E-Paper
Advertisement

Crime Drama OTT : బ్లాక్ బస్టర్ తమిళ క్రైమ్ డ్రామా ఓటీటీ స్ట్రీమింగ్… తెలుగు ఆడియన్స్‌కు నిరాశ తప్పదా ?

Crime Drama OTT : బ్లాక్ బస్టర్ తమిళ క్రైమ్ డ్రామా ఓటీటీ స్ట్రీమింగ్… తెలుగు ఆడియన్స్‌కు నిరాశ తప్పదా ?
Advertisement

Crime Drama OTT : విక్రమ్ ప్రభు నటించిన ‘సిరై’ (Sirai) సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అయింది. కంటెంట్ కొత్తగా ఉందని ప్రశంసలు కూడా వచ్చాయి. ఇక ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ ని కూడా పలకరించబోతోంది. రేపటినుంచి ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ఇక అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ని మాత్రం బాగా నిరాశపరుస్తోంది. అసలు సంగతి ఏంటి ? ఎందుకు నిరాశపరుస్తోంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ….

నిరాశ ఎందుకు అంటే

సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మించిన ‘సిరై’ చిత్రం లో విక్రమ్ ప్రభుతో పాటు ఎల్.కె. అక్షయ్ కుమార్, అనిష్మా అనిల్‌కుమార్, అనంత తంబిరాజా కీలక పాత్రల్లో నటించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చారు. ఇది సురేష్ రాజకుమారి దర్శకత్వంలో తెరకెక్కింది. థియేటర్లలో 2025 డిసెంబర్ 25 (క్రిస్మస్)న రిలీజ్ అయింది. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వచ్చి, మౌత్‌ టాక్ తో బాక్సాఫీస్‌లో సర్‌ప్రైజ్ హిట్ అయింది. ఇక 2026 జనవరి 23 నుంచి ZEE5లో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. అయితే ఈ సినిమా తమిళంలో మాత్రమే ఉంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ లేదు, ఇది తెలుగు ఆడియెన్స్‌కు నిరాశ కలిగించే విషయం. హిట్ మూవీ అయినా, డబ్ లేకపోతే చాలా మంది మిస్ అవుతారు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కోసం భవిష్యత్తులో వేచి చూడాల్సిందే. ఈ చిత్రాన్ని ఇతర భాషల్లోకి డబ్ చేస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

విక్రమ్ ప్రభు కెరీర్‌లో 25వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా హత్య కేసులో నిందితుడైన ఒక యువకుడిని, జైలు నుండి కోర్టుకు తీసుకువెళ్లే ఒక పోలీస్ కానిస్టేబుల్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ క్రమంలో ఎదురయ్యే సంఘటనలు చాలా మలుపులు తిరుగుతాయి. ఆ ప్రయాణంలో నిందితుడి గతాన్ని తెలుసుకున్న ఆ పోలీస్ ఏం చేశాడన్నాదే ఈ కథ. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు 30 కోట్లు వసూలు చేసి మంచి విజయాన్ని అందుకుంది. 2025లో తమిళ చిత్ర పరిశ్రమలో చివరి హిట్ చిత్రంగా ఇది నిలిచింది. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను అలరించడానికి వచ్చేస్తోంది. కోర్ట్ రూమ్ డ్రామా లను ఇష్టపడేవాళ్ళు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది.

Read Also : 6 ఆస్కార్ నామినేషన్లు… IMDB రేటింగ్ 8.2… ఇలాంటి సినిమాను ఇప్పటిదాకా చూసుండరు భయ్యా

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×