E-Paper
Advertisement

Comedy Thriller OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న అనిర్బన్ చక్రవర్తి డిటెక్టివ్ కామెడీ థ్రిల్లర్ సిరీస్… ఎప్పుడు, ఎక్కడ చూడచ్చో తెలుసా ?

Comedy Thriller OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న అనిర్బన్ చక్రవర్తి డిటెక్టివ్ కామెడీ థ్రిల్లర్ సిరీస్…  ఎప్పుడు, ఎక్కడ చూడచ్చో తెలుసా ?
Advertisement

Comedy Thriller OTT : బెంగాలీలో ‘ఏకేన్ బాబు’ (Eken Babu) ఫ్రాంచైజీ సూపర్ హిట్ అయింది. ఆడియన్స్ తెగ చూస్తూ నవ్వుకున్నారు ఈ కామెడీ సిరీస్ ను. అది ఎంతలా అంటే ఇప్పటి వరకు 7 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది ఈ ఫ్రాంచైజీ. దీని నుంచి మూడు సినిమాలు కూడా వచ్చాయి. బెంగాలీలో పాపులర్ అయిన ఈ సిరీస్, 2025 చివరలో హిందీలోకి డబ్ అయ్యి Sony SAB ఛానల్‌లో ప్రసారమవుతోంది. ప్రస్తుతానికి ఈ సిరీస్ అధికారికంగా తెలుగులో అందుబాటులో లేదు. మీరు దీనిని Hoichoi ఓటీటీలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు. అయితే ఇప్పుడు ఎనిమిదవ సీజన్ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్దమవుతోంది. మరో సారి ఆడియన్స్ ను అలరించడానికి వచ్చేస్తోంది ఈ సిరీస్.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

‘ఏకేన్ బాబు’ (Eken Babu) ఫ్రాంచైజీ నుంచి వస్తున్న ఈ సీజన్ 8 పేరు ‘ఏకేన్ బాబు: పురూలియా-ఏ పక్రావ్’ (Eken Babu: Purulia-e Pakrao). ఈ కొత్త సీజన్ 2026 ఏప్రిల్ 15నుంచి Hoichoi ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటివరకు 7 సీజన్లు, 3 సినిమాలు (The Eken, Eken Babu Eibar Kanchajunghay, The Eken: Benaras e Bibhishika) వచ్చి హిట్ అయ్యాయి. మరోసారి ‘ద ఏకేన్ 4’ (The Eken 4) అనే సినిమాను కూడా 2026 అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ . ఇందులో ఎప్పటిలాగే అనిర్బన్ చక్రవర్తి ఏకేన్ బాబుగా నటిస్తుండగా, ఆయన స్నేహితులు బాపి (సుహోత్ర ముఖోపాధ్యాయ), ప్రమథ (సోమక్ ఘోష్) పాత్రల్లో సందడి చేయనున్నారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఏకేన్ బాబు తన స్నేహితులు బాపి, ప్రమథలతో కలిసి పురూలియాలోని ఒక ఆశ్రమానికి విహారయాత్రకు వెళ్తాడు. అక్కడ ప్రశాంతంగా గడపాలని అనుకుంటాడు. ఆశ్రమంలో ఉండగా, అక్కడి పురాతనమైన అత్యంత విలువైన పచ్చ విగ్రహం అకస్మాత్తుగా మాయమవుతుంది. ఈ దొంగతనాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న క్రమంలో, ఏకేన్ బాబుకు ఒక పెద్ద మెడికల్ కుంభకోణం గురించి తెలుస్తుంది. కొందరు కేటుగాళ్లు కలిసి చేస్తున్న మందుల దందాను, ఆ విగ్రహం దొంగతనాన్ని తనదైన శైలిలో కామెడీని పండిస్తూనే ఏకేన్ బాబు ఎలా కనిపెట్టాడనేదే ఈ సీజన్ కథ.

Read Also :  ఓటీటీలోకి వచ్చేస్తున్న వెండితెర అద్భుతం… గుండెలను హత్తుకునేలా సిద్ధాంత్-మృణాల్ లవ్ స్టోరీ.. ఎప్పుడు ఎక్కడ చూడచ్చో తెలుసా ?

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×