E-Paper
Advertisement

Horror Comedy OTT: గ్రామంలో గందరగోళం… నవ్విస్తూనే భయపెట్టే బుజ్జి దెయ్యం… ఎమోషన్స్ తో ఆకట్టుకునే హారర్

Horror Comedy OTT:  గ్రామంలో గందరగోళం… నవ్విస్తూనే భయపెట్టే బుజ్జి దెయ్యం… ఎమోషన్స్ తో ఆకట్టుకునే హారర్
Advertisement

Horror Comedy OTT : హారర్ కామెడీ సినిమాలు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటిని భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. చిన్న సినిమాలే వందల కోట్లు వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం ఒక థాయ్ హారర్ సినిమా గురించి చెప్పుకోవాల్సిందే. ఇది బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. సినిమా షూటింగ్ అంతా థాయ్‌లాండ్‌లోని పాత కాలపు పల్లెటూరి వాతావరణం కనిపించేలా సెట్స్ వేశారు. ముఖ్యంగా ఆ చెరువు, పడవలు, పాత ఇళ్లు మన పాత తెలుగు సినిమాల్లో గోదావరి జిల్లాల వాతావరణాన్ని గుర్తుచేస్తాయి. ఇది థాయ్‌లాండ్‌లో ప్రాచుర్యం పొందిన ‘మే నాక్’ అనే జానపద కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అంటే గర్భవతిగా ఉన్న తల్లి చనిపోతే, కడుపులో ఉన్న పిండం దెయ్యంగా మారుతుందన్నమాట.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ థాయ్ హారర్ కామెడీ సినిమా పేరు ‘డ్యాంగ్ ఫ్రా ఖానోంగ్’ (Daeng Phra Khanong). చలీంపోల్ తికంపూర్తీరవాంగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రముఖ థాయ్ కమెడియన్ ముమ్ జోక్మోక్ దీనికి నిర్మాత. ఇందులో డ్యాంగ్ పాత్రలో మెలిక్ ఎఫె ఐగన్ నటించగా, మాచిడా సుత్తికుల్ఫానిచ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో డ్యాంగ్‌గా నటించిన మెలిక్ ఎఫె ఐగన్ నిజానికి థాయ్, టర్కిష్ మూలాలున్న అబ్బాయి. తన క్యూట్ లుక్స్‌తో ఈ సినిమా తర్వాత థాయ్‌లాండ్‌లో పెద్ద స్టార్ అయిపోయాడు. ఈ సినిమా థాయ్‌లాండ్‌లో 2022 మార్చి 31న విడుదలై, మొదటి వారంలోనే భారీ వసూళ్లను సాధించింది. సుమారు 50 మిలియన్ బాట్ వసూలు చేసి, ఆ ఏడాదిలో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ప్లాట్‌ ఫామ్‌లో అందుబాటులో ఉంది. సినిమా ముగింపు చూస్తుంటే, దీనికి పార్ట్-2 వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు, కానీ ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

థాయ్‌లాండ్‌లో ‘మే నాక్’ అనే ఒక పెద్ద దెయ్యం కథ ఫేమస్. థాయ్ నమ్మకాల ప్రకారం, కడుపుతో ఉన్నప్పుడు చనిపోయిన స్త్రీలు భయంకరమైన దెయ్యాలుగా మారతారు. ఆమెతో పాటే కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయి దెయ్యం పిల్లోడిగా పుడతాడు. ఈ క్రమంలో ఆ నాక్ అనే మహిళ చనిపోయాక పుట్టిన దెయ్యం కొడుకే కథలో మెయిన్ పాత్ర అయిన డ్యాంగ్. వాడు దెయ్యం అయినా సరే, వాడికి ఊర్లో ఉండే మామూలు పిల్లలతో కలిసి గోలీలాడుకోవాలని, చెరువులో ఈత కొట్టాలని భలే ఆశ. పాపం ఆ పిల్లాడు చూడ్డానికి క్యూట్‌గా ఉన్నా, లోపల మాత్రం దెయ్యం పవర్స్ ఉంటాయి. కానీ ఎవరికీ హాని చేయకుండా అందరితో దోస్తీ చేయాలని తెగ ట్రై చేస్తుంటాడు ఆ పిల్లాడు.

కానీ ఊర్లో జనం ఊరుకుంటారా? ఎక్కడ వాడు తమ పిల్లల్ని పట్టుకుపోతాడో అని భయపడుతుంటారు. ఆ పిలాడితో ఒక గ్యాంగ్ ఉంటుంది. ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు వీడితో పాటే తిరుగుతూ, ఆడుకుంటూ ఉంటారు. అయితే ఊర్లో అప్పుడప్పుడు వింత వింత పనులు జరుగుతుంటే, అందరూ కలిసి ఈ డ్యాంగ్ వైపు వేలెత్తి చూపిస్తారు. వీడు దెయ్యం, వీడి వల్ల మనకు ముప్పుని ఊర్లో వాళ్లు గొడవ మొదలుపెడతారు. ఊర్లో వాళ్లు వాడిని తరిమేయాలని ప్లాన్ చేస్తారు. ఈ ప్రాసెస్ లో వచ్చే భయం, కామెడీ, ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. చివరికి ఆ పిల్లాడు తన ఫ్రెండ్స్ కోసం ఏం చేశాడు ? తన తల్లి దగ్గరికి వెళ్లిపోయాడా? మనుషుల మధ్యే ఉండిపోయాడా ? అనే విషయాలను, ఈ పిల్ల దెయ్యం కథను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  తండ్రి కర్మకాండలో కలిసిన స్నేహం… ఎమోషన్స్ తో ఆకట్టుకుంటున్న మరాఠి ప్రేమకథ

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×