E-Paper
Advertisement

Crime comedy drama OTT : ఓటీటీలోకి మరో ఇంటెన్స్ క్రైమ్ కామెడీ సిరీస్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

Crime comedy drama OTT : ఓటీటీలోకి మరో ఇంటెన్స్ క్రైమ్ కామెడీ సిరీస్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
Advertisement

Crime comedy drama OTT : కొత్త ఏడాది కొత్త కొత్త సిరీస్ లు ఓటీటీలోకి అడుగు పెడుతున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అప్డేట్ వచ్చింది. చౌపాల్ ఒరిజినల్ హర్యాన్వి క్రైమ్ కామెడీ డ్రామా ఈ జనవరిలోనే స్ట్రీమింగ్ కానుంది. మరి ఆ సిరీస్ పేరేంటి? దాని కథ ఏంటి? అన్న విషయాలను తెలుసుకుందాం పదండి.

చౌపాల్ ఓటీటీలో స్ట్రీమింగ్

గత సంవత్సరం విడుదలైన ‘కాల్‌ చకర్’, ‘తుచ్చ లంబార్దార్’ సీజన్ 3 వంటి సిరీస్ లకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ జనవరిలో చౌపాల్ మరో ఒరిజినల్ హర్యాన్వి వెబ్ సిరీస్ ‘లాల్ జోడా’ ఎంట్రీకి సిద్ధమవుతోంది. నిజానికి చౌపాల్ ఓటీటీ గురించి ఆడియన్స్ కు పెద్దగా తెలియదు. అయితే ఈ స్ట్రీమర్ ఎక్కువగా పంజాబీ సినిమాలతో పాటు, అదే భాషలో విడుదలయ్యే కొన్ని ఇంట్రెస్టింగ్ సిరీస్ లను కూడా స్ట్రీమింగ్ చేస్తోంది. అలాగే చౌపాల్‌ లో హర్యాన్వి, భోజ్‌పురి కంటెంట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇక ‘లాల్ జోడా’ విషయానికొత్తే ఇదొక క్రైమ్ థ్రిల్లర్ బ్లాక్ కామెడీ సిరీస్.

Advertisement

హర్యాన్వి వెబ్ సిరీస్ ‘లాల్ జోడా’ (Lal Joda) 2026 జనవరి 8న చౌపాల్ ఓటీటీలో విడుదల కానుంది. ‘లాల్ జోడా’లో ( అంటే ఎర్రటి పెళ్లి దుస్తువులు అని అర్థం) నాలుగు ఎపిసోడ్‌లు ఉంటాయి. అన్నీ ఒకే రోజు విడుదల అవుతాయి. ఈ వెబ్ సిరీస్‌లో సికందర్ చౌహాన్, శ్యామ్ రాజ్‌పుత్, హీర్ లాథర్, దుర్గా పాండే, సోమ్య రాజ్‌పుత్, రాజీవ్ మిట్టల్, జుగల్ కె నాయక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read Also :  ఈ సినిమా కోసం డైరెక్టర్ భార్య నగలు, ఇల్లు తాకట్టు… కట్ చేస్తే కాసుల వర్షం

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

ఓ వ్యక్తి ఆకస్మిక మరణంతో మూవీ ప్రారంభమవుతుంది. సాధారణంగానే అందరూ దీన్ని ఒక విషాదం అని భావిస్తారు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి గుండెపోటుతో మరణించినట్లు కనిపిస్తుంది. ఇక కొంతమంది అలా హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు అనుకుంటే, మరికొంత మంది ఏదో అతీంద్రియ శక్తి పనే ఇది అనుకుంటారు. పురాతన మూఢ నమ్మకాలను నమ్మే ఆ ఊర్లో గ్రామ ప్రజలు అతీంద్రియ శక్తుల వల్లే ఇలా జరిగిందని అనుకుంటారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహం చుట్టూ ఉన్న భయంకరమైన పరిస్థితులపై అనుమానాలు వ్యక్తం చేస్తారు. అందులో భాగంగానే కిల్లర్ అతన్ని చంపిన తొందరలో వదిలేసిన హింట్ పోలీస్ దృష్టిలో పడుతుంది. అది శాపం కాదు ప్లాన్ చేసి చేసిన హత్య అన్న విషయం బయట పడుతుంది. మరి ఇంతకీ అతన్ని చంపింది ఎవరు ? ఎందుకు చంపారు ? అన్నది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.

చౌపాల్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ సిరీస్ లు

మరి జనవరి 8న ‘లాల్ జోడా’ను చూడాలనుకున్నారా ? అయితే అంతకంటే ముందు చౌపాల్‌లో ఉన్న ఇతర వెబ్ సిరీస్ ల పై ఒక లుక్కేయండి. ఈ లిస్ట్ లో మింటూ కపా నటించిన ‘వర్దాత్’ , విశ్వాష్ చౌహాన్ ‘స్కామ్’ , హ్యాపీ కలీజ్‌పురియాస్ ‘బక్లోలి యార్’, నరేంద్ర యాదవ్ నటించిన ‘కచ్చధారి’, హరిఓమ్ కౌశిక్ ‘బహు కలే కి’, రాజు మాన్ ‘అభితొ పార్టీ షురూ హుయే హై’ వంటి హర్యాన్వీ వెబ్ సిరీస్‌లను చూడండి.

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×