E-Paper
Advertisement

Comedy Series OTT : సినిమా కష్టాలతో సినిమా తీయాలనుకునే తింగరి బ్యాచ్… అన్‌ లిమిటెడ్ కామెడీతో అదరగొడుతున్న సిరీస్

Comedy Series OTT : సినిమా కష్టాలతో సినిమా తీయాలనుకునే తింగరి బ్యాచ్… అన్‌ లిమిటెడ్ కామెడీతో అదరగొడుతున్న సిరీస్
Advertisement

Comedy Series OTT : కామెడీతోనే ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి కొరియన్ సిరీస్లు. ఒక ఎపిసోడ్ చూశాక మరో ఎపిసోడ్ కూడా చూడాలనిపిస్తుంది వీటిని చూస్తుంటే. ఇప్పడు చెప్పుకోబోయే సిరీస్ ను చూస్తే చివరి ఎపిసోడ్ వరకు అస్సలు వదలరు. ఇది చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారు. ఈ కథ సినిమా రంగంలో రాణించాలనే కోరికతో ఉన్న ముగ్గురు యువకుల చుట్టూ తిరుగుతుంటుంది. వీళ్ళు చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా ఒక గెస్ట్‌హౌస్‌ను నడుపుతుంటారు. ఈ క్రమంలో సినిమా కలలను నిజం చేసుకోవడానికి, డబ్బు కోసం వాళ్ళు పడే ఇబ్బందులు చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టమే. దీనికి ఐయండిబిలో 8.2 రేటింగ్ ఉండటం విశేషం.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ సూపర్ హిట్ కొరియా కామెడీ డ్రామా పేరు ‘వెల్‌కమ్ టు వైకికి’ (Welcome to Waikiki). ఇందులో లీ ఇ-క్యుంగ్, కిమ్ జంగ్-హ్యున్, సన్ సెంగ్-వాన్ ప్రధాన పాత్రల్లో నటించగా, వారితో పాటు జుంగ్ ఇన్-సన్, గో వోన్-హీ, లీ జూ-వూ కీలక పాత్రలు పోషించారు. ఇది Netflix (నెట్‌ఫ్లిక్స్) Viki (వికి) ఓటిటి ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులో ఉంది. సీజన్ 1 (2018) సూపర్ హిట్ అవ్వడంతో (2019) సీజన్ 2 తీశారు. అయితే రెండో సీజన్‌లో ‘లీ జూన్-కీ’ తప్ప మిగతా మెయిన్ కాస్ట్ అందరూ మారిపోయారు. ఫస్ట్ సీజన్ ఉన్నంత రేంజ్‌లో సెకండ్ సీజన్ లేకపోయినా, కామెడీ మాత్రం గట్టిగానే ఉంటుంది. ఈ డ్రామా షూటింగ్ సమయంలోనే మెయిన్ యాక్టర్లు లీ ఇ-క్యుంగ్, జంగ్ ఇన్-సన్ (సింగిల్ మదర్ క్యారెక్టర్) ప్రేమలో పడ్డారు. కానీ సిరీస్ అయిపోయిన కొన్నాళ్లకే విడిపోయారు. ఇది ఇంకా తెలుగులో డబ్ అవ్వలేదు, కాబట్టి ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తోనే చూడాలి.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ ముగ్గురు కుర్రాళ్ల చుట్టూ తిరుగుతుంది. ఒకడికి డైరెక్టర్ అవ్వాలని ఆశ, ఇంకొకడు యాక్టర్ అవుదామని తెగ ఫీలైపోతుంటాడు, మూడోవాడు ఏదో స్క్రిప్ట్ రాస్తానని బిల్డప్ ఇస్తుంటాడు. వీళ్ల ముగ్గురికీ సినిమా తీయాలనే పిచ్చి తప్ప, చేతిలో చిల్లిగవ్వ ఉండదు. ఉన్న అరాకొరా డబ్బులతో ‘వైకికి’ అనే ఒక గెస్ట్ హౌస్ పెడతారు. కానీ దానికి కస్టమర్లు రారు, పైగా అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటి మీద పడి బాదుతుంటారు. రేపు తింటామో లేదో అన్నట్టు సాగుతుంటుంది వీళ్ల పరిస్థితి. ఇలాంటి టైంలో ఒకరోజు వీళ్ల గెస్ట్ హౌస్‌లో ఎవరో ఒక చిన్న పాపని వదిలేసి వెళ్ళిపోతారు. ఆ పాప ఎవరిదో తెలియక, ఆ పాలు ఎలా తాపించాలో అర్థం కాక వీళ్లు పడే పాట్లు మామూలుగా ఉండవు.

కట్ చేస్తే తరువాత ఆ పాప వాళ్ల అమ్మ అక్కడికి వస్తుంది. ఆమెకి ఉండటానికి చోటు లేకపోవడంతో, వీళ్లే ఆశ్రయం ఇస్తారు. అప్పటి నుంచి ఆ గెస్ట్ హౌస్‌లో ముగ్గురు అబ్బాయిలు, ఆ తల్లి, పాప.. అందరూ కలిసి చేసే రచ్చ, కామెడీ మామూలుగా ఉండదు. ముఖ్యంగా ఆ యాక్టర్ అవ్వాలనుకునే వాడి కష్టాలు చూస్తే కడుపు చెక్కలవుద్ది. చిన్న క్యారెక్టర్ కోసం గడ్డం గీసుకోలేక, వింత గెటప్పులతో సిటీ అంతా తిరుగుతూ వాడు పడే తిప్పలు హైలైట్. ప్రేమలు, బ్రేకప్పులు, అప్పుల వాళ్ల నుంచి తప్పించుకోవడాలు.. ఇలా ప్రతి సీన్ పీక్ కామెడీలో ఉంటుంది. మొత్తానికి లైఫ్ లో ఎన్ని కష్టాలు ఉన్నా, ఈ ముగ్గురు కలిసి ఎలా నవ్వుతూ నెట్టుకొచ్చారు అనేదే ఈ ‘వెల్‌కమ్ టు వైకికి’ స్టోరీ.

Advertisement

Read Also :  గ్రామంలో గందరగోళం… నవ్విస్తూనే భయపెట్టే బుజ్జి దెయ్యం… ఎమోషన్స్ తో ఆకట్టుకునే హారర్

Tags

Related News

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు… నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ఫ్యామిలీ ఎమోషన్

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

Big Stories

Advertisement
×