Constable Kanakam 2: ఇటీవల కాలంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని సందర్భాలలో వెబ్ సిరీస్ లు సినిమాల కంటే అద్భుతమైన ఆదరణం రాబడుతున్న నేపథ్యంలో ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్ లలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పలువురు హీరోయిన్లు వెండి తెరపై పెద్దిగా సక్సెస్ అందుకోలేకపోయిన వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలాంటి వారిలో నటి వర్ష బొల్లమ్మ(Varsha Bollamma) ఒకరు. ఈమె కానిస్టేబుల్ పాత్రలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు కానిస్టేబుల్ కనకం (Constable Kanakam ) అనే సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సిరీస్ ఈటీవీ విన్ (Etv Win)లో ప్రసారమై మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో తాజాగా ఈ సిరీస్ రెండో భాగానికి సంబంధించి కీలక అప్డేట్ తెలియజేశారు. కానిస్టేబుల్ కనకం సీజన్ 2 (Constable Kanakam 2)త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని ఈ టీవీ విన్ అధికారికంగా తెలియజేశారు. కానిస్టేబుల్ కనకం సీజన్ 2 2026 జనవరి 8వ తేదీ నుంచి ఈటీవీ విన్లో అందుబాటులోకి రాబోతుందని తెలిపారు. విడుదల తేదీని అధికారికంగా వెల్లడించడమే కాకుండా ప్రేక్షకులకు అద్భుతమైన ఆఫర్ కూడా ఇచ్చారు.
ఈటీవీ విన్ నెలవారీ సబ్ స్క్రిప్షన్ తీసుకునేవారు win 50 కోడ్ ఉపయోగించి 50% రాయితీ పొందవచ్చు అదేవిధంగా win 100 కోడ్ ఉపయోగించి సంవత్సరం మొత్తం 100 రూపాయల రాయితీని పొంది అవకాశాన్ని ఇచ్చారు. ఏది ఏమైనా మొదటి సీజన్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకుని ఇప్పుడు రెండవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా కాస్త ఆతృత కనబరుస్తున్నారు. ఇక ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ(Varsha Bollamma) కానిస్టేబుల్ కనకం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే ఈ సూపర్ హిట్ వెబ్ సిరీస్ కు ప్రశాంత్ కుమార్ దిమ్మెల దర్శకత్వం వహించారు.
Silence had questions.
Season 2 has all the answers.All questions lead to one truth.
Where is Chandrika?Constable Kanakam Season 2
📅 From Jan 8
📲 Only on @etvwinUse code 'WIN50' – ₹50 OFF on Monthly Premium Pack
Use code 'WIN100' – ₹100 OFF on Yearly Premium Plus… pic.twitter.com/69ofBdKk5u— ETV Win (@etvwin) December 28, 2025
ఈ సిరీస్ కథ ఏంటి అనే విషయానికి వస్తే.. కానిస్టేబుల్ గా బాధ్యతలు తీసుకున్న కనకం ఉద్యోగ నిమిత్తం ఒక ఊరికి వెళ్తారు. అక్కడ తనకు చంద్రిక (మేఘ లేఖ) పరిచయమవుతుంది. వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడటంతో స్నేహితులుగా మారుతారు అయితే ఒకరోజు చంద్రిక కనకం కలిసి బండిమీద వెళుతుండగా అనుకోని ప్రమాదం జరుగుతుంది ఆ సమయం నుంచి చంద్రిక కనిపించకుండా పోతుంది. అయితే చంద్రిక ఏమైంది? ఆ గ్రామంలోని మహిళలు కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి? మహిళల అదృశ్యం వెనక దాగి ఉన్న మర్మం ఏంటి? ఈ సమస్యను కనకం ఎలా పరిష్కరించారనేది ఈ సిరీస్ కథాంశం.
Also Read: Siddu jonnalagadda: ఆ రెండు సినిమాలను పక్కన పెట్టి.. కొత్త ప్రాజెక్ట్ సెట్ చేసుకున్న జొన్నలగడ్డ