Mythological Drama OTT : సినిమాలను తెరకెక్కించడం అంటే అంత ఈజీ కాదు. కోట్ల ఖర్చుతో కూడుకున్న పని. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నీళ్లలా ఖర్చు అవుతాయి. పైగా అవుట్ పుట్ అనుకున్న విధంగా రాకపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే సినిమాల విషయంలో దర్శకనిర్మాతలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ కొన్ని సినిమాలు మాత్రం బడ్జెట్ సమస్యలతో మధ్యలోనే ఆగిపోతాయి. మరికొన్ని సినిమాలపై హిట్ అవుతుందనే నమ్మకంతో మేకర్స్ తమ సొంత ఆస్తులనే కుదువ పెట్టేస్తుంటారు. తాజాగా రీసెంట్ గా ఇండియాను షేక్ చేసిన ఒక యానిమేటెడ్ సినిమా కోసం కూడా దర్శకుడు తన భార్య నగలు తాకట్టు పెట్టాడు అన్న వార్త తాజాగా హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ మూవీ ఏంటి? అసలు విషయం ఏంటి ? అన్నది తెలుసుకుందాం పదండి.
యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ (Mahavatar Narsimha) జూలై 25న థియేటర్లలో విడుదలై, ఇండియన్ సినిమా హిస్టరీలోనే కొత్త చరిత్ర సృష్టించింది. చాలా సంవత్సరాల తర్వాత, పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఇష్టపడే పాన్-ఇండియా యానిమేటెడ్ చిత్రాన్ని ప్రేక్షకులు ఈ సినిమా ద్వారా చూడగలిగారు. ఈ చిత్రం ఎంత ఎఫెక్ట్ చూపించిందంటే, చాలా థియేటర్లలో ప్రజలు సినిమా చూడటానికి ముందే చెప్పులు డోర్ దగ్గరే విడిచి పెట్టారు. ఎందుకంటే కథ భారతీయ పౌరాణిక గ్రంథాల ఆధారంగా విష్ణువు అవతారమైన నరసింహుడి గురించి. అయితే ఈ గొప్ప విజయం వెనుక చాలా తక్కువ మందికి తెలిసిన పోరాట కథ దాగి ఉంది. దర్శకుడు అశ్విన్ కుమార్ “మహావతార నరసింహ” చిత్రాన్ని రూపొందించడానికి అన్నిటినీ పణంగా పెట్టాల్సి వచ్చిందని రీసెంట్ గా ఓ సందర్భంలో వెల్లడించారు. దర్శకుడు అశ్విన్ కుమార్ 300 కోట్ల వసూళ్లు సాధించిన యానిమేషన్ చిత్రం “మహావతార నరసింహ”ను రూపొందించడానికి ఏకంగా తన ఇంటిని, భార్య నగలను కూడా తాకట్టు పెట్టాడు.
Read Also : తెలివైన అమ్మాయిల్నే కిడ్నాప్ చేసే సైకో… ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ ఎంట్రీతో ఊహించని ట్విస్టులు
దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలతో కనెక్ట్ అయ్యే ఆధ్యాత్మిక చిత్రాన్ని రూపొందించడమే తన కల అని అశ్విన్ కుమార్ వివరించారు. “1975లో వచ్చిన ‘జై మా సంతోషి’ తర్వాత, ఏ పౌరాణిక చిత్రం పాన్-ఇండియా బాక్సాఫీస్ వద్ద ఇంత ప్రభావాన్ని చూపలేదు. నేను ఇలాంటిదే సృష్టించాలనుకున్నాను, కానీ కాలం మారిపోయింది. నేటి యువతరానికి మన పౌరాణిక కథలను తెలియజేయడానికి యానిమేషన్ ఉత్తమ మాధ్యమంగా అనిపించింది” అని ఆయన అన్నారు.
ఈ సినిమా తీయడం అంత సులభం కాదు. తాను, ఆ సినిమా నిర్మాత అయిన తన భార్య తమ పొదుపు మొత్తాన్ని ఈ ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టామని అశ్విన్ కుమార్ అంగీకరించాడు. “మేము మా సంపాదనను, నా భార్య నగలను, మా ఇంటిని కూడా తనఖా పెట్టాము. ఈ సినిమా మాకు కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, ఇది ఒక నమ్మకం” అని ఆయన చెప్పుకొచ్చారు. కాగా ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.