E-Paper
Advertisement

‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3’ స్ట్రీమింగ్ సిద్ధం… ఈసారి పెద్ద సర్ప్రైజ్

‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3’ స్ట్రీమింగ్ సిద్ధం… ఈసారి పెద్ద సర్ప్రైజ్
Advertisement

Save the Tigers Comedy Series OTT : తెలుగు ఓటీటీ ప్రపంచంలో ఫ్యామిలీ కామెడీకి కొత్త నిర్వచనం తీసుకొచ్చిన వెబ్ సిరీస్ Save the Tigers. భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న తగవులు, వాళ్ళ బరువులు, బాధ్యతలు, మధ్యతరగతి కుటుంబాల్లో జరిగే సరదా సంఘటనలు, పురుషుల భావోద్వేగాలకు కామెడీ టచ్‌ ఇచ్చి తీసిన ఈ సిరీస్ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంది. ఇప్పటిదాకా ఈ సిరీస్ రెండు సీజన్లుగా రిలీజ్ కాగా, రెండూ సూపర్ హిట్టై తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం దక్కించుకున్నాయి. ఇప్పుడు అదే ఫ్రాంచైజీ నుంచి మూడో సీజన్ రాబోతోంది అనే వార్తతో మరోసారి ఓటీటీ ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది.

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

2023లో ప్రారంభమైన కామెడీ డ్రామా సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. మొదటి సీజన్ నుంచే యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిన సిరీస్ ఇది. కుటుంబాల్లో భర్తలు ఎదుర్కొనే ఇబ్బందులను హాస్యాత్మకంగా చూపించిన తీరు తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రిలేషన్‌షిప్ సమస్యలను సీరియస్‌ గా కాకుండా సరదాగా చూపించడం అన్నది ఈ సిరీస్ లో అట్రాక్టివ్ అంశంగా మారింది. అందుకే రెండు సీజన్లు అంత పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను కొనసాగిస్తూ సీజన్ 3 కూడా భారీ స్థాయిలో తెరపైకి రావడానికి రంగం సిద్ధమైంది. ఈ వెబ్ సిరీస్ JioHotstar ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే అధికారిక రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇప్పటికైతే మొదటి రెండు సీజన్లు కూడా అదే ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ మరోసారి నవ్వుల్లో మునిగిపోవడానికి ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3’ సిద్ధమవుతోందన్న మాట.

వెన్నెల కిషోర్ ఎంట్రీ

Advertisement

ఇకపోతే తాజా అప్డేట్ ఏంటంటే టాలీవుడ్ లోని మరో కామెడీ కింగ్ ఈ సిరీస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ లో ఆ విషయంపై మేకర్స్ హింట్ ఇచ్చారు. రెండు భిన్నమైన ప్రపంచాల మధ్య జరిగే ఒక సోషల్ ఎక్స్‌పెరిమెంట్ చుట్టూ ఈసారి కథ తిరగబోతుందనే చర్చ నడుస్తోంది. మొదటి రెండు సీజన్లలో కేవలం భార్యాభర్తల సరదా సంఘటనలే చూపించారు. కానీ ఈసారి మరిన్ని వినూత్నమైన మలుపులను ఎక్స్పెక్ట్ చేయొచ్చని హింట్స్ తో సిరీస్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఈ సీజన్‌కు Mahi V. Raghav – Pradeep Advaitham షో రన్నర్స్‌గా వ్యవహరిస్తుండగా, గత సీజన్లలో ప్రేక్షకులను అలరించిన Priyadarshi Pulikonda, Jordar Sujatha, Krishna Chaitanya, Deviyani Sharma, Abhinav Gomatam, Pavani Gangireddy మరోసారి తమ కామెడీ టైమింగ్‌ తో ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇదంతా కాదుగానీ, ఈసారి ప్రేక్షకులకు అసలైన సర్‌ప్రైజ్ Vennela Kishore ఎంట్రీ అని చెప్పొచ్చు. తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే వెన్నెల కిషోర్, ఈ సిరీస్ ద్వారా తొలిసారి ఓటీటీ వెబ్ సిరీస్ ప్రపంచంలోకి అడుగు పెడుతుండడం విశేషం. తాజాగా విడుదలైన పోస్టర్‌లో ఆయన లుక్ ఆసక్తికరంగా ఉంది. మరి ఆయన పాత్ర సిరీస్ లో ఎంత కీలకంగా ఉండబోతుందో తెలియాలంటే సిరీస్ వచ్చేదాకా వెయిటింగ్ తప్పదు.

Advertisement

Read Also : ప్రియురాలిని వేధించిన వాళ్లపై ప్రతీకారం… అత్యంత వివాదాస్పద చిత్రం

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×