E-Paper
Advertisement

Crime Drama OTT : టాలీవుడ్ ఆడియన్స్ ను డీప్ గా డిసప్పాయింట్ చేసిన కోలీవుడ్ క్రైమ్ డ్రామా… ఏమైందంటే ?

Crime Drama OTT : టాలీవుడ్ ఆడియన్స్ ను డీప్ గా డిసప్పాయింట్ చేసిన కోలీవుడ్ క్రైమ్ డ్రామా… ఏమైందంటే ?
Advertisement

Crime Drama OTT : నటుడు ప్రభు కుమారుడు విక్రమ్ ప్రభు నటించిన సినిమా ‘సిరై’ (Sirai). ఈ చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై, బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధించింది. ఏకంగా 31 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ సినిమా. ఒక ఖైదీ, కానిస్టేబుల్ చుట్టూ తిరిగే ఈ కథ ఆడియన్స్ ను కట్టిపడేసింది. అయితే ఇది ఓటీటీలో అడుగు పెట్టినప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులు తీవ్రంగా నిరాశ చెందారు. అసలు ఏం జరిగింది ? ఎందుకు ఈ నిరాశ ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

అసలు ఏంటి సంగతి ఏంటంటే

సురేష్ రాజకుమారి దర్శకత్వం వహించిన ‘సిరై’ మూవీ డిజిటల్ ప్రీమియర్‌ను ఇటీవలే ZEE5లో ప్రదర్శించారు. అయితే తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో లేకపోవడంతో తెలుగు సినీ ప్రియులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్లు మాత్రమే ఉండటంతో అసలు సమస్య వచ్చి పడింది. అయితే సదరు ప్లాట్‌ఫామ్ ఇప్పుడు తెలుగు వెర్షన్‌ను కూడా జోడించింది. విమర్శలు ఎక్కువగా రావడంతో ఈ సమస్యకు తెరదించింది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో కూడా చూడచ్చు. 2025లో విడుదలైన ఈ తమిళ చిత్రంలో విక్రమ్ ప్రభు, నూతన నటుడు ఎల్.కె. అక్షయ్ కుమార్, అనిష్మా అనిల్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటించారు. థియేటర్లలో విడుదలైన తర్వాత, సిరాయ్ ఇటీవలే ZEE5లో అరంగేట్రం చేసింది.

కథ ఏమిటి ?

Advertisement

సిరాయ్ మూవీ ఎస్కార్ట్ పోలీస్‌గా పనిచేస్తున్న కతిరవన్ చుట్టూ తిరిగే క్రైమ్ డ్రామా. అతను ఒక హత్య కేసులో నిందితుడైన అబ్దుల్‌ను కోర్టుకు హాజరుపరచాలి. ఈ ప్రయాణంలో, అతను అబ్దుల్ గత కథ గురించి తెలుసుకోవడమే కాకుండా అతనికి న్యాయం చేయడంలో కూడా సహాయపడతాడు. నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందించబడిన సిరాయ్, పోలీసు వ్యవస్థలోకి లోపాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. మరి అబ్దుల్‌ కి హత్య కేసులో శిక్ష పడిందా ? కతిరవన్ అతనికి ఏ విధంగా సహాయం చేశాడు ? అనే విషయలను ఈ కోర్ట్ రూమ్ డ్రామా సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : బీచ్ కెళ్తే తిరిగిరారు… కంటికి కన్పించకుండా ప్రాణాలు తీసే వింత జీవి… మెంటలెక్కించే సై-ఫై డ్రామా

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×