E-Paper
Advertisement

Dashavatar OTT : ఆస్కార్ రేసులోకి అడుగుపెట్టిన మరాఠీ మూవీ ‘దశావతార్’ ఏ ఓటీటీలో ఉందో తెలుసా ?

Dashavatar OTT : ఆస్కార్ రేసులోకి అడుగుపెట్టిన మరాఠీ మూవీ ‘దశావతార్’ ఏ ఓటీటీలో ఉందో తెలుసా ?
Advertisement

Dashavatar OTT : 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మరాఠీ చిత్రంగా నిలిచిన దశావతార్ (Dashavatar) మరో చారిత్రాత్మక ఘనతను సాధించింది. ఈ చిత్రం 2026 ఆస్కార్ అవార్డులకు ఎంపికైంది. దీంతో ప్రపంచ స్థాయిలో ఇంతగా గుర్తింపు పొందిన మొట్టమొదటి మరాఠీ చిత్రంగా రికార్డును నెలకొల్పింది ఈ మూవీ. ‘హోమ్‌బౌండ్’ తర్వాత ఈ సంవత్సరం ఆస్కార్ వేదికకు చేరుకున్న రెండవ భారతీయ చిత్రం ఇది. మరి ఈ మూవీలో అంతగా ఏముంది ? మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

ఆస్కార్ ఎంట్రీ

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మరాఠీ చిత్రం ‘దశావతార్’ ఆస్కార్ 2026కి ఎంపికైంది. ఇంతటి ఘనత సాధించిన తొలి మరాఠీ చిత్రం ఇదే కాగా… ఈ చిత్ర దర్శకుడు సుబోధ్ ఖానోల్కర్ సోషల్ మీడియాలో ఈ వార్తను కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రం ‘మెయిన్ ఓపెన్ ఫిల్మ్ కేటగిరీ’లోకి ప్రవేశించిందని ఆయన వెల్లడించారు.

జీ5లో స్ట్రీమింగ్

Advertisement

ప్రస్తుతం ‘దశావతార్’ మూవీ జీ5 (Zee5)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో దిలీప్ ప్రభావల్కర్ నటనకు అద్భుతంగా ఉంటుంది. మరాఠీ జానపద కథల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అభినయ్ బెర్డే, ప్రియదర్శిని ఇండల్కర్, సిద్ధార్థ్ మీనన్, ఆర్తి వడగ్బాల్కర్, రవి కాలే, విజయ్ కేంక్రే కూడా నటించారు. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో రూపొందిన ఈ చిత్రం విష్ణువు 10 అవతారాల స్టోరీతో సాగుతుంది. ఈ చిత్రం ప్రాంతీయ మరాఠీ సినిమాను ప్రపంచ పటంలో ఉంచిన మొదటి చిత్రం కావడం విశేషం.

Read Also :  ‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5’ రికార్డును బ్రేక్ చేసిన సిరీస్… ఇంకా చూడలేదా ?

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో దశావతార ప్రదర్శనలు ఇప్పటికీ భారీ ఆకర్షణగా కొనసాగుతున్నాయి. సాంప్రదాయ నాటక రూపం విష్ణువు పది అవతారాల చుట్టూ సాగుతాయి ఈ డ్రామాలు. సుబోధ్ ఖనోల్కర్ ‘దశావతార్’ను కూడా అటువంటి ఒక కళాకారుడి కథగా రూపొందించారు. తన జీవితాంతం సాంప్రదాయ నాటక రంగంలో ప్రదర్శన ఇచ్చిన వ్యక్తి బాబులి (దిలీప్ ప్రభావల్కర్ ). గ్రామంలో దశావతారానికి దాదాపు పర్యాయపదంగా ఉంటాడు ఆయన. ఆయన డ్రామాలను, పర్ఫార్మెన్స్ ను జనాలు ఎంతగానో ఆరాదిస్తారు. కానీ బాబులికి వయస్సు మీద పడుతుంది. అందుకే డాక్టర్, అతని కుమారుడు మాధవ్ ( సిద్ధార్థ్ మీనన్ ) ఇంక నాటకాలు వేయడం ఆపాలని కోరతాడు. మాధవ్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాక మానేస్తానని బాబులి హామీ ఇస్తాడు. కొడుకు డాక్టర్ కావడంతో బాబులి తన మాట నిలబెట్టుకుని, మహాశివరాత్రి వేడుకల సందర్భంగా తన చివరి ప్రదర్శనను ప్రకటిస్తాడు. మరోవైపు, మాధవ్ కూడా తన స్నేహితురాలు వందన ( ప్రియదర్శిని ఇందాల్కర్ )ని శుభ దినాన వివాహం చేసుకుంటానని తండ్రిని అడగాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఆ రోజే విషాదం సంభవిస్తుంది. మరి ఏం జరిగింది ? అన్నది తెరపై చూడాల్సిందే.

‘దశావతార్’లో ప్రధాన పాత్రలో దిలీప్ ప్రభావల్కర్ అద్భుతంగా నటించాడు. 81 ఏళ్ల వయసులో కూడా అతని నటనకు శారీరకంగా లిమిట్స్ ఉండవచ్చు. కానీ అతను ప్రదర్శించిన భావాలు, వాయిస్ మాడ్యులేషన్ ఇదొక దృశ్యకావ్యం అన్పించేలా చేస్తాయి. సిద్ధార్థ్, ప్రియదర్శిని కూడా తమ నటనతో అదరగొట్టారు.

‘హోమ్ బౌండ్’ ఓటీటీ స్ట్రీమింగ్

ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘హోమ్ బౌండ్’. నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా 2026 ఆస్కార్ అవార్డులకు భారతదేశం నుండి అధికారిక ఎంట్రీ పొందింది. నిజానికి ఇషాన్ ఇప్పటికే ఈ చిత్రాన్ని ప్రపంచ వేదికపై ప్రమోట్ చేయడం ప్రారంభించాడు. ఇక ఈ మూవీని ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు.

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×