైన శైలిలో ప్రేక్షకులను చివరి వరకు ఒక అయోమయంలో ఉంచుతారు. 1979లో వచ్చిన ప్రసిద్ధ స్పానిష్ నవల ఆధారంగా తీసిన ఈ మూవీలో, ఆ కాలం నాటి మెంటల్ హాస్పిటల్ వాతావరణాన్ని చాలా రియలిస్టిక్‌గా చూపించారు. ముఖ్యంగా సినిమా నిడివి 2 గంటల 34 నిమిషాలు ఉన్నప్పటికీ, ప్రతి సన్నివేశం కథలోని మిస్టరీని పెంచుకుంటూ వెళ్తుంది. ఇక ప్రధాన పాత్ర పోషించిన బార్బరా లెన్నీ అద్భుతంగా నటించింది. ఈమె నటనకు గాను స్పెయిన్‌లో ప్రతిష్టాత్మకమైన గోయా అవార్డ్స్ నామినేషన్ కూడా లభించింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది.
ఆలిస్ ఒక తెలివైన ప్రైవేట్ డిటెక్టివ్. ఆమె ఒక మెంటల్ హాస్పిటల్‌లో జరిగిన మర్డర్ మిస్టరీని కనిపెట్టాలని ఫిక్స్ అవుతుంది. అక్కడికి మామూలుగా వెళ్తే కుదరదని, తనే ఒక పిచ్చిదానిలా యాక్టింగ్ చేస్తూ ఆసుపత్రిలో జాయిన్ అవుతుంది. అయితే నేను పిచ్చిదాన్ని కాదు, ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చానని ఒక డాక్టర్‌కి ముందే లెటర్ కూడా ఇస్తుంది. హాస్పిటల్‌లో చేరాక అసలు ఆట మొదలవుతుంది. అక్కడ ఉండే చీఫ్ డాక్టర్ అల్వార్, ఈమెకి నిజంగానే పిచ్చి, బయట ఎవరో పెద్ద మనిషితో కలిసి కథలు అల్లుతోందని చెబుతాడు. ఆలిస్ ఏమో నేను చెప్పేదే నిజం, మీరంతా నన్నే ఇరికించాలని చూస్తున్నారని వాదిస్తుంది.
అయితే కథలో అటు డాక్టర్ చెప్పేది నిజం అనిపిస్తుంది, ఇటు ఆలిస్ చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది. చూసే మనకి కూడా అసలు పిచ్చి ఎవరికి ఉందో అర్థం కాక మైండ్ బ్లాక్ అవుతుంది. చివరికి ఆలిస్ తన తెలివితేటలతో హాస్పిటల్ నుంచి బయటపడాలని గట్టిగా ట్రై చేస్తుంది. కోర్టు దాకా కూడా వెళ్తుంది, డాక్టర్ల బోర్డు కూడా ఆమెకి పిచ్చి లేదని నమ్ముతుంది. కానీ సరిగ్గా సినిమా అయిపోయే టైమ్‌లో ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది. ఆ ఒక్క సీన్‌తో ఆలిస్ చెప్పేవన్నీ నిజాలా లేక ఆమె క్రియేట్ చేసుకున్న భ్రమలా అనేది తేలిపోతుంది. ఆ ట్విస్ట్ ఏంటనేది స్క్రీన్ మీద చూస్తేనే కిక్కు ఉంటుంది.
Read Also : అన్న తెచ్చిన తంటాలతో తమ్ముడికి తప్పని తిప్పలు… మామూలు రచ్చ కాదిది