E-Paper
Advertisement

ప్రియురాలిని వేధించిన వాళ్లపై ప్రతీకారం… అత్యంత వివాదాస్పద చిత్రం

ప్రియురాలిని వేధించిన వాళ్లపై ప్రతీకారం… అత్యంత వివాదాస్పద చిత్రం
Advertisement

Crime Thriller Movie OTT : సినిమా చూసి థియేటర్ బయటకు వచ్చిన తర్వాత కూడా చేతులు వణికిపోవడం ఎప్పుడైనా జరిగిందా ? కడుపులో ఏదో తెలియని భయం మిగిలిపోవడం వంటి అనుభవం ఏదైనా సినిమా చూసినప్పుడు కలిగిందా ? కానీ కొన్ని సినిమాలు ఉంటాయి మావా… అలాంటి మూవీస్ కథ మాత్రమే కాదు, ప్రేక్షకుడిని మెంటల్ గా డిస్టర్బ్ చేయడం పక్కా. ప్రపంచ సినిమా చరిత్రలో అలాంటి అత్యంత డిస్టర్బింగ్ సినిమాగా పేరు తెచ్చుకున్న మూవీనే Irreversible. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

సైకాలజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఇర్రివర్సబుల్’. ఫ్రెంచ్ దర్శకుడు Gaspar Noe తెరకెక్కించిన ఈ సినిమా విడుదలైన రోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాస్టర్‌పీస్. అయితే మరికొందరికి మాత్రం ఈ మూవీ ట్రామాటిక్ అనుభవం అని చెప్పవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే… ఈ సినిమా ప్రత్యేకత కథలో కాదు, కథ చెప్పిన విధానంలో ఉంటుంది. సాధారణ సినిమాల్లా మొదటి నుంచి చివరికి కాకుండా… సినిమా మొదలయ్యేది కథ ఎండింగ్ తో అన్నమాట. అక్కడి నుంచి ఒక్కో సన్నివేశం వెనక్కి వెళ్తూ, చివరికి ఈ దారుణాలన్నీ ఎలా మొదలయ్యాయో చూడొచ్చు సినిమాలో. సమయం ఒకసారి చేజారిపోతే, జీవితాన్ని తిరిగి సరిచేయలేమనే భయంకరమైన భావన ఈ చిత్రాన్ని చూశాక వెంటాడుతూనే ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే…

Advertisement

కథ పారిస్ నగరంలో ఒకే రాత్రిలో జరిగే విషాదాల చుట్టూ తిరుగుతుంది. సినిమా ప్రారంభమైన మొదటి క్షణమే ప్రేక్షకుడికి షాక్ తగులుతుంది. మార్కస్ పాత్రలో Vincent Cassel, అతని స్నేహితుడు పియరీ కలిసి “లా టెనియా” అనే క్రిమినల్‌ను ఒక క్లబ్‌లో దారుణంగా చంపేస్తారు. ఎందుకు చంపారు ? అనే ప్రశ్నకు సమాధానం కోసం కథ వెనక్కి సాగుతుంది. అక్కడే అసలు నరకం మొదలవుతుంది.

మార్కస్ భార్య అలెక్స్ పాత్రలో Monica Bellucci కనిపిస్తుంది. ఆమె ఒక రాత్రి పార్టీ నుంచి ఒంటరిగా ఇంటికి వెళ్తుంది. అండర్‌గ్రౌండ్ టన్నెల్‌ లో ఆమెపై జరిగే అత్యంత క్రూరమైన అత్యాచార సన్నివేశం ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యంత వివాదాస్పద సన్నివేశాల్లో ఒకటిగా నిలిచిపోయింది. దాదాపు పది నిమిషాల పాటు ఎలాంటి కట్ లేకుండా, ఒక్క సింగిల్ షాట్‌లో తీసిన ఈ సీన్‌ను చూసి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రదర్శన సమయంలో పలువురు ప్రేక్షకులు థియేటర్ వదిలి బయటకు వెళ్లిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కొందరు వాంతులు చేసుకున్నారనే కథనాలు కూడా వెలువడ్డాయి. ఇంతటి బ్రూటల్ సినిమాను చూడాలంటే ఎవరికైనా గుండె ధైర్యం కావాలి. మరి ఆ ధైర్యం మీకు ఉందా ?

Advertisement

Read Also : కోట్ల విలువైన పెయింటింగ్ కోసం క్రాక్ ఎక్కించే పనులు… నవ్వులు పూయించే థ్రిల్లింగ్ మూవీ

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×