E-Paper
Advertisement

Sci-fi Horror Thriller OTT : ఈ బీచ్ కెళ్తే తిరిగిరారు… కంటికి కన్పించకుండా ప్రాణాలు తీసే వింత జీవి… మెంటలెక్కించే సై-ఫై డ్రామా

Sci-fi Horror Thriller OTT : ఈ బీచ్ కెళ్తే తిరిగిరారు… కంటికి కన్పించకుండా ప్రాణాలు తీసే వింత జీవి… మెంటలెక్కించే సై-ఫై డ్రామా
Advertisement

Sci-fi Horror Thriller OTT : వింత జీవులు మనుషులపై దాడి చేసే కథలు చాలానే ఉన్నాయి. అయితే 1980లో వచ్చిన ఒక హారర్ సినిమా కల్ట్ క్లాసిక్ గా గుర్తింపు పొందింది. ఈ కథ శాంటా మోనికా బీచ్ లో ఇసుక కింద దాగి ఉన్న ఒక వింత జీవి చుట్టూ తిరుగుతుంది. ఇది అక్కడికి వచ్చే వాళ్ళను ఇసుకలోకి లాగేసి చంపుకు తింటూ ఉంటుంది. ఈ సినిమాకి అప్పట్లో ఒక ట్యాగ్‌లైన్ కూడా పెట్టారు. “మీరు నీటిలోకి తిరిగి వెళ్లడం సురక్షితమని అనుకున్నప్పుడు మీరు దానిని చేరుకోలేరు.” ఈ హారర్ సినిమాను మీరు ఫ్రీగానే చూడవచ్చు. ఇది ఎక్కడ ఉంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

యూట్యూబ్ లో స్ట్రీమింగ్

1980లో వచ్చిన ఈ అమెరికన్ హారర్ చిత్రం పేరు ‘బ్లడ్ బీచ్’ (Blood Beach). 1980లో విడుదలైన ఈ సినిమాకు జెఫ్రీ బ్లూమ్ రచించి దర్శకత్వం వహించారు. ఇందులో డేవిడ్ హఫ్ఫ్మన్, జాన్ సాక్సన్, బర్ట్ యంగ్ నటించారు. ఇది ఒక ‘కల్ట్ క్లాసిక్’ చిత్రంగా గుర్తింపు పొందింది. అప్పట్లో తక్కువ బడ్జెట్‌తో తీసినా, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే

Advertisement

శాంటా మోనికా బీచ్‌లోని ఇసుక కింద దాగి ఉన్న ఒక వింత జీవి, బీచ్‌కు వచ్చిన పర్యాటకులను ఇసుకలోకి లాగేసి చంపేస్తుంటుంది. ఒక రోజు ఉదయం రూత్ అనే వృద్ధురాలు తన కుక్కతో కలిసి బీచ్‌లో నడుస్తుండగా, హఠాత్తుగా ఇసుకలోకి లాగబడి కనిపించకుండా పోతుంది. ఆమె అరుపులు విన్న ఒక పెట్రోలింగ్ ఆఫీసర్ అక్కడికి వెళ్తాడు. కానీ ఆమె ఆచూకీ లభించదు. రూత్ కుమార్తె క్యాథరిన్ తన తల్లి మిస్సింగ్ వార్త విని నగరానికి వస్తుంది. ఆమె తన పాత స్నేహితులతో కలిసి ఈ మర్మమైన మిస్సింగ్ ల వెనుక ఉన్న కారణాన్ని వెతకడం మొదలు పెడుతుంది.

ఈ సమయంలో బీచ్‌లో మరిన్ని వింత సంఘటనలు జరుగుతాయి. ఆ బీచ్ దగ్గర ఉన్న ఒక పాత స్టోరేజ్ టన్నెల్ గురించి తెలుస్తుంది. అక్కడ వెతకగా, ఇసుక కింద ఒక భయంకరమైన జీవి నివసిస్తున్నట్లు వీళ్ళు గుర్తిస్తారు. ఆ జీవి ఇసుక కింద ఉండి తన వేటను సాగిస్తుంది .ఆ జీవిని చంపడానికి భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను ఉపయోగిస్తారు. చివరికి ఆ జీవి అంతమవుతుందా ? మరిన్ని మరిన్ని మిస్సింగ్ లు జరుగుతాయా ? అనేది ఈ సీమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  దెయ్యంతో సైంటిస్ట్ కు దబిడి దిబిడి… అమ్మాయి తోడుగా కావాలంటూ గోల… ఆస్కార్ రేసులో హర్రర్ మూవీ

Tags

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×